లక్ష్యాలకు రూపునిచ్చేలా ఆర్థిక సర్వే: మోదీ

లక్ష్యాలకు రూపునిచ్చేలా ఆర్థిక సర్వే: మోదీ

భారత్‌ నిర్దేశించుకున్న ఆర్థిక లక్ష్యాలకు రూపునిచ్చేలా ఆర్థిక సర్వే ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం పార్లమెంటులో‌ ప్రవేశపెట్టిన ఆర్థిక సర్వేపై ఆయన స్పందించారు. ‘‘ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక శక్తిగా మారాలని దేశం పెట్టుకున్న లక్ష్యాన్ని సాధించేందుకు ఆర్థిక సర్వే-2019 రూపునిస్తుంది. సామాజిక రంగం, సాంకేతికతను అందిపుచ్చుకునే లక్ష్యం, ఎనర్జీ సెక్యూరిటీ పురోగతి వంటి అంశాలను కూడా వర్ణిస్తోంది. దీన్ని చదవండి’’ అని ఆయన ట్విటర్‌లో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆర్థిక సర్వేకు సంబంధించిన లింకును ఆయన పోస్ట్ చేశారు.
కాగా, దేశం‌ 2024-25నాటికి 5 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారడానికి, వృద్ధి రేటు ఇప్పటి నుంచే 8 శాతం దాటాలని ఆర్థిక సర్వేలో వివరించిన విషయం తెలిసిందే. ఈ లక్ష్యాన్ని సాధించేందుకు ప్రణాళికలు వేస్తున్నట్లు ఇప్పటికే పలు సార్లు మోదీ తెలిపారు. పెట్టుబడుల రేటు పెరిగే అవకాశాలు, వృద్ధిరేటులో మందగమనం, జీఎస్‌టీ, ప్రభుత్వ పథకాలు వల్ల ఆర్థిక వ్యవస్థపై ప్రభావం వంటి అంశాలను ఇందులో వివరించారు. భారత్‌లో సుస్థిర సర్కారు ఏర్పడటం పెట్టుబడుల వాతావరణాన్ని పెంచుతుందని అందులో పేర్కొన్నారు.
By sources 


Comments

Popular posts from this blog

అర్ధరాత్రి రోడ్లపై తిరిగితే అరెస్ట్‌! టోలీచౌకీ పోలీసుల కఠిన చర్యలు

🔐 కొత్త ఆధార్ కార్డు డిజైన్: ఫోటో & QR కోడ్ మాత్రమే – మీ గోప్యతకు కొత్త రక్షణ!

🗳️🔥 లోక్‌సభలో ఘాటు డిబేట్: రాహుల్ విసిరిన 3 ఆరోపణలకు అమిత్ షా ఇచ్చిన ఝలక్!