ప్రజలకు గుడ్ న్యూస్, గ్యాస్ కనెక్షన్ తీసుకుంటే రూ.1,600 ఇస్తారు. ఎలానో తెలుసా..?
మోదీ సర్కార్ ఉజ్వల స్కీమ్ కింద కొత్తగా ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ కనెక్షన్ తీసుకునే వారికి రూ.1,600 అందిస్తోంది. ఈ డబ్బుతో గ్యాస్ కనెక్షన్ కొనుగోలు చేయొచ్చు. అంతేకాకుండా గ్యాస్ స్టవ్, గ్యాస్ సిలిండర్ వంటి వాటికి అయ్యే ఖర్చును మీరు ఈఎంఐ రూపంలో చెల్లించుకునే వెసులుబాటు ఉంది. అయితే కేంద్రం దేశంలోని ప్రజలకు ప్రయోజనం చేకూర్చాలనే ఉద్దేశంతో ఎన్నో స్కీమ్ లను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. అలా కేంద్రం అమలు చేస్తున్న స్కీమ్ లలో ఉజ్వల స్కీమ్ కూడా ఒకటి. ఈ స్కీమ్ ద్వారా అర్హత ఉన్నవాళ్లు గ్యాస్ కనెక్షన్ ను తీసుకుంటే రూ.1,600 పొందవచ్చు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2021 బడ్జెట్ లో కోటి గ్యాస్ కనెక్షన్లు ఇస్తామని కీలక ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. ఈ స్కీమ్ ద్వారా గ్యాస్ సిలిండర్ ను కొనుగోలు చేసిన వాళ్లకు గ్యాస్ స్టవ్, గ్యాస్ సిలిండర్ కొరకు అయ్యే ఖర్చును ఈఎంఐ రూపంలో చెల్లించే అవకాశం ఉంటుంది. కేంద్రం ఇచ్చే 1,600 రూపాయలతో గ్యాస్ సిలిండర్ ను కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. బీపీఎల్ కుటుంబానికి చెందిన మహిళలు ఉజ్వల స్కీమ్ యొక్క ప్రయోజనాలను పొందవచ్చు. ఉజ్వల వెబ్ సైట్ నుంచి ఈ స్కీమ్ కు సంబంధించిన అప్లిక...