Posts

Showing posts from July, 2019

"మాతో టచ్చులో 18మంది తెలుగుదేశం ఎమ్మెల్యేలు!.." ౼ బీజేపీ 😳 👏

Image
"మాతో టచ్చులో 18మంది తెలుగుదేశం ఎమ్మెల్యేలు!.." ౼ బీజేపీ 😳 👏 చంద్రబాబుపై బీజేపీ ఆంధ్రప్రదేశ్ కో-ఇంఛార్జ్‌గా వ్యవహరిస్తున్న బీజేపీ జాతీయ కార్యదర్శి సునీల్ దియోధర్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి.  టీడీపీ నుంచి గెలిచిన 23మంది ఎమ్మెల్యేల్లో 18మంది తమతో టచ్‌లో ఉన్నారని దియోధర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.  అంతేకాదు, చంద్రబాబు త్వరలో జైలుకు వెళ్లడం ఖాయమని ఆయన వ్యాఖ్యానించారు. చంద్రబాబుతో పాటు ఆయనకు అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యులు కూడా అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు.  ఆ కారణంగానే టీడీపీ ప్రతిష్ట దిగజారిందని తెలుసుకున్న ఎమ్మెల్యేలు తమతో సంప్రదింపులు జరుపుతున్నారని ఆయన చెప్పారు.   చంద్రబాబు చేసిన తప్పుల వల్ల, అవినీతి వల్ల ఏపీలో టీడీపీకి భవిష్యత్ లేకుండా పోయిందని దియోధర్ చెప్పుకొచ్చారు.  ఇక ఏపీలో బలం పుంజుకునేందుకు బీజేపీ ప్రత్యేక శ్రద్ధ పెట్టిందని.. ఒక్కో లోక్‌సభ నియోజకవర్గంలో లక్ష మందిని పార్టీలో చేర్చుకోవడమే లక్ష్యంగా ముందుకెళ్లనున్నట్లు ఏపీ బీజేపీ కో ఇంఛార్జ్ సునీల్ దియోధర్ తెలిపారు. By sources 

మందు బాటిళ్లపై గాంధీ బొమ్మలు

Image
మందు బాటిళ్లపై గాంధీ బొమ్మలు! ఇజ్రాయెల్‌కు చెందిన రెండు బీరు తయారీ సంస్థలు తమ ఉత్పత్తులపై మహాత్మ గాంధీ చిత్రాన్ని ముద్రించించిన ఘటన దేశ వ్యాప్తంగా కలకలం సృష్టించింది.  ఇజ్రాయెల్ 71వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆ దేశానికి చెందిన మాల్కా బ్రేవరీ, నెగేవ్‌ బీర్స్‌ అనే సంస్థలు ప్రపంచంలోని ప్రముఖుల ముఖచిత్రాలను తమ మందుబాటిళ్లపై ముద్రించాయి.  ఇందులో భాగంగా.. టీషర్టు, కళ్లజోడు ఉన్న మహాత్మగాంధీ కార్టూన్‌ లేబుల్‌ను బీరు బాటిళ్లపై అంటించాయి. By sources 

బడ్జెట్‌ను ఆసక్తికరంగా మార్చే అంశాలు..!

Image
బడ్జెట్‌ను ఆసక్తికరంగా మార్చే అంశాలు..! సార్వత్రిక ఎన్నికల సమయంలో రెండు బడ్జెట్లు చూస్తుంటాము. గతంలో అధికారంలో ఉన్న ప్రభుత్వమే మళ్లీ విజయం సాధిస్తే రెండోసారి ప్రవేశపెట్టే బడ్జెట్‌పై ఆసక్తి తగ్గిపోతుంది. మధ్యంతర బడ్జెట్‌లో ప్రవేశపెట్టిన విధానాలనే  కొనసాగించేసి..చిన్న చిన్న మార్పులు చేర్పులతో కొత్త బడ్జెట్‌ను ప్రవేశపెట్టేస్తారు. కానీ, ఈ సారి అలాకాదు.. చాలా మంది నిపుణుల్లో బడ్జెట్‌పై ఉత్కంఠ నెలకొంది. దీనికి పలు కారణాలు ఉన్నాయి.  కొత్త ఆర్థిక మంత్రి.. ఎన్నికల అనంతరం ఆర్థిక మంత్రి నిర్మాలాసీతారామన్‌ బాధ్యతలు చేపట్టారు. సాధారణంగా ఆమె పాలసీల విషయంలో చాలా గోప్యతను పాటిస్తారు. తన మనసులో మాట బయటకు తెలియకుండా జాగ్రత్తపడతారు. దీనికి మోదీ లక్ష్యాలకు తగినట్లు పనిచేసుకుంటూ వెళతారనే పేరుంది. దీంతో ఆమె కొత్తగా ఆర్థిక సవాళ్లను ఎలా ఎదుర్కొంటారా  అనే విషయంపై నిపుణులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.  కఠిన సవాళ్లు.. ఆర్థిక వ్యవస్థ తీరు కూడా ఎన్నికల ప్రచారంలో పేర్కొన్నంత ఆశాజనంకగా లేదు. మరోపక్క భారీ విజయాన్ని అందించిన ప్రజలకు తొలి బడ్జెట్‌పై అంచనాలు కూడా ఎక్కువగానే ఉంటాయి. ఈ నేపథ్యంలో ప్రీ బడ...

