Posts

Showing posts from November, 2021

మోదీ ప్రభుత్వం తీస్కొచ్చిన కొత్త రైతు చట్టాల గురించి సులభంగా అర్ధమయ్యేలా చెప్పే ప్రయత్నం 👇👇

Image
మోదీ ప్రభుత్వం తీస్కొచ్చిన కొత్త రైతు చట్టాల గురించి సులభంగా అర్ధమయ్యేలా చెప్పే ప్రయత్నం 👇👇 👉కొత్త రైతు చట్టాల్లో రైతులకు మరియూ వ్యాపారస్థులకు మధ్య జరిగే ఒప్పందాలలో రైతు అనుకూల న్యాయ సంభంధిత క్లాజ్ లను పొందుపర్చింది మోదీ ప్రభుత్వం.  👉రైతు కి, వ్యాపారస్థుడికి మధ్య జరిగే ఒప్పందం పంట వేయకముందు చేస్కోవచ్చు.. రైతుకి ఒప్పంద పత్రాల్లో ఎంతైతే చెల్లించాలని ఒప్పందం జరుగుతుందో దాని ఆధారంగా కొనుగోలు జరిగి తీరాల్సిందే.. ఇందులో నష్టం వస్తే కూడా వ్యాపారస్థుడు భరించే విధంగా రైతు ఒప్పందం చేస్కోవచ్చు.. ఇది వరకు ఆ చట్టం లేదు మన దేశంలో.  👉రైతు తనకు పంట పైన తీయాలనుకున్న ఆదాయం ఒక వ్యాపారస్థుడి వద్ద కుదరదు అనుకుంటే ఇతర వ్యాపారస్థుడి ద్వారా అయినా సంపాదించుకోవచ్చు కాబట్టి వ్యాపారస్థుల మధ్య పోటీతత్వం పెరుగుతుంది.. సిండికేట్ అవ్వడానికి ఆస్కారం ఉండదు.  👉సపోస్ గా రైతు ప్రవేటు వ్యాపారస్థులతో ఎటువంటి ఒప్పందం చేస్కోకుండా పంట వేశాక కావాలనుకుంటే మంచి ధరకు కొనుగోలు చేస్కునే ఏదైనా వ్యాపారస్థుడికి అమ్ముకోవచ్చు లేదా సరాసరి ప్రభుత్వ వ్యావసాయ మార్కెట్ కి వెళ్లి 'కనీస మద్ధతు ధరకు' అమ్ముకోవచ్చు.  👉ప్...

రాష్ట్రాలపై కేంద్రం పెత్తనం ఏమిటని ప్రశ్నించే ముఖ్యమంత్రి కేసీఆర్, ... రైతులు పండించే వరిని కేంద్రమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేయడం సిగ్గుచేటు

Image
రాష్ట్రాలపై కేంద్రం పెత్తనం ఏమిటని ప్రశ్నించే ముఖ్యమంత్రి కేసీఆర్, ... రైతులు పండించే వరిని కేంద్రమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేయడం సిగ్గుచేటు. గతంలో రైతులు పండించిన ప్రతి గింజా కొంటామని... కోటి ఎకరాల్లో సాగునీటి కోసమే కాళేశ్వరం తదితర సాగునీటి ప్రాజెక్టులున్నాయని... తమది రైతు పక్షపాత ప్రభుత్వం అని గప్పాలు కొట్టిన ముఖ్యమంత్రి... నేడు రైతుల పట్ల రెండు నాల్కల ధోరణి అవలంభిస్తూ కేంద్ర విధానాలను అనాలోచితంగా తప్పుబడుతూ, అనవసరంగా ధర్నాలు చేస్తామనడం హాస్యాస్పదంగా ఉంది. పారాబాయిల్డ్ రైస్ విషయంలో తప్ప... రా రైస్ కొనబోమని ఏ రోజూ కేంద్ర ప్రభుత్వం గానీ, ఎఫ్‌సిఐ గానీ చెప్పలేదు. రా రైస్ కోసం రైస్ మిల్లర్లను సిద్ధం చేయించాల్సిన రాష్ట్ర సర్కార్... యాసంగిలో రైతులు అసలు వరి వేయవద్దంటూనే... వానాకాలం వడ్లు కల్లాలలో పోసి నెలదాటినా కొనకుండా... వర్షాలకు తడిసి పాడవుతున్నా కొనుగోళ్లు వేగవంతం చేయకుండా... యాసంగి వడ్ల కొనుగోలుపై మళ్ళీ ధర్నా పేరుతో డ్రామాలు మొదలెడుతోంది. రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో ఉన్న ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు పడుతున్న బాధలను తెలుసుకోవడానికి వెళ్లిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజ...

