ఆ రోజు ఈ ఒక్క దండం ఉక్కు మనిషి పెట్టించుకోకుంటే... ఇవాళ మనం ఎందరు దౌర్భాగ్యులకి దండాలు పెట్టాల్సి వచ్చేదో! వందనం... అభివందనం!
*భారత జాతిని ఐక్య పరిచిన ఉక్కుమనిషి* _బ్రిటిష్ వారు భారత దేశానికి స్వాతంత్ర్యం ఇచ్చి వెళ్లారు.. ఉక్కుమనిషి భారత దేశాన్ని సమైక్య పరిచారు.. వారు ముక్కలుగా వదిలేసి పోతే, ఆయన అన్నింటికీ కలిపారు.. విశాల భారత దేశ విలీనాధీశునిగా చరిత్రలో శాశ్వత స్థానం దక్కించుకున్నారు.. నవ భారత దేశ నిర్మాత సర్ధార్ వల్లభాయ్ పటేల్ జయంతి అక్టోబర్ 31ని జాతీయ ఐక్యతా దినోత్సవంగా జరుపుకుంటున్నాం.._ గుజరాత్ రాష్ట్రంలోని నదియాద్ లో 31 అక్టోబర్ 1875 నాడు జన్మించారు వల్లభాయ్ పటేల్.. ఇంగ్లాండ్ లో బారిస్టర్ చదువుకొని వచ్చి అహ్మదాబాద్ లో న్యాయవాద వృత్తిని చేపట్టారు. ఈ క్రమంలో భారత స్వాతంత్ర్య పోరాటంలో చేరారు వల్లభాయ్.. సహాయ నిరాకరణ, బర్దోలీ సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమంలో చురుకైన పాత్రను పోశించారు. బ్రిటిష్ ప్రభుత్వం ఆయనను జైలు పాలు చేసింది.. 1931లో కరాచీలో జరిగిన ఆలిండియా కాంగ్రెస్ మహాసభల్లో పార్టీ అధ్యక్ష పదవి చేపట్టారు.. సర్దార్ వల్లభాయ్ పటేల్ దేశ స్వాతంత్ర్యం తర్వాత ఉప ప్రధానమంత్రి పదవి చేపట్టారు.. 565 స్వదేశీ సంస్థానాలను భారత దేశంలో సంపూర్ణంగా విలీనం చేయడం ద్వారా నవ భారతానికి బాటలు వేశారు.. విలీనం కావడానికి మొండికే...