ఫైజర్ వ్యాక్సిన్ తీసుకుని 23 మంది మృతి, ఎక్కడో తెలుసా..?

మొత్తం 23 మంది మృతి చెందడంతో ఫైజర్ మరియు బయోఎన్‌టెక్ సంస్థలు, నార్వేయన్ అధికార సంస్థలు సంయుక్తంగా విచారణ ప్రారంభించాయి. ఈ మరణాలకు కారణాలను ఇంకా విశ్లేషించాల్సి ఉందని ఫైజర్ సంస్థ పేర్కొంది. ఫైజర్ వ్యాక్సిన్‌తోనే ఈ మరణాలు సంభవించాయా లేక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనేది దర్యాప్తులో తెలుస్తుందని ఫైజర్ వెల్లడించింది. ఇదిలా ఉంటే మరణించిన 23 మందిలో 13 మంది సైడ్ ఎఫెక్ట్స్‌తో మరణించారు. అయితే ఫైజర్‌, బయో ఎన్‌టెక్‌లకు చెందిన కోవిడ్ వ్యాక్సిన్ ఇటీవలి కాలంలో వివాదాలకు మారుపేరుగా మారింది.

ఆ వ్యాక్సిన్‌ను తీసుకున్న కొందరు చనిపోవడంతో వ్యాక్సిన్ పనితనంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక తాజాగా నార్వేలో ఫైజర్ కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న 23 మంది చనిపోవడం కలకలం రేపుతోంది. కాగా చనిపోయిన 23 మందిలో 13 మందికి వ్యాక్సిన్ వేశాక వచ్చే అనారోగ్య సమస్యలు కనిపించాయి. డయేరియా, వికారం, జ్వరం సమస్యలు వచ్చినట్లు గుర్తించారు. అయితే నార్వే అధికారులు ఈ విషయంపై విచారణ చేపట్టారు.

సదరు వ్యక్తులు ఆ వ్యాక్సిన్ వల్లే చనిపోయారా, లేదా ఇంకా ఏమైనా కారణాలు ఉన్నాయా.. అనే అంశాన్ని వారు విచారిస్తున్నారు. త్వరలోనే ఆ వివరాలు తెలుస్తాయి. ఎక్కువ వయస్సు ఉన్నవారు ఫైజర్ కోవిడ్ వ్యాక్సిన్‌ను తీసుకున్న తరువాత చనిపోతున్నట్లు నార్వేలో ప్రాథమికంగా నిర్దారించారు. అయితే దీనిపై మరింత లోతుగా విచారణ చేస్తామని తెలిపారు. కాగా డిసెంబర్‌లో అక్కడ వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం కాగా మొత్తం తొలి దశలో 30వేల మందికి ఫైజర్ వ్యాక్సిన్ ఇచ్చారు.

Comments

Popular posts from this blog

అర్ధరాత్రి రోడ్లపై తిరిగితే అరెస్ట్‌! టోలీచౌకీ పోలీసుల కఠిన చర్యలు

🔐 కొత్త ఆధార్ కార్డు డిజైన్: ఫోటో & QR కోడ్ మాత్రమే – మీ గోప్యతకు కొత్త రక్షణ!

🗳️🔥 లోక్‌సభలో ఘాటు డిబేట్: రాహుల్ విసిరిన 3 ఆరోపణలకు అమిత్ షా ఇచ్చిన ఝలక్!