#అసలు_వాస్తవం_ఏంటో_తెలుసుకుందాం...

Image
#అసలు_వాస్తవం_ఏంటో_తెలుసుకుందాం... 👉మొదట కేంద్రం కొనేది వడ్లు కాదు బియ్యం అనేది గుర్తించండి. రాష్ట్ర ప్రభుత్వం వడ్లు సేకరించి బియ్యం పట్టించి కేంద్రానికి ఇవ్వాలి అప్పుడు కేంద్రం రాష్ట్రానికి డబ్బులు ఇస్తుంది అప్పుడు ఆ డబ్బులను రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చెయ్యలి. ఇది జరగాల్సిన ప్రక్రియ జరుగుతున్న ప్రక్రియ. అయితే  👉వడ్ల నుండి డైరెక్ట్ బియ్యం తీస్తే వాటిని Raw Rice అంటారు. (పంట చేతికి రాగానే మనం ఇంటి దగ్గర గిండ్రి లో పట్టించుకున్నట్లు) ఇందులో నూకల శాతం ఎక్కువ మరియు మెత్తగా అవుతుంది అన్నం 👉వడ్లను మిషన్ లో త్వరగా ఆరబెట్టి బియ్యం చేస్తే Streaming Rice అంటారు ( బియ్యం దుకాణాలలో Packing చేసి అమ్మే బియ్యం మనం ఫంక్షన్స్ లో వాడే బియ్యం) ఈ బియ్యం లో నూకల శాతం తక్కువ బియ్యం చాలా బాగా ఉంటాయి 👉వడ్లను ఉడకబెట్టి బియ్యం చేస్తే వాటిని Boil Rice అంటారు (ఇవ్వి పూర్వం తినే వారు గోధుమ రంగు లోకి మారీ గట్టిగా తయారవుతాయి) ఇందులో నూకల శాతం అనేది ఉండదు 👉రైతులు తినేది Raw Rice 👉ఫంక్షన్ లలో , దేశ విదేశాలకు Export చేసేది Streaming Rice 👉So ఇప్పుడు Boil Rice విషయానికి వస్తె పూర్వం చాలా తినేవారు ఇప్పుడు చ...

