Posts

Showing posts from January, 2021

త్వరలో నిరుద్యోగ భృతి !హమ్మయ్య 2023 ఎలెక్షన్స్లో వింటాననుకున్న పర్లేదు,

Image
త్వరలో నిరుద్యోగ భృతి ! హమ్మయ్య 2023 ఎలెక్షన్స్లో వింటాననుకున్న పర్లేదు, 2018 ఎన్నికల్లో ఇచ్చిన హామీని 2021 లో నెరవేరుస్తామని చెప్తున్నారు చాలా సంతోషం! 2018  Dec నుండి ఇప్పటివరకు నెలకు 3000 చొప్పున 25 నెలలకు మొత్తంగా 75000 ఇస్తారా? Bandi Sanjay Kumar అన్న ని నోరు అదుపులో పెట్టుకోమనడం కాదు మీ MLA లు రోజుకొకరు తోలు తీస్తాం, కొడితే ఎవడు మిగలడు లాంటి పదజాలాన్ని వాడుతున్నారు వాళ్ళకి చెప్పండి! సంజయ్ అన్న గత పదినెలలనుండి ఈ ప్రభుత్వ వైఫల్యాలని ఎండగట్టడం వల్లనే ఈరోజు మీ నుండి ఈ హామీల ప్రస్తావన వస్తుందన్న విషయం తెలంగాణ ప్రజలు గమనిస్తూనే ఉన్నారు! సహనం గురించి మీరు అస్సలు మాట్లాడకండి! మీ పార్టీ వారు , ప్రశ్నించిన వారి పైన చేస్తున్న అరాచకాలు, SM లో బూతులతో అడ్డమైన కామెంట్స్ తో చేసే పెంట ని సహించి చూడండి సహనం గురించి అపుడు మాట్లాడండి! Jai Telangana  Bharat Matha ki Jai 🇮🇳

Guys,First read this post and then look at the images.Deep Sidhu is a Punjabi actor.

Image
Guys, First read this post and then look at the images. Deep Sidhu is a Punjabi actor. In 2019 Loksabha elections, he campaigned for BJP leader & Bollywood actor Sunny Deol. There are many such singers & actors in Punjab who support Khalistan behind closed doors. For example Hard Kaur, Jazzy B, etc. Deep Sidhu is one of them. The first day when it was said that Deep Sidhu is a Khalistani. Our liberals said he's voice of farmers. Later, He also gave pro Khalistani statement in his interview to Barkha Dutt. And, Now, our liberals are deleting their old tweets in which they were supporting Deep Sidhu. We were telling that Deep Sidhu is a Khalistani. And, Khalistanis infiltrated farmers' protest. But at that time, only we were being  abused & labeled as communal. Deep Sidhu had become "The Voice of Farmers" for them. MLA Naresh even made Deep Sidhu a farmer. Few days ago, NIA s...

వరల్డ్ ఎకనామిక్ ఫోరం దావోస్ డైలాగ్‌ను రేపు వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగించనున్నారు.

Image
వరల్డ్ ఎకనామిక్ ఫోరం దావోస్ డైలాగ్‌ను రేపు వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగించనున్నారు. ఈ సెషన్‌లో ప్రపంచవ్యాప్తంగా 400 మందికి పైగా పరిశ్రమల నాయకులు పాల్గొంటారు,  ఇందులో పిఎం మోడీ నాల్గవ పారిశ్రామిక విప్లవం గురించి ప్రసంగిస్తారు - మానవత్వం యొక్క మంచి కోసం సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం.కార్యక్రమంలో సిఇఓలతో ప్రధాని కూడా సంభాషించనున్నారు.  COVID అనంతర ప్రపంచంలో వరల్డ్ ఎకనామిక్ ఫోరం యొక్క గ్రేట్ రీసెట్ ఇనిషియేటివ్ ప్రారంభించడాన్ని దావోస్ డైలాగ్స్ ఎజెండా సూచిస్తుంది.

*తెలంగాణ‌పై ప్ర‌ధాని మోదీ ప్ర‌శంస‌లు*

Image
*తెలంగాణ‌పై ప్ర‌ధాని మోదీ ప్ర‌శంస‌లు* తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వంపై కేంద్రం ప్ర‌శంస‌లు కురిపించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బుధవారం అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో ప్రగతి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.  ఈ సంద‌ర్భంగా వివిధ రైల్వే ప్రాజెక్టులు, హైవే ప్రాజెక్టులు, పారిశ్రామిక కారిడార్లు, ప్రధానమంత్రి భారతీయ జనౌషధి పరియోజనలో సాధించిన పురోగతిని పీఎం సమీక్షించారు.  ఈ సంద‌ర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఎన్‌హెచ్‌-161 లోని సంగారెడ్డి–అకోలా– నాందేడ్ సెక్షన్‌కు చెందిన నాలుగు లేనింగ్ విషయంలో సాధించిన పురోగతిని పీఎం మోదీ అభినందించారు.   భూసేకరణ, పంపిణీలో రాష్ట్ర ప్రభుత్వం అద్భుతమైన పురోగతి సాధించిందని కేంద్ర రవాణా కార్యదర్శి ఎ.గిరిధర్ తెలిపారు.  ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, రవాణా, రహదారులు, భవనాలశాఖ ముఖ్య కార్యదర్శి సునీల్ శర్మ, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కార్యదర్శి ఎస్ఏఎం రిజ్వీ , ఔషధ నియంత్రణ పరిపాలనశాఖ సంచాలకులు డా.ప్రీతి మీనా, ఇతర అధికారులు పాల్గొన్నారు

