ఆదాని, అంబానిలతో నాకు సంబంధంలేదు.. వారిని సమర్ధించాల్సిన, వ్యతిరేకించాల్సిన అవసరం కూడా లేదు.. కానీ సోషల్ మీడియాలో కొందరి రాతలు చూస్తుంటే ఏవగింపు కలుగుతోంది. అవి వారిలోని అక్కసునే కాదు, శాడిజాన్ని కూడా చాటుతున్నాయి. వ్యాపారం అన్న తర్వాత లాభాలే కాదు, నష్టాలు కూడా ఉంటాయి. ఎంతటి పారిశ్రామికవేత్త అయినా రిస్క్ మీదే వ్యాపారం చేస్తాడు. లక్షలు, కోట్ల పెట్టుబడి కోసం బ్యాంకుల నుంచి రుణాలు తీసుకోవడంతో పాటు పబ్లిక్ ఇష్యూకి కూడా వెళుతుంటారు. వారి మీద ఎంతోమంది ఉద్యోగులు, కార్మికుల కుటుంబాలు ఆధారపడి ఉంటాయి పొద్దున లేస్తే రాత్రి పడుకునేదాకా కొందరు వ్యక్తులు అదానీ, ఆంబానీ, గుజరాతీ, మోదీ అంటూ ఏడుస్తూనే ఉంటారు. ఈ ఏడ్పుగొట్టువాళ్లతో సమాజానికి ఏమైనా ఉపయోగం ఉందా? ఒకప్పుడు టాటా, బిర్లాల మీద కూడా ఇలాగే ఏడ్చేవారు. ఆదాని, ఆంబానిలు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం రాకముందు నుంచే వ్యాపార రంగంలో ఉన్నారు. బీజేపీ వచ్చిన తర్వాత అనుచిత లబ్ది పొందారనడానికి ఏమైనా ఆధారాలు ఉన్నాయా? అంటే వారి మీద అస్తమానం ఏడ్చే బదులు న్యాయం పోరాటం చేయండి.. ఎవరు వద్దన్నారు? ఈ తిక్క సన్నాసులు దేశాన్ని, జాతీయవాదాన్ని ముడిపెట్టి పెట్టి ...