బియ్యం - కయ్యం* *అసలు కథ - 1*జాగ్రత్తగా చదవండి

Image
*బియ్యం - కయ్యం*        *అసలు కథ - 1* జాగ్రత్తగా చదవండి ఉదాహరణకు తెలంగాణ లో ఈ యాసంగిలో 100 క్వింటాల్స్ వడ్లు పండాయి. వాటిని మిల్లులో పడితే 65 క్వింటాల్స్ బియ్యం వస్తాయి. కాని యాసంగిలో నూక ఎక్కువ అవుతుంది అందువలన ఉడకబెట్టి బియ్యం తీస్తారు. ఇలా ఐతే 80 క్వింటాల్స్ బాయిల్డ్ బియ్యం వస్తాయి. అంటే అదనంగా 15 క్వింటాల్స్ బియ్యం వస్తున్నాయి.  ఇక్కడే అసలు కథ ఉన్నది. కేంద్రం- రాష్ట్రం ఒప్పందం ప్రకారం ప్రతి క్వింటాల్ వడ్లకు 65 కిలోల బియ్యం రాష్ట్రం ఇవ్వాలి. ఎక్కువ తక్కువలతో సంబంధం లేదు.  కాని బాయిల్డ్ ఎప్పుడూ కూడా తక్కువ రాదు.  మరి ఇక్కడ 15 క్వింటల్స్ బియ్యం ఎక్కువ వచ్చాయి.  ఎక్కువ వచ్చాయని కేంద్రానికి చెప్పదు. ఉచితంగా కూడా ఇవ్వదు. ఆ 15 క్వింటాల్స్ బియ్యం కు కూడా సరిపడే వడ్లకు లెక్కను చూపిస్తుంది. అంటే 15 క్వింటాల్స్ బియ్యం రావడానికి 25 క్వింటాల్స్ ‌వడ్లు కొన్నట్లుగా చూపుతుంది. తెలంగాణ మొత్తం కొన్న వడ్లు 125 క్వింటాల్స్ అని అవాస్తవ లెక్క చూపుతుంది. మీది 25 క్వింటాల్స్ అప్పనంగా వచ్చినట్లే కదా! అప్పనంగా వచ్చినా కూడా... కేంద్రం నుండి ప్రతి క్వింటాల్ కి మద్దత...

పథకం కేంద్రానిది - పబ్లిసిటీ కెసిఆర్ ది

Image
పథకం కేంద్రానిది - పబ్లిసిటీ కెసిఆర్ ది  #eShram  కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన ఈశ్రం పథకాన్ని అసంఘటిత రంగ కార్మికులు ఉపయోగించుకోవాలి. మీ సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్ల(CSC) ద్వారా ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.వ్యవసాయ, అనుబంధ ఉపాధివర్గాలు, భవన, దాని అనుబంధ రంగాల వర్గాలు, మత్స్యకారులు, ఆటో డ్రైవర్లు చేనేత కార్మికులు, వడ్రంగులు, ఇటుక బట్టి కార్మికులు, క్వారీ కార్మికులు, మిల్లు కార్మికులు, వార్తాపత్రిక విక్రేతలు, రిక్షా కార్మికుడు, చిన్న మరియు సన్నకారు రైతులు, కూరగాయలు మరియు పండ్ల విక్రేతలు, మరియు అన్ని రకాల దినసరి కూలీలు నమోదు చేసుకోవచ్చు. 16 నుండి 59 సంవత్సరాల వయసు కలిగిన వారు, ఈపీఎఫ్, ఈఎస్ఐ సదుపాయం లేనివారు మరియు ఆదాయ పన్ను చెల్లించని వారు మాత్రమే అర్హులు.  ఈశ్రం నమోదు ద్వారా ప్రయోజనాలు... కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈశ్రం పథకంలో నమోదు చేసుకున్న ప్రతీ కార్మికునికి ఏడాది పాటు ప్రధానమంత్రి సురక్షా బీమా యోజన కింద రూ. 2లక్షలు ప్రమాద బీమా పథకం, అంగవైకల్య బీమా పథకం కల్పిస్తారు. రిజిస్ట్రేషన్ పూర్తయిన వారికి 12 అంకెలు గల యూనివర్సల్ ఐడెంటిఫికేషన్ నెంబర్ కార్డును...

భారత్‌కు నిజమైన స్వాతంత్య్రం 2014లో వచ్చిందని, 1947లో వచ్చింది భిక్ష మాత్రమేనని పేర్కొంటూ బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం చెలరేగుతోంది.