ఉద్యోగులకు ఫిట్ మెంట్ పేరుతో కేసీఆర్ కొత్త డ్రామా కు తెరలేపాడు

Image
ఉద్యోగులకు ఫిట్ మెంట్ పేరుతో కేసీఆర్ కొత్త డ్రామా కు తెరలేపాడు . ఇప్పుడిస్తా, అప్పుడిస్తా అని వూరించి, వూరించి మూడేండ్ల తర్వాత ఇప్పుడు బిశ్వల్ కమిటీ రిపోర్ట్ తో వుసూరు అనిపించిండు. అందరినీ మోసం చేసే..., ఉద్యోగాలు ఇస్తా అని పిలగాండ్లను, నిరుద్యోగ భృతి ఇస్త అని నిరుద్యోగులను, సన్న వడ్లు అని రైతులను..ఇప్పుడు ఉద్యోగులను కూడా మోసం చేసిండు. 7.5 శాతం, పది శాతం ఫిట్ మెంట్ ఇయ్యనీకే ఒక కమిటీ వేయల్నా...మూడేండ్లు టైమ్ తీసుకోవాల్నా..? అసలు బిష్వాల్ కమిటీ పని చేసిందా...స్వతంత్రంగా పని చేయనిచ్చారా ? ఫాం హౌజ్ ల కూసోని పి.అర్.సి రాయించినవా కేసీఆర్ ? ఉద్యోగులను నమ్మియ్యనీకే బిశ్వల్ కమిటీ వేసి, ఆ కమిటీ ఏం రాయాలే.., ఎంత రాయాలే..., ఒత్తిడి పెంచి ఆ రిపోర్ట్ రాపించారు. ఫిట్ మెంట్ 7.5 శాతం ఇచ్చి HRA 6 శాతం తగ్గించటం దారుణం, మోసం. ఇచ్చినట్లే ఇచ్చి గుంజుకున్నవ్, ఉద్యోగుల ను మోసం చేసినవ్. 7.5% PRC ఇచ్చి CPS 10% తగ్గిస్తారు. 30 శాతం ఉన్న సి.పి.ఎస్ ఉద్యోగికి ఈ  పి.అర్.సి ద్వారా జీతం పెరగదు. పైగా 2.5 శాతం జీతం తగ్గుతది. 31 నెలల నుంచి ఉద్యోగులు ఎదురుచూస్తుంటే వాళ్లకు ఇచ్చేది ఇదా. ఉద్యోగులు డిమాండ్ చే...

అసలు సమస్య MSP కానే కాదు! ఇంకా వేరే ఏదో ఉంది*

Image
*అసలు సమస్య MSP కానే కాదు! ఇంకా వేరే ఏదో ఉంది*   ఒకవేళ నిజంగా MSP నే సమస్య అయితే పంజాబ్ ప్రభుత్వమే దానిని చట్టబద్ధం చేసి రైతుల దగ్గర నుండి కొనవచ్చు. కేంద్ర నూతన వ్యవసాయ చట్టాలని పంజాబ్ లో అమలు చేయము అని అసెంబ్లీ లో తీర్మానాన్ని ఆమోదించిన వాళ్ళు పంజాబ్ వరకు MSP ని ఎందుకు చట్టబద్ధం చేయరు ?  2019 ఎన్నికల మేనిఫెస్టో లో కాంగ్రెస్ , ఆప్ పార్టీలు చేసిన వాగ్దానం ఇదే కదా ?  డ్రగ్ మాఫియా, రైతు మార్కెట్ దళారీలు ఒకే నాణానికి రెండు ముఖాలు ఒకటి తీసేస్తే ఇంకోటి చెల్లదు.  రెండు నెలలు రోజూ 1000 మందిని AC బస్సుల్లో తీసుకురావడం తీసుకువెళ్లడం లాంటి ఖరీదయిన పనులు డ్రగ్ మాఫియానే చేయగలదు అంతే కానీ నిజమయిన రైతు ఆ పని చేయలేడు.  ఈ రోజు రైతుల పేరుతో చేసిన విధ్వంసానికి వాడిన మోడిఫై చేసిన ఒక్కో ట్రాక్టర్ ఖరీదు అక్షరాల 35 లక్షలు. మానస్టర్ ట్రక్కులకి వాడే పెద్ద పెద్ద టైర్లు ట్రాక్టర్లకి వాడారు ఎత్తైన బారికేడ్ల మీద నుండి వెళ్ళడానికి.  ఇంతా చేస్తే మా అసలు లక్ష్యం నెరవేరినది అంటూ స్టేట్మెంట్ ఇచ్చారు. అది ఎవరి లక్ష్యం ?  ఐఎస్ఐ via కెనడా MNC ల హస్తం కూడా ఉంది.  2018 లో క...

అది రైతుల ఉద్యమమా?. ఖలిస్తానీ వేర్పాటు ఉద్యమమా?.. లేక రైతుల ముసుగులో జరుగుతున్న ఖలిస్తానీల ఉద్యమమా?.

Image
అది రైతుల ఉద్యమమా?. ఖలిస్తానీ వేర్పాటు ఉద్యమమా?.. లేక రైతుల ముసుగులో జరుగుతున్న ఖలిస్తానీల ఉద్యమమా?. కెనడాలో ఖలిస్తానీ సమర్ధకులతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ప్రధాని జస్టిన్ ట్రుడో  మద్దతు ఇచ్చిప్పుడే అనుమానం ఎందుకు రాలేదు?.. ఇందిరా గాంధీని పొట్టన పెట్టుకున్న పాకిస్తాన్ సమర్ధక ఖలిస్తానీల కారణంగా సిక్కులపై అన్యాయమైన దాడులు జరిగాయి.. కాల క్రమంలో ఖలిస్తాన్ ఉద్యమం అంతమై పంజాబ్ లో ప్రశాంత వాతావరణం ఏర్పడిన తర్వాత ఇంత కాలానికి మళ్లీ ఖలిస్తాన్ భూతాన్ని తిరిగి లేపుతున్నది ఎవరు? ప్రభుత్వం చర్చలకు పిలిచినప్పుడల్లా చట్టాలను రద్దు చేయమనే డిమాండ్ తప్ప ఒక్క మెట్టూ దిగి రాలేదు.. అప్పుడే అర్థం కాలేదా?.. వీరి లక్ష్యం రైతులకు న్యాయం చేయడం కాదని.. రైతుల మేలు కోసం తెచ్చిన చట్టాలను ఇంత మొండిగా వ్యతిరేకించడంలో మతలబు ఏమిటో? రైతుల చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమం చేస్తున్నది ధనిక రైతులు, మండీ కమిషన్ల ఏజెంట్లు కాదా?.. అన్ని వేల ట్రాక్టర్లు ఎక్కడి నుంచి వచ్చాయి? వారి డీజిల్ ఖర్చు? మీ పంచభక్ష ఫలహారాలు, మసాజులు, విందులు, వినోదాల ఖర్చులు ఎవరు స్పాన్సర్ చేస్తున్నారు? ట్రాక్టర్ ర్యాలీ రిపబ్లిక్ డే రోజునే ...