అమీర్‌పేటలో పలు కోచింగ్‌ సెంటర్లు సీజ్

Image
హైదరాబాద్‌లోని అమీర్‌పేట, మైత్రివనం ప్రాంతాల్లో ఉన్న పలు ఐటీ శిక్షణా కేంద్రాలపై జీహెచ్‌ఎంసీ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు కొరడా ఝుళిపించారు.  అగ్ని ప్రమాద, విపత్తులను ఎదుర్కొనేందుకు ఎటువంటి భద్రతా చర్యలూ చేపట్టని కారణంగా 20 ఐటీ శిక్షణా సంస్థల్ని సీజ్‌ చేశారు. గతంలో సూరత్‌లోని ఓ కోచింగ్‌ సెంటర్‌లో అకస్మాత్తుగా మంటలు చెలరేగి 23మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయిన ఘటనతో జీహెచ్‌ఎంసీ యంత్రాంగం అప్రమత్తమైంది. ఇందులో భాగంగానే రెండు నెలల కిందట నగరంలోని అమీర్‌పేట్‌, కూకట్‌పల్లి, దిల్‌సుఖ్‌నగర్‌, అశోక్‌నగర్‌లో 671 కోచింగ్‌ సెంటర్లకు జీహెచ్‌ఎంసీ అధికారులు నోటీసులిచ్చారు. నోటీసులు అందుకున్న వాటిలో 170 కోచింగ్‌ సెంటర్లు తాము అగ్నిమాపక భద్రతా ఏర్పాట్లు, ఇతర రక్షణ చర్యలు తీసుకుంటామని.. అందుకోసం కొంత గడువు ఇవ్వాలని కోరాయి. ఈ 170 కోచింగ్‌ సెంటర్లను  అధికారులు మినహాయించారు. తాఖీదులు జారీచేసినప్పటికీ ఇంకా  స్పందించని..  ఫైర్ సేఫ్టీ నిబంధనల్ని గాలికొదిలేసిన కోచింగ్ సెంటర్లను సీజ్‌ చేశారు. By sources 

కోర్టుకు హాజరయ్యారు రాహూల్.. 😳 💐

Image
కోర్టుకు హాజరయ్యారు రాహూల్.. 😳 💐 ఆర్ఎస్ఎస్ పరువునష్టం కేసులో రాహుల్ గాంధీ గురువారం ముంబై కోర్టుకు హాజరయ్యారు. కోర్టులో ప్రస్తుతం వాదనలు జరుగుతున్నాయి.  2017లో హత్యకు గురైన సీనియర్ జర్నలిస్ట్ గౌరీ లంకేశ్ కేసులో నిందితులకు ఆర్ఎస్ఎస్‌ - బీజేపీలతో సంబంధాలున్నాయంటూ అప్పట్లో ఆయన వ్యాఖ్యానించారు.  దీనిపై ఆర్ఎస్ఎస్ కార్యకర్త ధ్రుతిమన్ జోషి కోర్టుకు వెళ్లారు. రాహుల్‌పై పరువునష్టం దావా వేశారు.

