Posts

Showing posts from August, 2023

TSRTC గురించి తెలంగాణ ప్రజలకు మరింత సమాచారం:

Image
TSRTC గురించి తెలంగాణ ప్రజలకు మరింత సమాచారం: TSRTC కార్మికులకు ప్రభుత్వం ఉన్న బకాయిలు. 2 PRC లు... CCS.    1050 కోట్లు PF.        1235 కోట్లు SBT.        500 కోట్లు SRBS.      500 కోట్లు మొత్తం    3285 కోట్ల రూపాయలు TSRTC కార్మికులకు ప్రభుత్వం అప్పుగా ఉంది. TSRTC 5 వేల కోట్ల నష్టం ఉంది. TSRTC ఆస్తుల విలువ ఎంతో తెలుసా? దాదాపుగా 1.5 (ఒక లక్ష యాభై వేల కోట్ల రూపాయలు). TSRTC అప్పుల కన్నా ఆస్తుల విలువ చాలా ఎక్కువ ఉన్నందున ఆస్తులను కొట్టివేయాలంటే కార్పొరేషన్ అనే పదం ఉండడం వల్ల ముఖ్యమంత్రి గారికి కార్పొరేషన్ ఆస్తులను కొట్టివేయడానికి రాదు. కనుక, TSRTC కార్మికులపై ఎక్కడలేని ప్రేమ ఒలకబోస్తున్నట్లుగా నటిస్తూ TSRTC ని కుట్రపూరితంగా ప్రభుత్వంలో విలీనం చేస్తున్నాడు. ఈ సమాచారం మొత్తం net లో కొడితే రావాలి, కానీ గతంలో కార్మికులు సమ్మె చేసినప్పుడు ఈ మొత్తాన్ని తీసివేసినట్లుగా తెలిసింది.

ఎల్బీస్టేడియంలో ప్రజాసందర్శనకు గద్దర్ భౌతిక కాయం*

Image
ఎల్బీస్టేడియంలో ప్రజాసందర్శనకు గద్దర్ భౌతిక కాయం* ప్రజా ఉద్యమకారుడు, గాయకుడు గద్దర్ భౌతిక కాయాన్ని ప్రజా సందర్శనకు ఉంచనున్నారు.  ఎల్బీ స్టేడియానికి ఆయన పార్థీవ దేహాన్ని తరలించారు. 

బీజేపీ బహిష్కృత నేత, గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

బీజేపీ బహిష్కృత నేత, గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వచ్చే అసెంబ్లీలో తాను ఎమ్మెల్యేగా ఉండకపోవచ్చని రాజాసింగ్‌ చెప్పారు. అంటే రానున్న ఎన్నికల తర్వాత ఏర్పడే అసెంబ్లీకి తాను రాకపోవచ్చని అసెంబ్లీ వేదికగా వ్యాఖ్యానించారు. ఇంటా బయటా తనను అసెంబ్లీకి రావొద్దనే కోరుకుంటున్నారని చెప్పారు. ఇప్పుడీ వ్యాఖ్యలు సర్వత్రా చర్చనీయాంశమయ్యాయి._ _మ‌హ్మద్ ప్రవ‌క్తపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకుగాను బీజేఎల్పీ నేత రాజాసింగ్‌పై గతేడాది ఆగస్టు 23న బీజేపీ స‌స్పెన్షన్ వేటు వేసింది. పార్టీ విధానాల‌కు వ్యతిరేకంగా మాట్లాడినందుకు ఆయనపై చ‌ర్యలు తీసుకుంటున్నట్లు తెలిపింది. శాస‌న స‌భాప‌క్ష ప‌ద‌వినుంచి కూడా తొల‌గించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఆయనను పార్టీ కార్యకలాపాలకు దూరంగా పెడుతూ వస్తున్నారు._.