Amazon Great Republic Day Sale అంటే ఆసక్తిగా చూశాను.. మన మాతృభూమితో కూడిన ప్రపంచ చిత్ర పటంతో ఉన్న ఈ గోడ గడియారం నచ్చి కొందామనుకున్నాను.. కానీ

Image
Amazon Great Republic Day Sale అంటే ఆసక్తిగా చూశాను.. మన మాతృభూమితో కూడిన ప్రపంచ చిత్ర పటంతో ఉన్న ఈ గోడ గడియారం నచ్చి కొందామనుకున్నాను.. కానీ ఎందుకో తేడా అనిపించింది.. జాగ్రత్తగా గమనిస్తే జమ్మూ కశ్మీర్, లద్దాక్ ప్రాంతాలను కొంత పాకిస్తాన్, మరి కొంత చైనాల్లో చూపించారు. ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఆర్డర్ రద్దు చేశాను.. భారత దేశ గణతంత్ర దినోత్సవం పేరుతో వ్యాపారం చేసుకుంటూ.. దేశ సమగ్రతను, భారతీయులను ఈ విధంగా అవమానించడం భావ్యమా Amazon వారు ఆలోచించాలి. ఇందుకు క్షమాపణలు చెప్పుకోవడంతో పాటు ఆ వస్తువు అమ్మకాలు నిలిపివేయాలని ఒక భారతీయునిగా డిమాండ్ చేస్తున్నాను.. #Amazon #amazondeals #amazonshopping

బ్రెజిల్ కు భారత్ కరోనా వ్యాక్సిన్, సంజీవననితో పోల్చిన బ్రెజిల్‌ ప్రధాని.

Image
ఇండియాలో తయారు చేసిన వ్యాక్సిన్ కు ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల నుంచి ఆర్డర్లు వస్తున్నాయి. ఔషధసాయంలో భాగంగా వ్యాక్సిన్‌ మైత్రీ పేరుతో ఈ టీకాలను భారత్‌ పొరుగు దేశాలకు అందిస్తోంది. రెండు మిలియన్ మోతాదులను తీసుకోవడానికి బ్రిటన్ అంగీకరించింది. కరోనా మహమ్మారిపై పోరాడటానికి భారతదేశం తయారు చేసిన టీకా..మానవాళికి ఉపయోగపడుతుందని, పలు దేశాల నుంచి వస్తున్న అభ్యర్థనలకు సానుకూలంగా స్పందిస్తున్నట్లు కేంద్ర మంత్రి హర్షవర్దన్ వెల్లడించారు. అయితే ఇండియాలో తయారైన రెండు మిలియన్‌ డోసుల కరోనా వ్యాక్సిన్లు బ్రెజిల్‌కు శనివారం చేరాయి. అయితే… వ్యాక్సిన్లు చేరుకోవడంపై బ్రెజిల్‌ అధ్యక్షుడు జైరో బోల్సోనారో ట్విట్టర్‌ వేదికగా స్పందించారు. కరోనాతో ఇబ్బందుల్లో ఉండగా ఇండియా వ్యాక్సిన్‌ సరఫరా చేయడంపై.. ఆయన హర్షం వ్యక్తం చేశారు. ప్రధాని మోడీకి థ్యాంక్స్‌ చెప్పిన ఆయన హనుమంతుడు సంజీవని తెచ్చినట్లు… భారత వ్యాక్సిన్‌ తెచ్చిందని పేర్కొన్నారు. ఈ మేరకు ఓ చిత్రాన్ని పోస్ట్‌ చేసిన బొల్సెనారో.. “వ్యాక్సిన్‌ ఎగుమతి చేసినందుకు భారత్‌కు ధన్యవాదాలు. ప్రపంచాన్ని వణికించిన కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు ఇండియాతో భాగస్వామ్యం కావడం గర్వ...

స్వాతంత్ర్యం అంటే అడిగి తీసుకునే బిక్ష కాదు.. పోరాడి సాధించుకోనే హక్కు..'

Image
' స్వాతంత్ర్యం అంటే అడిగి తీసుకునే బిక్ష కాదు.. పోరాడి సాధించుకోనే హక్కు..' " మీరు నాకు రక్తాన్ని ఇవ్వండి.. నేను మీకు స్వేచ్ఛనిస్తాను.." భారత స్వాతంత్ర్య  పోరాట కాలంలో మంత్రంలా వినిపించిన సమర నినాదం ఇది.. 'ఛలో ఢిల్లీ ', 'జైహింద్ ' అంటూ ఆ మహా నాయకుడు ఇచ్చిన నినాదాలు ఈనాటికీ సజీవంగా ఉన్నాయి.. భరతమాత బానిస శృంఖలాలు తెంచడానికి  విదేశీ నేలపై తొలి స్వతంత్ర భారత సైన్యాన్ని, తొలి స్వతంత్ర భారత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన యోధుడాయన.. జననమే తప్ప మరణం లేని మహా నేత.. భారత దేశ ప్రజల హృదయాల్లో 'నేతాజీ'గా చిరస్థాయిగా నిలచిన అమరుడు.. అతి కొద్ది సంవత్సరాల ప్రజా జీవితంలో ఎన్నటికీ మరచిపోలేనంతటి అభిమానాన్ని చూరగొన్న మహోన్నత నాయకుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్.. జనవరి 23న సుభాష్ చంద్రబోస్ జయంతిని 'పరాక్రమ్ దివస్'గా ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. నేతాజీ 125 వ జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్న సందర్భంగా ఆ మహనీయున్ని గుర్తు చేసుకుందాం.. జైహింద్ (నేతాజీ జయంతి సందర్భంగా జాగృతి పత్రికలో నేను రాసిన 'నిప్పై జ్వలించిన నినాదం.. జైహింద్' అందరూ చదవాల్సిందిగా ...

నేతాజీ సుభాష్ చంద్రబోస్ అందించిన 'జై హింద్' నినాదం వెనుక ఓ హైదరాబాదీ..

