కిషన్ రెడ్డి నుండి ప్రభుత్వ పాఠశాలలకు వసతులు: సికింద్రాబాద్ టాయ్ లెట్ క్లీనింగ్ మిషన్
సికింద్రాబాద్ పార్లమెంట్ బేగంపేట్, నీయర్ కట్ట మైసమ్మ టెంపుల్, ఓల్డ్ కష్టం బస్తీ లోని ప్రభుత్వ పాఠశాలలో ఫర్నిచర్ తో పాటు టాయ్ లెట్ క్లీనింగ్ మిషన్ పంపిణీ చేసిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి గారు ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు మాట్లాడిన ముఖ్యంశాలు రానున్న రోజుల్లో ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు మరింత మెరుగుపరుచుకోవాల్సిన అవసరం ఉందని తెలంగాణ రాష్ర్ట బీజేపీ అధ్యక్షులు, కేంద్ర, బొగ్గుగనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి అన్నారు. శనివారం బేగంపేట్ లోని కట్టమైసమ్మ ప్రభుత్వ పాఠశాలలో టాయ్ లెట్ క్లీనింగ్ మిషన్ ను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి మాట్లాడారు. 75వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకల శుభాకాంక్షలను తెలిపారు. రాజ్యాంగాన్ని రూపొందించుకొని 75 సంవత్సరాలు పూర్తవుతున్నాయన్నారు. విద్యావ్యవస్థలో అనేకరకాల మార్పులు తెచ్చేందుకు కృషి చేస్తున్నామని మంత్రి తెలిపారు. నూతన విద్యా విధానం ప్రవేశపెట్టాక అందరూ స్వాగతం పలికారని చెప్పారు. రానున్న రోజుల్లో ఈ విద్యావిధానం అమలు చేయాల్సిన అవసర ఉందన్నారు. రోజురోజుకు అమ్మభాష, మాతృభాషకు ఆదరణ పెరుగుతుందన్నారు. హైస్కూల్ స్థాయిలో వి...