స్టేట్ గవర్నమెంట్ నోటరీ ల్యాండ్ రెగ్యులరీ్సేషన్ 3000 గజాలు వారు GO

Image
స్టేట్ గవర్నమెంట్ నోటరీ ల్యాండ్ రెగ్యులరీ్సేషన్ 3000 గజాలు వారు GO

*వడ్డీ మాఫీనా ... రుణమాఫీనా ... ?*

Image
*వడ్డీ మాఫీనా ... రుణమాఫీనా ... ?* *బాబ్రాజిమానం భజగోవిందం .. పాలాభిషేకం పాపహరణం*  గత ఎన్నికల్లో ఇచ్చిన రుణమాఫీ హామీకి ఆశపడి భంగపడ్డ రైతన్నకు వొరిగేదేముంది.. ఆదుకున్నది ఏడున్నది.. ఇప్పటికే తీసుకున్న తీసుకున్న రుణానికి వడ్డీ కూడా సగం తోడైయింది.. ఇన్నాళ్లు రెన్యూవల్ చేసుకున్న వడ్డీ కట్టడమే జరిగింది. ఎన్నికలొస్తున్నాయాని *ఇత్తినమ్మ మిత్తి వాయినం .. పుచ్చుకుంటామమ్మ ఓటు వాయినం* అన్నట్టుంది యవ్వారం.  ఇన్నాళ్లు కట్టిన మిత్తికి పంగనామమేనా? బ్యాంకులో ఉన్న రుణానికి మిత్తి కట్టేదెవరు? రుణ ఎగవేతదారుగా ముద్రపడి క్రెడిట్ స్కోర్ కోల్పోయిన రైతుల సంగతేమిటి?  నెల గడువులో వడ్డీ మాఫీ జరుగుంతుందా ? కేవలం గులాబీ కార్యకర్తలకే పరిమితం కానుందా ? మీరు చేసే మాఫీ రుణమాఫీనా ? వడ్డీ మాఫీనా ?  *రైతన్నలారా ఒక్కసారి ఆలోచన చెయ్యండి*  ఇన్నాళ్లు ఋణం మాఫీ కాకా కొత్తగా అప్పు పుట్టాక, వడ్డీ వ్యాపారాలు నడ్డి విరిచిన తప్పదని భరించారు. ఐదేళ్లు ప్రతి బడ్జెట్ సమావేశములో ఆర్థిక ఆమోదం రాగానే వారములో మాఫి అంటూ ఊరిస్తూ.. ఊరిస్తూ చెవులల్ల నూనె పోసి ఇయ్యకుండ ఇప్పడిదాకా ఆపిండు. ఇప్పుడు వ్యతిరేకత వచ్చిందని రుణమాఫ...

తెలంగాణా ప్రభుత్వం విలువైన hmda భూములన్నీ అమ్మేస్తున్న తీరు భవిష్యత్ తరాలకు రిక్త హస్తంగానే ఉండబోతుంది..!

Image
తెలంగాణా ప్రభుత్వం విలువైన hmda భూములన్నీ అమ్మేస్తున్న తీరు భవిష్యత్ తరాలకు రిక్త హస్తంగానే ఉండబోతుంది..! ఎకరాకు 100 కోట్లకు పైగా పాడిన 'రాజపుష్ప'వాళ్లు చేపట్టబోయే రాచకార్యమేందో..!! ఈ విధంగా ప్రభుత్వభూములన్నీ అమ్మగా వచ్చిన డబ్బును రానున్న ఎన్నికల్లో ఓట్ల కొనుగోలుకు.. 'రుణ మాఫీ' పేరుతొ వెదజల్లుతున్న తీరు.. ఆందోళనకరం..! ప్రజాస్వామికవాదులు స్పందించాలి..👍