Image
నేతాజీ సుభాష్ చంద్రబోస్ అందించిన 'జై హింద్' నినాదం వెనుక ఓ హైదరాబాదీ.. హైదరాబాద్‌కు చెందిన అబిద్ హసన్ సాఫ్రాని 1911లో జన్మించారు. ఆయన ఇంజనీరింగ్ చదువు కోసం జర్మనీ వెళ్లారు. అక్కడ సుభాష్ చంద్రబోస్ ప్రసంగం విని ప్రభావితుడయ్యారు. ఇంజనీరింగ్ పూర్తయ్యాక తాను కూడా స్వాతంత్ర్య పోరాటంలో భాగస్వామినవుతానని బోస్ తో తెలిపారు. 'ఇలా చిన్న విషయాలకే పరిమితమైతే జీవితంలో పెద్ద లక్ష్యాలను ఎప్పటికీ సాధించలేవు' అని నేతాజీ అన్నారు. దీంతో అబిద్ హసన్ చదువు ఆపేసి సుభాష్ చంద్రబోస్ వ్యక్తిగత కార్యదర్శిగా, అనువాదకుడిగా చేరిపోయారు. ఆ తర్వాత ఆజాద్ హింద్ ఫౌజ్ లో మేజర్‌గా పని చేశారు. అప్పట్లో భారతీయ సైనికులంతా పరస్పరం పలకరించుకోడానికి 'నమస్తే, నమస్కార్, రామ్ రామ్, సత్ శ్రీ అకాల్, సలాం వాలేకుం..' పదాలు వాడేవారు. ఇన్ని పదాల బదులు దేశ భక్తిని చాటే ఒకే పదం కావాలని నేతాజీ భావించారు. ఇందు కోసం సరైన పదం సూచించాలని అందరినీ కోరారు. అప్పుడు అబిద్ 'జై హిందుస్తాన్' అని సూచించారు. ఆ తర్వాత దాన్ని కుదించి 'జై హింద్' అని మార్చారు. 'జై హింద్' నినాదం బోస్‌కు నచ్చడంతో వెంటనే ...

కరోనా వచ్చిన పురుషుల్లో కొత్త సమస్యలు, సైంటిస్టులు చెప్పిన సంచలన విషయాలు.

Image
బ్రిటన్‌లో కొత్త రకం కరోనా వైరస్ బయటపడిన విషయం తెలిసిందే. ఇది సాధారణ కోవిడ్ 19 కంటే 70 శాతం వేగంగా వ్యాప్తి చెందుతోందని చెబుతున్నారు. దీంతో మళ్లీ జనంలో భయాలు మొదలయ్యాయి. అయితే, అసలు యూకేలో కనిపించి, ఇప్పుడు భారత్‌‌లో వ్యాపించిందేమో అని ఆందోళన కలిగిస్తున్న కొత్త రకం వైరస్ లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసా..? బ్రిటన్ నేషనల్ హెల్త్ సర్వీస్ తెలిపిన వివరాల ప్రకారం కొత్త రకం కరోనా వైరస్ సోకిన వారికి అలసట, ఆకలి లేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. అయితే కరోనావైరస్ సోకిన పురుషుల్లో అత్యంత సాధారణ కోవిడ్ లక్షణం ఒకటి ఆందోళనకు గురిచేస్తోంది. కరోనా సోకిన పురుషుల్లో వృషణాల్లో వాపు, నొప్పితో పాటు క్రమంగా నపుంసకత్వానికి దారితీస్తుందని ఓ కొత్త అధ్యయనం వెల్లడించింది. పురుషుల్లో కరోనా సోకిన తర్వాత అధిక జ్వరంతో పాటు సంతానోత్పత్తి సమస్యలు ఎదుర్కోంటున్నారని నిపుణులు ఇటీవలి అధ్యయనంలో హెచ్చరించారు. కోవిడ్ జ్వరం.. పురుషుల వృషణాలు దెబ్బతిని వాపుకు కారణమవుతుందని తేలింది. జ్వరం, నిరంతర దగ్గు, రుచి లేదా వాసన కోల్పోవడం వంటివి కోవిడ్ మూడు ప్రధాన లక్షణాలుగా అందరికి తెలిసిందే. అయితే అధిక జ్వరం సాధారణంగా 38C లేదా అంతకంటే ఎక్కు...

సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్, ఛైర్మన్ ఎస్. పూనవల్లా నుండి స్టేట్మెంట్👇

Image
సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్, ఛైర్మన్ ఎస్. పూనవల్లా నుండి స్టేట్మెంట్👇 ఈ రోజు సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాలో మా అందరికి చాలా భయంకరమైన రోజు. విచారకరమైన రోజు మంజ్రీలోని స్పెషల్ ఎకనామిక్ జోన్ వద్ద ఉన్న మా అండర్ ఇన్‌స్టాలేషన్ సదుపాయంలో మంటలు చెలరేగాయి. మేము చాలా బాధపడ్డాము మా కుటుంబంలో మావారిని కొలుపోయాం, వారి కుటుంబాలకు మా సంతాపం💐 ఈ విషయంలో, నిబంధనల ప్రకారం తప్పనిసరి మొత్తానికి అదనంగా, ప్రతి కుటుంబానికి 25 లక్షల రూపాయల పరిహారాన్ని మేము అందిస్తున్నాము.  ఈ బాధ సమయాల్లో వారికి భగవంతుడుమనోధైర్యన్ని  ఇవ్వాలని కోరుకుంటున్న సిరం ఇనిస్టిట్యూట్ #సీఈఓ

బైటపడ్డ TRS నేతల అసంతృప్తి సెగ.

