Posts

Showing posts from October, 2018

కామన్వెల్త్‌ పీహెచ్‌డీ స్కాలర్‌షిప్‌లు

Image
కామన్వెల్త్‌ పీహెచ్‌డీ స్కాలర్‌షిప్‌లు అంతర్జాతీయ స్థాయిలో ప్రసిద్ధిగాంచిన కామన్వెల్త్‌ పీహెచ్‌డీ స్కాలర్‌షిప్‌లకు నోటిఫికేషన్‌ విడుదలైంది. యునైటెడ్‌ కింగ్‌డమ్‌లోని విశ్వవిద్యాలయాల్లో పీహెచ్‌డీ చేయడానికి కామన్వెల్త్‌ దేశాల విద్యార్థులకు బ్రిటన్‌ ప్రభుత్వం ఈ స్కాలర్‌షిప్‌లను అందిస్తోంది. యూకే డిపార్ట్‌మెంట్‌ ఫర్‌ ఇంటర్నేషనల్‌ డెవలప్‌మెంట్‌ (డీఎఫ్‌ఐడీ) వీటికి నిధులను సమకూరుస్తుంది. కామన్వెల్త్‌ దేశాల్లో అకడమిక్‌, ఇతర రంగాల్లో సంస్థాగత సామర్థ్యాన్ని పెంపొందించడం, వ్యక్తిగత శిక్షణ, పరిశోధనా సామర్థ్యాన్ని అభివృద్ధి చేసే ఉద్దేశంతో ఈ స్కాలర్‌షిప్‌లను ప్రవేశపెట్టారు.  దరఖాస్తుదారులు కామన్వెల్త్‌ దేశాల పౌరులై  ఉండాలి. సెప్టెంబరు/ అక్టోబరు 2019 నుంచి ప్రారంభమయ్యే యూకే విద్యా సంవత్సరంలో మాస్టర్స్‌ డిగ్రీ చదవడానికి ప్రవేశం పొంది ఉండాలి. ఈ నిర్ణీత సమయం కంటే ముందు పీహెచ్‌డీలో లేదా ఎంఫిల్‌లో ప్రవేశం పొందినవారు అనర్హులు. అలాగే స్వదేశంలోగానీ మరే ఇతర దేశంలోనైనా పీహెచ్‌డీ కోసం నమోదు చేసుకుని ఉండకూడదు. కామన్వెల్త్‌ పీహెచ్‌డీ స్కాలర్‌షిప్‌ కోసం కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ ద్వారా దరఖాస...

అప్రెంటిస్‌షిప్‌ ఐవోసీఎల్‌లో 1,340 ఖాళీలు

Image
ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ దేశవ్యాప్తంగా ఉన్న వివిధ రిఫైనరీల్లో కింది అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.  * టెక్నీషియన్‌ అప్రెంటిస్‌/ ట్రేడ్‌ అప్రెంటిస్‌  విభాగాలు: మెకానికల్‌, కెమికల్‌, ఎల‌క్ట్రికల్‌, ఇన్‌స్ట్రుమెంటేషన్‌.  ఖాళీలు: 1,340  అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో పదోతరగతితోపాటు ఐటీఐ, మూడేళ్ల డిప్లొమా, బీఎస్సీ ఉత్తీర్ణత.  వయసు: 18-24 సంవత్సరాల మధ్య ఉండాలి.  ఎంపిక: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా.  ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేది: నవంబరు 9.  హార్డు కాపీలను పంపడానికి చివరి తేది: నవంబరు 17 https://iocl.com/ ప్రభుత్వ ఉద్యోగాలు  పవర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌   పవర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.  పోస్టులు-ఖాళీలు: అసిస్టెంట్‌ ఇంజినీర్‌ (సేఫ్టీ)-12, అసిస్టెంట్‌ ఆఫీసర్‌ (అకౌంట్స్‌)-02, సీనియర్‌ ఇంజినీర్‌ (ఎలక్ట్రికల్‌)-01, డిప్యూటీ మేనేజర్‌ (ఎల‌క్ట్రికల్‌)-01  అర్హత: నిబంధనల ప్రకారం ప్రకటనలో తెలిపిన విధంగ...