“భాషా వివిధ్యత గౌరవం: దేశ సమగ్రతకు మూలస్తంభం”
భాషా వివిధ్యతను గౌరవించడం ద్వారా మాత్రమే దేశ సమగ్రతను కాపాడుకోవచ్చు. భాషా ఆధారిత విభేదాలు సృష్టించడం సనాతన ధర్మానికి వ్యతిరేకం. త్రిభాషా విధానాన్ని నిరాకరించడం, ద్విభాషా విధానాన్ని మాత్రమే సమర్థించడం, రెండో భాషగా ఇంగ్లీషును మాత్రమే అంగీకరించడం వంటి చర్యలు ప్రాంతీయ విభేదాలను పెంచుతాయి. దేశీయ భాషలైన హిందీ, సంస్కృత భాషలను నిరాకరించడం ద్వంద్వ వైఖరికి నిదర్శనం. తమిళనాడులో తెలుగు, కన్నడ, మలయాళం వంటి ఇతర దక్షిణాది భాషలను అణచివేయడం భాషా సమగ్రతకు హానికరం. కేంద్ర ప్రభుత్వం అన్ని భారతీయ భాషలను గౌరవిస్తుండగా, ఒకే భాష పెత్తనం చేయాలనే ప్రయత్నాలు విభజనకు దారితీస్తాయి. • కేశబోయిన శ్రీధర్, జనరల్ సెక్రటరీ, హైదరాబాద్ సెంట్రల్ బీజేపీ ఓబీసీ మోర్చా