Image
బైటపడ్డ TRS నేతల అసంతృప్తి సెగ.  KTR సీఎం అవ్వడం ఒక కేసీఆర్ కి KTR కి హిమాన్షు కి తప్ప వాళ్ళ సొంత ఇంటి వారు అయిన కవిత హరీష్ రావు, సంతోష్ రావు కి కూడా KTR ని సీఎం చేయడం ఇష్టం లేదు అని స్పష్టంగా తెలుస్తుంది. ఉద్యమంలో కేసీఆర్ తో సమానంగా పోరాడిన ఈటల రాజేందర్ మరియు హరీష్ రావు లని అసలు ఉద్యమం అంటే ఏంటో తెలియని KTR కింద పనిచేయడం ఇష్టం లేదు అని సొంత కార్యకర్తలు బహిరంగంగా నే చెవుతున్నారు.  సిద్దిపేట జిల్లా TRS నాయకుల వాట్సప్ గ్రూప్ చాట్ చూస్తే ఈ విషయం తెలుస్తుంది. కేసీఆర్ కొడుకు అని తప్ప అసలు KTR కి ఎం అర్హత ఉంది అని సీఎం అవ్వాలి అని , అసలు కేసీఆర్ కొడుకు కాకపోతే KTR TRS పార్టీ లో ఒక వార్డ్ మెంబెర్ గా కూడా గెలవాడు అని కరీంనగర్ కి చెందిన ఒక భడా నేత బహిరంగంగా నే అన్నట్టు ఒక వార్తా ప్రగతి భవన్ లో చెక్కర్లు కొడుతుంది. అయితే TRS సీనియర్లు మాత్రం కేసీఆర్ మీద గౌరవం తో మౌనంగా ఉన్న లోపల మాత్రం కేసీఆర్ కుటుంబం కి బానిసలుగా ఉండటం ఇష్టం లేదు అని అనుకుంటున్నారు. అయితే ఈ సారి కచ్చితంగా దళితుడే ముఖ్యమంత్రి అని ఆ పార్టీ లో దళిత MLA లు అంటున్న లోపల వాళ్లు కూడా ఈ సారి మళ్ళీ దళితు...

ఇది కరీంనగర్ లో మన హిందు దేవుళ్ళకు ఇచ్చే గౌరవం...

Image
ఇది కరీంనగర్ లో మన హిందు దేవుళ్ళకు ఇచ్చే గౌరవం... స్థానిక బొమ్మకల్ చౌరస్థా వద్ద పార్టీ లకి అతీతంగా కట్టిన శ్రీ రామ జన్మభూమి నిధి సేకరణ ఫ్లెక్సీ ని నాలుగు ముక్కలుగా చింపి కింద పడేసారు.. చాలా బాధాకరం కేవలం రామ జన్మభూమి నిధి వివరించడానికి పెడితే దీన్ని కావాలని నాలుగు ముక్కలుగా చింపేశారు దీని మీద కఠిన చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాను.

దీనిమీద భయంకరమైన హిందువు అని చేపుకునే కేసీఆర్ గారు ఎం మాట్లాడుతారో చూడాలి

Image
దీనిమీద భయంకరమైన హిందువు అని చేపుకునే కేసీఆర్ గారు ఎం మాట్లాడుతారో చూడాలి 🤔🤔. మానవ ధర్మానికి ప్రతీక శ్రీరాములవారికి TRS పార్టీ ఇచ్చే గౌరవం ఏంటో అర్ధమైంది. నిన్న కరీంనగర్ లో శ్రీరాముల వారి ఫ్లెక్స్ చింపారు ఇప్పుడు ఆలయం వద్దు అంటున్నారు. దేశం మొత్తం రామరాజ్యం అవుతున్న వేళా ఈ నాయకులు మాత్రం చిల్ల ర రాజకీయాలు చేస్తున్నారు

భావ ప్రకటనా స్వేచ్ఛ మరీ హద్దులు మీరుతోంది.

Image
భావ ప్రకటనా స్వేచ్ఛ మరీ హద్దులు మీరుతోంది. కేవలం మెజారిటీ ప్రజల మనోభావాలను దెబ్బతీయడానికే జాతి వ్యతిరేకులు దీన్ని ఉపయోగిస్తున్నారని చాలా సందర్భాల్లో గమనించాం. సయోని ఘోష్ అనే బెంగాలి నటి, గాయని పరమశివున్ని అవమానించడం చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నెటిజర్లు మండిపడే సరికి తన ట్విట్టర్ ఖాతాను 2010లో ప్రారంభిస్తే, 2015లో ఎవరో హ్యాక్ చేసి ఈ పోస్టు పెట్టారని, ఆ తర్వాత వదిలేశానని నంగనాచి కబుర్లు చెబుతోంది సయోని.. మరి అప్పుడే పోలీసులకు ఎందుకు ఫిర్యాదు చేయలేదు? హిందూ మతాన్ని మాత్రం కించపడుస్తున్న సయోనిపై మేఘాలయ మాజీ గవర్నర్ తథాగతా రాయ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బెంగళూరులో మరో ఫిర్యాదు కూడా నమోదైంది. స్వయంప్రకటిన మేతావులు, అభ్యు'దయ్య'వాదులు ఇలాంటి చర్యలను ఎలాగూ ఖండించకపోగా వారికే అండగా నిలుస్తారు. మరి ఈ దేశంలో 'ఇంకా' మెజారిటీ సంఖ్యలోనే ఉన్న మతస్తులకేమైంది. ఇలాంటి చర్యలను అడ్డుకునేందుకు వారి మొద్దు చర్మం సహకరించడం లేదా?

GHMC ఎన్నికల్లో కూకట్‌పల్లి లోని 7 డివిజన్లలో 6

Image
GHMC ఎన్నికల్లో కూకట్‌పల్లి లోని 7 డివిజన్లలో 6 గెలుచుకొని బండి సంజయ్‌కు నేను వ్యాక్సిన్‌ వేశానని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అంటున్నారు.. మరి ఎల్ బీ నగర్ లోని 11 డివిజనల్లో 11 బీజేపీ గెలుచుకుంది.. అక్కడ ఎవరికి వ్యాక్సిన్ వేసినట్లు.. ఫలితాలకు, వ్యాక్సిన్లకు ఏమైనా పోలిక ఉందా అసలు? నోటికి ఏది తోచితే అది మాట్లాడటమేనా?

వద్దంటే కుదరదు, మీరు ఖచ్చితంగా వ్యాక్సిన్ తీసుకోవాల్సిందే.