"దళితుడ్ని సీఎం చేస్తానని కేసీఆర్‌ మోసంచేశారు’' ౼ భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌

Image
"దళితుడ్ని సీఎం చేస్తానని కేసీఆర్‌ మోసంచేశారు’' ౼ భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ దళితుడిని తెలంగాణ ముఖ్యమంత్రి చేస్తానని చెప్పి కేసీఆర్ మోసం చేశారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ ధ్వజమెత్తారు.  దళితులకు మూడెకరాల భూపంపిణీ చేస్తానని.. పనికి రాని భూముల్ని అంటగట్టి వారిని అవమానపర్చారని విమర్శించారు.  సబ్‌ప్లాన్‌ నిధులన్నీ దారిమళ్లిస్తున్నారని ఆరోపించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం కోసం శంకుస్థాపన చేసి అటకెక్కించారని దుయ్యబట్టారు.  లోయర్‌ ట్యాంక్‌బండ్‌లోని అంబేద్కర్‌ భవన్‌ వద్ద భాజపా ఏర్పాటు చేసిన నిరసన కార్యక్రమంలో లక్ష్మణ్‌ మాట్లాడారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు.  పార్టీ నేతలు, కార్యకర్తలతో కలిసి అంబేద్కర్ భవన్‌ ప్రాంగణంలో మొక్కలు నాటారు.  అంబేద్కర్ భవనాన్ని అద్భుతంగా నిర్మిస్తామని చెప్పి మూడున్నరేళ్లయినా ఎందుకు నిర్మించలేదని ప్రభుత్వాన్ని నిలదీశారు.  ప్రభుత్వ దళిత వ్యతిరేక విధానాలను భాజపా తిప్పికొడుతుందన్నారు.

లక్ష్యాలకు రూపునిచ్చేలా ఆర్థిక సర్వే: మోదీ

Image
లక్ష్యాలకు రూపునిచ్చేలా ఆర్థిక సర్వే: మోదీ భారత్‌ నిర్దేశించుకున్న ఆర్థిక లక్ష్యాలకు రూపునిచ్చేలా ఆర్థిక సర్వే ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం పార్లమెంటులో‌ ప్రవేశపెట్టిన ఆర్థిక సర్వేపై ఆయన స్పందించారు. ‘‘ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక శక్తిగా మారాలని దేశం పెట్టుకున్న లక్ష్యాన్ని సాధించేందుకు ఆర్థిక సర్వే-2019 రూపునిస్తుంది. సామాజిక రంగం, సాంకేతికతను అందిపుచ్చుకునే లక్ష్యం, ఎనర్జీ సెక్యూరిటీ పురోగతి వంటి అంశాలను కూడా వర్ణిస్తోంది. దీన్ని చదవండి’’ అని ఆయన ట్విటర్‌లో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆర్థిక సర్వేకు సంబంధించిన లింకును ఆయన పోస్ట్ చేశారు. కాగా, దేశం‌ 2024-25నాటికి 5 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారడానికి, వృద్ధి రేటు ఇప్పటి నుంచే 8 శాతం దాటాలని ఆర్థిక సర్వేలో వివరించిన విషయం తెలిసిందే. ఈ లక్ష్యాన్ని సాధించేందుకు ప్రణాళికలు వేస్తున్నట్లు ఇప్పటికే పలు సార్లు మోదీ తెలిపారు. పెట్టుబడుల రేటు పెరిగే అవకాశాలు, వృద్ధిరేటులో మందగమనం, జీఎస్‌టీ, ప్రభుత్వ పథకాలు వల్ల ఆర్థిక వ్యవస్థపై ప్రభావం వంటి అంశాలను ఇందులో వివరించారు. భారత్‌...

తెలంగాణ భవన్‌లో ఘనంగా బోనాల వేడుకలు

Image
తెలంగాణ భవన్‌లో ఘనంగా బోనాల వేడుకలు దిల్లీలోని తెలంగాణ భవన్ లో బోనాల పండగ ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పోతురాజుల విన్యాసాలు, శివసత్తుల ఆటలు, డప్పు కళాకారుల నృత్యాలు అందర్నీ ఆకట్టుకున్నాయి. ఈ వేడుకల్లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బోనాల పండగ తెలంగాణకే విశిష్ఠమైన వేడుక అన్నారు. ‘‘ వచ్చే ఏడాది కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో బోనాల పండగ నిర్వహించేలా చూస్తాం. అమ్మవారి దయతో అందరూ సుఖసంతోషాలతో ఉండాలి. దేశ రక్షణ కోసం పని చేస్తున్న సైనికులు మరింత శక్తిమంతం కావాలి’’ అని ఆకాంక్షించారు. ఈ వేడుకల్లో దిల్లీలోని తెలంగాణ ప్రత్యేక ప్రతినిధి రామచంద్రుడు, రెసిడెంట్ కమిషనర్ వేదాంతం గిరి, లాల్ దర్వాజ ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.