మహా కుంభమేళాలో విషాదం తర్వాత 5 ప్రధాన మార్పులు: భద్రత మరియు క్రమశిక్షణ నిర్ధారణ 🕉️🚶♂️🚫🚗
విషాదం తర్వాత మహా కుంభమేళాలో 5 ప్రధాన మార్పులివీ
మహా కుంభమేళాలో తొక్కిసలాట విషాదం జరిగిన తర్వాత యూపీ ప్రభుత్వం 5 ప్రధాన మార్పులు చేసింది. కుంభమేళా జరిగే మొత్తం ప్రాంతాన్ని వాహన రహిత జోన్ గా ప్రకటించింది. ఈ నిర్ణయంతో ఏ వాహనాన్ని కూడా ఇక లోపలికి అనుమతించరు.
1. అన్ని రకాల వాహనాల ప్రవేశాన్ని నిషేధించారు.
2. వీవీఐపీ పాసులు రద్దు... ప్రత్యేక పాస్ ద్వారా ఏ వాహనాలకు అనుమతి వుండదు.
3. భక్తుల సౌకర్యార్థం వన్ వే రోడ్డు వ్యవస్థ అమలులోకి వచ్చింది.
4.ప్రయాగరాజ్ కి ఆనుకొని వున్న జిల్లాల నుంచి వచ్చే వాహనాలను జిల్లా సరిహద్దుల్లోనే నిలిపేస్తున్నారు.
5. నగరంలో వచ్చే నెల 4 వ తేదీ వరకు నాలుగు చక్రాల వాహనాల ప్రవేశంపై పూర్తిగా నిషేధం వుంటుంది.
కుంభ ప్రాంతంలో రద్దీని నియంత్రించడం, భక్తుల భద్రతకు అనుగుణంగానే ఈ మార్పుల ఉద్దేశమని అధికారులు ప్రకటించారు. భక్తులందరూ తమకు సహకరించాలని కోరారు.
Comments
Post a Comment