Image
దేశ ప్రధాని నరేంద్ర మోదీ వ్యాక్సిన్ తీసుకుంటేనే ప్రజల్లో వ్యాక్సిన్ పట్ల ఉన్న భయం పోతుందని ప్రతిపక్షాలు విమర్శించిన పరిస్థితి. ఈ నేపధ్యంలో కీలకమైన వార్త వైరల్ అవుతోంది. కోవిడ్ వ్యాక్సినేషన్ రెండవ దశలో ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రులు వ్యాక్సిన్ తీసుకోవచ్చనే వార్త వైరల్ అవడం ప్రారంభమైంది. అయితే ఈ విషయంపై అధికారికంగా ఎటువంటి ప్రకటన వెలువడలేదు. అయితే దేశ వ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ఆరోగ్య కార్యకర్తలు, వైధ్య సిబ్బందితో పాటు మున్సిపల్ సిబ్బంది కూడా పాల్గొనాల్సి ఉంది. ఇందుకోసం కేంద్రం ఇప్పటికే సిద్దం అయ్యింది. వ్యాక్సినేషన్‌ పక్రియ ప్రారంభించి చాలా రోజులు అయినా కూడా ఇప్పటికి కొందరు వ్యాక్సిన్ తీసుకోవాలంటే భయపడుతున్నారు. వ్యాక్సిన్‌ ను ప్రతి రోజు లెక్క ప్రకారం ఇంత మందికి అని వేయాలని రూల్‌ పెట్టారు. కాని కొందరు వ్యాక్సిన్‌ వేసుకునేందుకు భయపడుతున్న కారణంగా ఆలస్యం అవుతుంది. వ్యాక్సిన్‌ వేయించుకోవాల్సిన వారు వద్దంటు వ్యాక్సినేషన్‌ కు రాకుంటే వారికి మళ్లీ వ్యాక్సిన్ ఇచ్చేది లేదు అంటూ కేంద్రం ప్రకటించింది. అలాగే వారి స్థానంలో వెంటనే మరొకరికి కూడా వ్యక్సిన...

అయోధ్యలో చేపట్టనున్న రామమందిర నిర్మాణానికి ఎవ్వరూ విరాళాలు ఇవ్వవద్దంటూన్నా కోరుట్ల టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యే విద్యాసాగర్

Image
అయోధ్యలో చేపట్టనున్న రామమందిర నిర్మాణానికి ఎవ్వరూ విరాళాలు ఇవ్వవద్దంటూన్నా కోరుట్ల టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యే  విద్యాసాగర్  మన గ్రామాల్లో రామాలయాలు ఉండగా అయోధ్య రామాలయం మనకెందుకు అంటు ప్రసంగించారు రామమందిరం పేరుతో బీజేపీ నాయకులు బిచ్చమెత్తుకుంటున్నారంటూ ఆయన వ్యాఖ్యానించారు. తామంతా శ్రీరాముడి భక్తులమేనని, బొట్టు పెట్టుకుంటేనే భక్తులమవుతామా అని బీజేపీ నేతలను ప్రశ్నించారు.

#త్రివేణీ సంగమస్థానం కందకుర్తిలో (గోదావరీనది మహారాష్ట్ర నుంచి తెలంగాణలో ప్రవేశించేదిక్కడే. హెడ్గేవార్ తండ్రిది మహారాష్ట్ర ..తల్లి పుట్టినూరు కందకుర్తి) డాక్టర్ హెడ్గేవార్ జన్మించారు...

Image
#త్రివేణీ సంగమస్థానం కందకుర్తిలో (గోదావరీనది మహారాష్ట్ర నుంచి తెలంగాణలో ప్రవేశించేదిక్కడే. హెడ్గేవార్ తండ్రిది మహారాష్ట్ర ..తల్లి పుట్టినూరు కందకుర్తి) డాక్టర్ హెడ్గేవార్ జన్మించారు... తల్లి వినత శాపవిమోచనం కోసం ఇంద్రసభ నుంచి అమృతభాండం తీసుకొస్తూ కాసేపు అక్కడ పెట్టాడని పురాణగాథ... ఓ సందర్భంలో కందకుర్తి వచ్చిన వారిని... ఆర్ఎస్ఎస్ స్థాపించాలనే ఆలోచన ఎలావచ్చిందీ అని ఎవరో అడిగితే...  డాక్టర్ జీ అన్నార్ట....'తల్లి దాస్యవిముక్తి కోసం గరడుడు ఏకంగా ఇంద్రుడితో తలపడ్డాడు..ఆ కార్యంలో కాసేపు ఇక్కడ ఆగాడు...ఇక్కడ పుట్టిన నేను నా తల్లిభారతి విముక్తికోసం...మాతృదేశ సేవకోసం ఆర్ఎస్ఎస్ నిర్మించానూ' అని...

ట్యాంక్‌బండ్‌పై రియల్‌ హీరో*ప్రముఖ సినీ నటుడు, రియల్‌ హీరో సోనూసూద్‌ హైదరాబాద్‌ ట్యాంక్‌ బండ్‌ను సందర్శించారు.

Image
*ట్యాంక్‌బండ్‌పై రియల్‌ హీరో* ప్రముఖ సినీ నటుడు, రియల్‌ హీరో సోనూసూద్‌ హైదరాబాద్‌ ట్యాంక్‌ బండ్‌ను సందర్శించారు.  ట్యాంక్‌ బండ్‌పై ప్రమాదవశాత్తు మరణించి, ఆత్మహత్యలు చేసుకున్న వారి మృతదేహాలను వెలికితీస్తూ ప్రజల హృదయాల్లో నిలిచిన శవాల శివను కలిసి సోనూ సూద్‌ అభినందించారు. ప్రజలు వివిధ రూపాల్లో అందజేసిన నగదుతో శివ ఇటీవల ఓ అంబులెన్స్‌ను కొనుగోలు చేసి ‘సోనూసూద్‌ అంబులెన్స్‌ సర్వీస్‌’ అని పేరు పెట్టాడు. ఈ వాహన ప్రారంభోత్సవానికి రియల్‌ హీరో సోనూసూద్‌ను ఆహ్వానించాలని నిర్ణయించాడు.  శివ కోరిక మేరకు హైదరాబాద్‌కు విచ్చేసిన సోనూసూద్‌ ట్యాంక్‌బండ్‌ వద్దకు వెళ్లాడు. అక్కడున్న అమ్మవారి ఆలయంలో ఎమ్మెల్యే ముఠా గోపాల్‌తో కలిసి పూజలు నిర్వహించారు. అనంతరం అంబులెన్స్‌ సేవలను ప్రారంభించారు.  ఆపదలో ఉన్న వ్యక్తులను ఆదుకోవడంలో శివ చేస్తున్న కృషిని ఈ సందర్భంగా సోనూసూద్‌ ప్రశంసించారు.  సమాజానికి అంకితభావంతో సేవలందిస్తున్న శివను యువత స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. నిస్వార్థం, అంకితభావంతో ప్రజలకు సేవలందించే శివ లాంటి వ్యక్తులు అనేక మంది ముందుకు రావాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగ...

