‘నమస్తే’ని చైనీస్‌లో ఏమంటారు?
న్యూదిల్లీ: కేంద్ర రక్షణశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం అరుణాచల్‌ప్రదేశ్, సిక్కింలలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె అక్కడి సరిహద్దుల్లో పహారా కాస్తున్న చైనా సైనికులతో కాసేపు ముచ్చటించారు. ఈ వీడియోను కేంద్ర రక్షణ మంత్రిత్వశాఖ ట్విటర్ ద్వారా పంచుకుంది. కేంద్రమంత్రి, చైనా సైనికుల మధ్య జరిగిన ఆసక్తికర సంభాషణ వీడియో ఇప్పుడు ఆన్‌లైన్‌లో వైరల్ అయ్యింది. పర్యటన సందర్భంగా చైనా సైనికులను ‘నమస్తే’ అంటూ నిర్మలా సీతారామన్ పలకరించారు.
‘‘నమస్తే’ దీని అర్థం మీకు తెలుసా?’’ అని చైనా సైనికులను ఆమెఅడగ్గా..
‘మిమ్మల్ని కలిసినందుకు సంతోషం’ అనుకుంటున్నా అని చైనా సైనికుడు చిరునవ్వులు చిందించాడు.
‘మిమ్మల్ని కలిసినందుకు సంతోషం’ అనుకుంటున్నా అని చైనా సైనికుడు చిరునవ్వులు చిందించాడు.
‘‘చైనాలో ‘నమస్తే’ని ఏంమంటారు’’? అని మంత్రి ఈ సందర్భంగా అడిగారు.
‘నిహోవ్’ అంటూ బదులిచ్చాడు.
‘నిహోవ్’ అంటూ బదులిచ్చాడు.
అనంతరం ఒకరి తర్వాత ఒకరు కేంద్ర మంత్రిని ‘నమస్తే’, ‘నిహోవ్’ అంటూ పలకరించారు.
అంతకుముందు భారత్-చైనా సరిహద్దులోని డోక్లాం-నాథులా ప్రాంతాన్ని ఆమె విహంగ వీక్షణం చేశారు. ఆగస్టు 28న రెండు దేశాల బలగాలు అక్కడి నుంచి వెనక్కి వెళ్లాక క్షేత్రస్థాయి పరిస్థితిలో ఎలాంటి మార్పూ లేదని కేంద్రం శుక్రవారం ప్రకటించిన నేపథ్యంలో మంత్రి పర్యటనకు ప్రాధాన్యం ఏర్పడింది.

Comments
Post a Comment