Image
భారత్‌కు నిజమైన స్వాతంత్య్రం 2014లో వచ్చిందని, 1947లో వచ్చింది భిక్ష మాత్రమేనని పేర్కొంటూ బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం చెలరేగుతోంది. స్వాతంత్ర్య సమరయోధులను అవమానించిన కంగనను అరెస్టు చేయాలంటూ పెద్ద ఎత్తున డిమాండ్లు వినిపిస్తున్నాయి. అయితే విమర్శలు ఎదురవుతున్నా.. ఆమె మాత్రం తన వ్యాఖ్యలను మరోసారి సమర్థించుకున్నారు. అంతేగాక, తాను చేసిన వ్యాఖ్యలు తప్పని నిరూపిస్తే ‘పద్మశ్రీ’ పురస్కారాన్ని వెనక్కి ఇచ్చేస్తానంటూ ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌లో రాసుకొచ్చారు.  కంగన శనివారం తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో ‘జస్ట్‌ టు సెట్‌ ది రికార్డ్స్‌ స్ట్రేట్‌’ అనే పుస్తకంలోని పేజీలను షేర్‌ చేస్తూ.. ‘‘కాంగ్రెస్‌ను విమర్శిస్తున్నది నేను ఒక్కదాన్నే కాదు. ఆ ఇంటర్వ్యూ(కంగన మాట్లాడిన కార్యక్రమాన్ని ఉద్దేశిస్తూ)లో నేను అన్నీ స్పష్టంగా చెప్పాను. 1857లో తొలిసారిగా స్వాతంత్ర్యం కోసం ఉమ్మడి పోరాటం జరిగింది. ఈ పోరాటంలో రాణి లక్ష్మీబాయి తదితరులు ప్రాణాలర్పించారు. అనంతరం స్వాతంత్ర్య పోరాటంలో సుభాష్‌ చంద్రబోస్‌, వీర్‌ సావర్కర్‌ లాంటి వారు ఎన్నో త్యాగాలు చేశారు. రాణీ లక్ష్మీబాయి జీవిత చరిత్రపై తీసి...

నరేంద్ర మోడీ ఎవరు?

Image
నరేంద్ర మోడీ ఎవరు?  దీనికి సమాధానాన్ని తెలివైన *రాజకీయ వైద్యుడు చాలా అందంగా వివరించారు.  ఆయుర్వేదం మరియు వైద్య శాస్త్రంలో, తేనెను ఔషధంగా భావిస్తారు.  అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే కుక్క తేనెను నాకితే అది చనిపోతుంది.!  అంటే మనుషులకు ఔషధం అయిన తేనె కుక్కలకు విషం.  ఆయుర్వేదం మరియు వైద్య శాస్త్రం స్వచ్ఛమైన దేశీయ ఆవు నెయ్యిని ఔషధ లక్షణాల స్టోర్‌హౌస్‌గా పరిగణిస్తాయి.!  కానీ ఆశ్చర్యం, మురికిలో సంతోషంగా ఉండే ఈగ ఎన్నటికీ స్వచ్ఛమైన దేశీయ నెయ్యిని తినదు.!  పొరపాటున, ఒక ఈగ దేశీయ నెయ్యి మీద కూర్చుని రుచి చూసినా, అది వెంటనే అక్కడ వేదనతో చనిపోతుంది.!?  ఆయుర్వేదంలో, "మిశ్రి అంటే కడి చక్కెర " ఔషధంగా మరియు ఉత్తమ మిఠాయిగా కూడా పరిగణించబడుతుంది.  అయితే ఆశ్చర్యపోవాల్సిన విషయం ఏంటంటే, ఒక కండ చక్కెర మిఠాయిని గాడిదకు తినిపిస్తే, దాని జీవితం కొంత సమయంలో ఎగిరిపోతుంది.!  ఈ తేనె లాంటి ఉత్తమమైన డెజర్ట్, చక్కెర మిఠాయి "గాడిద"ఎన్నటికీ తినదు.  వేప చెట్టు మీద నాటిన పండిన వేప పండ్లలో (నింబోలిలో) అనేక వ్యాధులను ఓడించే ఔషధ గుణాలు ఉన్నాయి.  ఆయుర్వేదం దీనిని "...

రాష్ట్రంలో సీఎం కేసీఆర్ తీరు రంగులు మార్చే ఊసరవెల్లి మాదిరిగా ఉంది.