🕉️హర్ హర్ మహాదేవ్🚩🕉️ఓం నమః శివయ🚩

Image
🕉️హర్ హర్ మహాదేవ్🚩 🕉️ఓం నమః శివయ🚩 సోమనాథ్ టెంపుల్ ట్రస్ట్ అధ్యక్షుడైన ప్రధాని శ్రీ నరేంద్ర మోడీని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. సోమనాథ్ పుణ్యక్షేత్రం అభివృద్ధికి మోడీ జీ అంకితభావం అద్భుతంగా ఉంది.  మోడీ జీ నేతృత్వంలోని ట్రస్ట్ సోమనాథ్ ఆలయ గౌరవాన్ని, వైభవాన్ని మరింత పెంచుతుందని నాకు నమ్మకం ఉంది అంటూ.   ట్విట్ చేసినా కేంద్ర హోంశాఖ మంత్రి శ్రీ అమిత్ షా గారు

అయోధ్యలో రామమందిర నిర్మాణానికి రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ విరాళం ఇవ్వడం లౌకిక విధానాలకు వ్యతిరేకమని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఉవాచ.

Image
అయోధ్యలో రామమందిర నిర్మాణానికి రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌  విరాళం ఇవ్వడం లౌకిక విధానాలకు వ్యతిరేకమని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఉవాచ. .  మరి ఇఫ్తార్ విందులు ఇవ్వొచ్చా మాస్టారూ?. ఇలా ఇస్తే లౌకిక విధానాలు వర్ధిల్లుతాయా?.. ప్రభుత్వ ఖర్చులతో అన్య మతస్తుల విందులు, వినోదాలు జరపొచ్చు.. కానీ హిందూ ఆలయానికి సొంతంగా విరాళం ఇస్తే మహా పాపం.. అంతే కదా నారాయణ గారు?.. మీరూ మీ డబుల్ స్టాండర్డ్ సెక్యులర్ విధానాలు తగలడ..

రసమయి అక్రమ కాలువను సక్రమం చేస్తున్న అధికారులు .

Image
రసమయి అక్రమ కాలువను సక్రమం చేస్తున్న అధికారులు .  ఇప్పటి వరకు చెరువులకు మాత్రమే నీరు నింపాలని పెట్టుకున్న లక్ష్యాన్ని రసమయి విషయం లో మాత్రం కాళేశ్వరం ఏ ప్యాకేజి పనులలో లేని విధంగా అక్కడి రైతులకు మాత్రమే 160 ఎకరాలు పారకానికి ఇసున్నారని అందుకు ప్రణాళికలో పెట్టారట ప్రాజెక్టు ఇంజనీర్లు . అది కూడా జూన్ నెలలో తవ్విన అక్రమ కాలువకు నవంబరులో టెండర్ ఇచ్చారు .నష్టపోతున్న పక్కపొంటి రైతులకు ఇప్పటివరకు ఇంకా పరిహారం కూడా ముట్టలేదట పాపం అధికార బలానికి బయపడి చెప్పామన్నట్లు చెబుతున్నారు. ఎదురించిన వారిపైన బెజ్జంకి మండలంలో జడ్పీటీసీ ,ఎంపీపీ తో పాటు mla దళితులు కావడం చేత ఎదురే లేకుండా sc, st అట్రాసిటీ కేసులను పెట్టిస్తా అని బెదిరిస్తూ పబ్బం గడుపుకుంటున్నారు. అక్రమంగా సిద్దిపేట జిల్లాలో కలుపుకున్న ప్రస్థానం నుండి నేటి వరకు అక్రమాలకు గడ్డ, trs అడ్డాగా మారింది

కొవిడ్ టీకా పంపిణీలో భారత్‌ ప్రపంచ రికార్డు

Image
ఒకరోజు టీకాల పంపిణీలో భారత్‌ మొదటి స్థానంలో నిలిచిందని కేంద్రం తెలిపింది. టీకా పంపిణీ విషయంలో యూకే, ఫ్రాన్స్‌, అమెరికాను భారత్‌ అధిగమించిందని పేర్కొంది. దీంతో కొవిడ్‌ టీకాల విషయంలో భారత్‌ ప్రపంచ రికార్డు సాధించిందని వెల్లడించింది. నిన్న దేశ వ్యాప్తంగా 2,07,229 మందికి టీకాలు ఇచ్చామని, రెండోరోజు ఆరు రాష్ట్రాల్లో కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ కొనసాగించినట్లు కేంద్రం తెలిపింది. ఇవాళ మొత్తం 17,072 మందికి కొవిడ్‌ టీకాలు వేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. రెండ్రోజుల్లో మొత్తం 2,24,301 మందికి టీకాలు ఇచ్చినట్లు తెలిపింది

రానున్న రెండేళ్లు భాజపాకు కీలకం: కిషన్‌రెడ్డి

Image
రానున్న రెండేళ్లు భాజపాకు కీలకం: కిషన్‌రెడ్డి తెలంగాణలో కుటుంబ పాలన పోవాలి.. భాజపా పాలన రావాలని కేంద్ర మంత్రి, భాజపా నేత కిషన్‌రెడ్డి అన్నారు. పార్టీ కార్యకర్తలతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలు మార్పు కోరుకుంటున్నారని తెలిపారు. రానున్న రెండేళ్లు భాజపాకు అత్యంత కీలకమని చెప్పారు. వరంగల్‌ మేయర్‌ పీఠాన్ని భాజపా గెలుస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. నాగార్జునసాగర్‌లోనూ కాషాయం జెండా ఎగురుతుందన్నారు.