Image
రాష్ట్రంలో సీఎం కేసీఆర్ తీరు రంగులు మార్చే ఊసరవెల్లి మాదిరిగా ఉంది. తాజా పరిస్థితిని గమనిస్తే.... కేంద్రం వద్ద బాయిల్డ్‌ రైస్‌ (ఉప్పుడు బియ్యం) నిల్వలు విపరీతంగా ఉన్నాయి కాబట్టి... వాటిని వినియోగించేందుకు కొన్నేళ్లు పడుతుంది కనుక... 2020-21 యాసంగి సీజన్‌కు సంబంధించి తెలంగాణ నుంచి 24.75 లక్షల టన్నుల బాయిల్డ్‌ రైస్‌ మాత్రమే ఎఫ్‌సీఐ తీసుకుంటుంది. మిగిలిన బియ్యం రా రైస్‌ (పచ్చి బియ్యం) రూపంలో మాత్రమే ఇవ్వాలని... అలాగే ఉప్పుడు బియ్యాన్ని పరిమితంగా తీసుకోవడం వల్ల రైతులకు ఎలాంటి ఇబ్బంది ఉండదని, యాసంగి ధాన్యం కేవలం బాయిల్డ్‌ రైస్‌కే పనికి వస్తాయనేది అశాస్త్రీయమైన అంశమని... పైగా, ఇది రైస్‌ మిల్లర్లకు సంబంధించిన వ్యవహారమని... ఇందులో రైతుకు ఏమాత్రం సంబంధం లేదని కేంద్ర ఆహార శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ నుంచి మే నెలలో రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చిన లేఖలో స్పష్టంగా పేర్కొన్నారు. కానీ.. సెప్టెంబరు 26న ఢిల్లీ టూర్ వెళ్లిన సీఎం కేసీఆర్.... గత యాసంగిలో 92.34 లక్షల టన్నుల ధాన్యం సేకరించామని... దీని నుంచి 62.52 లక్షల టన్నుల బాయిల్డ్‌ రైస్‌ ఉత్పత్తి అయ్యాయని... ఉత్పత్తిలో కనీసం 90 శాతం బాయిల్డ్‌ రైస్‌ తీసుకోవా...

హిందుత్వం అంటే

Image
ఆసింధు సింధు పర్యంతా యస్యభారత భూమికా పితృభూః పుణ్యభూశ్చైవ సవై హిందురితి స్మృతాః 'సింధూ నది మొదలు హిందూ మహా సముద్రం వరకూ ఉన్న ఈ భారత భూమిని మాతృభూమిగా, పితృభూమిగా, పుణ్యభూమిగా భావించిన వారంతా హిందువులే..’ హిందువులు అంటే ఎవరనే ప్రశ్నకు వినాయక దామోదర్‌ సావర్కర్‌ ఇచ్చిన స్పష్టమైన సమాధానం ఇది... చాలా స్పష్టత ఉంది.. హిందుత్వం మీద చర్చ కొత్తేమీ కాదు.. అందరూ తెలుసుకోవాల్సిన విషయమే.. ఈ మధ్య కాలంలో ఒక విఫల నాయకుడు తమ మిడిమిడి జ్ఞానంతో హిందూయిజం, హిందుత్వ వేర్వేరు అని నోరు జారగానే అదేదో ఆణిముత్యంలాంటి సంచలన ప్రకటన అన్నట్లు సోషల్‌ మీడియాలో చర్చకు పెట్టారు.. ఆయన ఎప్పుడు హిందుత్వం మీద ఏడుస్తుంటారు.. జాతీయవాదుల మీద విషం చిమ్ముతుంటాడు.. చరిత్రను తెలుసుకునే ప్రయత్నం చేయడని నేను భావించను.. కానీ కుట్ర పూరితంగా వక్రీకరించి గందరగోళం సృష్టించే ప్రయత్నం చేస్తుంటాడు.. సంతృష్టీకరణ రాజకీయాలతో దేశంలో మెజారిటీ ప్రజలను తీవ్ర నిర్లక్ష్యం చేసిన వ్యక్తులు ఇప్పుడు వారిలో వస్తున్న చైతన్యాన్ని చూసి తట్టుకోలేకపోతున్నారు..