ఎమ్మెల్యే పొలాల కోసం కాలువ నిర్మాణం.. అసలు విషయం అది కాదంటున్న అధికారులు

Image
టీఆర్ఎస్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌పై మరోసారి ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆయన తాజాగా మరో వివాదంలో చిక్కుకున్నారు. ఎమ్మెల్యే తన ఫామ్ హౌస్ కోసం అక్రమంగా కాలువ తవ్వించుకున్నారంటూ వచ్చిన ఆరోపణలు కీలక మలుపులు తిరుగుతున్నాయి. ఆ కాలువ రసమయి పొలాల కోసం కాదని అధికారులు చెబుతున్నారు. మరోవైపు ఈ ఆరోపణలు చేసిన కాంగ్రెస్ నేతపై టీఆర్ఎస్ నేతలు దౌర్జన్యం చేశారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టారు తెలంగాణ తెలంగాణ వార్తలు ఏపీ వార్తలు హైదరాబాద్ వరంగల్ ఖమ్మం నల్గొండ నిజామాబాద్ Hi Keshaboina Claim and earn your 84 Points REDEEM Logout సంక్షిప్తాలు క్విజ్ వార్తలు సినిమా లైఫ్‌స్టైల్ రాశి ఫలాలు టెక్నాలజీ వైరల్ అడ్డా జాబ్స్ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఫోటో గ్యాలరీ స్పోర్ట్స్ బిజినెస్ జోక్స్ ఆధ్యాత్మికం వీడియో గ్యాలరీ ట్రావెల్ టీవీ ఎన్నికలు బెస్ట్ డీల్స్ LIVE TV ఆటోమొబైల్ Profiles ట్రెండింగ్ భార్గవ్‌రామ్ అరెస్ట్? జీవితారాజశేఖర్ ధర్నా బీజేపీ నేత ఆత్మహత్య ఎమ్మెల్యే పొలాల కోసం కాలువ నిర్మాణం.. అసలు విషయం అది కాదంటున్న అధికారులు Shaik Begam  | Samayam Telugu  |  Updated: 17 Jan 2021...

కారోన సమయంలో టెస్టులు చేయక, హాస్పిటల్ లో ఆక్సిజన్ అందక, బెడ్లు లేక, ప్రైవేట్ లో లక్షలు కట్టలేక ఎంతో మంది చనిపోయి

Image
కారోన సమయంలో టెస్టులు చేయక, హాస్పిటల్ లో ఆక్సిజన్ అందక, బెడ్లు లేక, ప్రైవేట్ లో లక్షలు కట్టలేక ఎంతో మంది చనిపోయి ఇంకెంతో మంది అవస్థలు పడినప్పుడు పట్టిచుకోకుండా బైటికి రాని మన రాష్ట్ర ముఖ్యమంత్రి కేంద్ర ప్రభుత్వం వాక్సిన్ రిలీస్ చేయగానే మంది పెళ్లిలో మంగళహారతి పట్టడనికి వచ్చినట్టు డబ్బా కొట్టుకోవడానికి అయ్యా కొడుకులు వచ్చేసారు

ప్రధాని నరేంద్ర మోదీ తెలుగులో మాట్లాడితే అవహేళన చేసిన వారు అద్దంలో మీ మొహాలు చూసుకోండి.. మీ తెలుగు మాటల్లో స్పష్టత ఎంత ఉంది?..

Image
ప్రధాని నరేంద్ర మోదీ తెలుగులో మాట్లాడితే అవహేళన చేసిన వారు అద్దంలో మీ మొహాలు చూసుకోండి.. మీ తెలుగు మాటల్లో స్పష్టత ఎంత ఉంది?.. ఎంగిలిపీసు ముక్కలు లేకుండా నాలుగు వాక్యాలు మాట్లాడ గలరా? మీకు అదికూడా చేత కాలేదు కదూ?.. మోదీజీ తన మాతృభాష కాకపోయినా తెలుగులో మాట్లాడే ప్రయత్నం చేసినందుకు సంతోషంగా ఆహ్వానించాలి.. ' దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్..' అని చాటిన మన తెలుగు కవి గురజాడ అప్పారావు గురుంచి ప్రస్థావించి, దేశ ప్రజలకు పరిచయం చేయడం గర్వించాల్సిన సందర్భం.. ప్రధాని మోదీ గతంలో తమిళ కవి తిరువళ్లువర్ సూక్తులను ఆ భాషలోనే చెప్పినప్పిడు తమిళ ప్రజలు ఆనంద పడ్డారు.  మన తెలుగు వారు మాత్రం ప్రధాని ఎలా మాట్లాడాడు చూడండి అని అవహేళన చేస్తున్నాం.. అందుకే గురజాడ అప్పారావు పంతులు అన్నారు 'మనవాళ్లు ఉత్త వెధవాయిలోయ్..' #NarendraModi #PMOIndia

ఫైజర్ వ్యాక్సిన్ తీసుకుని 23 మంది మృతి, ఎక్కడో తెలుసా..?

Image
మొత్తం 23 మంది మృతి చెందడంతో ఫైజర్ మరియు బయోఎన్‌టెక్ సంస్థలు, నార్వేయన్ అధికార సంస్థలు సంయుక్తంగా విచారణ ప్రారంభించాయి. ఈ మరణాలకు కారణాలను ఇంకా విశ్లేషించాల్సి ఉందని ఫైజర్ సంస్థ పేర్కొంది. ఫైజర్ వ్యాక్సిన్‌తోనే ఈ మరణాలు సంభవించాయా లేక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనేది దర్యాప్తులో తెలుస్తుందని ఫైజర్ వెల్లడించింది. ఇదిలా ఉంటే మరణించిన 23 మందిలో 13 మంది సైడ్ ఎఫెక్ట్స్‌తో మరణించారు. అయితే ఫైజర్‌, బయో ఎన్‌టెక్‌లకు చెందిన కోవిడ్ వ్యాక్సిన్ ఇటీవలి కాలంలో వివాదాలకు మారుపేరుగా మారింది. ఆ వ్యాక్సిన్‌ను తీసుకున్న కొందరు చనిపోవడంతో వ్యాక్సిన్ పనితనంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక తాజాగా నార్వేలో ఫైజర్ కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న 23 మంది చనిపోవడం కలకలం రేపుతోంది. కాగా చనిపోయిన 23 మందిలో 13 మందికి వ్యాక్సిన్ వేశాక వచ్చే అనారోగ్య సమస్యలు కనిపించాయి. డయేరియా, వికారం, జ్వరం సమస్యలు వచ్చినట్లు గుర్తించారు. అయితే నార్వే అధికారులు ఈ విషయంపై విచారణ చేపట్టారు. సదరు వ్యక్తులు ఆ వ్యాక్సిన్ వల్లే చనిపోయారా, లేదా ఇంకా ఏమైనా కారణాలు ఉన్నాయా.. అనే అంశాన్ని వారు విచారిస్తున్నారు. త్వరలోనే ఆ వివరాలు తెలుస్తాయ...