మణిపూర్‌లో ఏం జరుగుతోందనే అంశంపై ప్రతి ఒక్కరికీ స్పష్టమైన అవగాహన ఉండాలి

Image
మణిపూర్‌లో ఏం జరుగుతోందనే అంశంపై ప్రతి ఒక్కరికీ స్పష్టమైన అవగాహన ఉండాలి. అక్కడ జరుగుతున్న వాస్తవాలకన్నా అవాస్తవాలే ఎక్కువ ప్రచారమైపోతున్నాయి. నిజం తెలిసే సరికి అబద్దం లోకం చుట్టి వస్తోంది. మణిపూర్‌లో తెగల మధ్య జరుగుతున్న పోరాటానికి మతం రంగు రుద్దుతున్నారు. అక్కడ అరాచకాల సృష్టిస్తూ చిచ్చు పెడుతున్న విదేశీ శక్తులు, వేర్పాటువాద సంస్థలు,  మిషనరీల కుట్రలు అన్నీ ఇన్నీ కాదు. ముఖ్యంగా మన తెలుగునాట ఈ దుష్ప్రచారం ఎక్కువ జరుగుతోంది.  ఈశాన్య రాష్ట్రాల్లో పుష్కర కాలం పాటు ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రచారక్‌గా,  సామాజిక కార్యకర్తగా పని చేసి వచ్చిన మన తెలుగువారు కస్తూరి రాకా సుధాకర్‌ రావు గారికి మణిపూర్‌ సమస్య పట్ల స్పష్టమైన అవగాహన ఉంది. వారికి అక్కడి ప్రాంతీయ భాషలు కూడా తెలుసు, వివిధ తెగల వారిని, వేర్పాటువాద గ్రూపులను దగ్గర నుంచి చూసి వచ్చారు.. మరింత సమాచారం కోసం రాకాజీ నిర్వహిస్తున్న #Rakalokam యూట్యూబ్‌ చానల్‌ చూడండి.

కోర్టు కేసుల నేపథ్యంలో రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్‌ని వెంటనే భర్తరఫ్ చేయాలని డిమాండ్

Image
కోర్టు కేసుల నేపథ్యంలో రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్‌ని వెంటనే భర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ పాలమూరు జిల్లా కేంద్రంలో ధర్నా నిర్వహించిన బిజెపి నాయకులు. #BJP4Telangana

అసెంబ్లీ సాక్షిగా ఈటెలపై ప్రేమ వర్షం కురిపించిన కేటీఆర్*

Image
*అసెంబ్లీ సాక్షిగా ఈటెలపై ప్రేమ వర్షం కురిపించిన కేటీఆర్*  హైదరాబాద్:ఆగస్టు03 తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు గురువారం ఉదయం 11:30 గంటలకు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో అసెంబ్లీ లోపల ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. మంత్రి కేటీఆర్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సీటు వద్దకు వెళ్ళి ఆప్యాయంగా పలుకరించి ఆలింగనం చేసుకున్నారు. ఒకరినొకరు హత్తుకున్నారు. పదినిమిషాల పాటు ఇరువురు మాట్లాడుకున్నారు. కాగా అసెంబ్లీ సమావేశాలు మొదలైన వెంటనే రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్, ప్రముఖ గాయకుడు, కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్నకు  సభ నివాళి అర్పించింది. సాయన్న మృతికి ముఖ్యమంత్రి కేసీఆర్  సభలో సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. సాయన్న లేని లోటు తీర్చలేనిదన్నారు. కంటోన్మెంట్‌ను జీహెచ్‌ఎంసీలో కలపాలని ఆయన ఎంతో కృషి చేశారని గుర్తుచేశారు. సాయన్న అట్టడుగు వర్గాల నుంచి వచ్చిన నేత అని అన్నారు. సాయన్న కుటుంబానికి సీఎం కేసీఆర్ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. మిగిలిన సభ్యులు కూడా సాయన్న మృతిపట్ల సంతాపం తెలుపుతూ.. ఆయనతో ఉన్న అనుబంధాన్ని సభా వేదికగా పంచుకున్నారు. సాయన్న మృతికి శాసనసభ ...

MIM గుండాల అరాచకం - పోలీస్ స్టేషన్ లో..దళిత యువకుడి ఆత్మాహుతి.*

Image
*MIM గుండాల అరాచకం - పోలీస్ స్టేషన్ లో..దళిత యువకుడి ఆత్మాహుతి.* 🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥 అన్నపై దాడిచేసి, తన భార్యను వేధింపులకు గురిచేస్తున్న MIM గూండాలు ఫరూఖ్, వాసింలపై చట్టపరంగా చర్యలు తీసుకుని తమ కుటుంబానికి రక్షణ కల్పించాలని మలక్పేట్ పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేసినా, పోలీసులు MIM గూండాలకే వంతపాడడాన్ని తట్టుకోలేక *దళిత యువకుడు సోలంకి విజయ్* మలక్పేట్ పోలీస్ స్టేషన్ లోనే పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు ప్రయత్నించడంతో 80 శాతం కాలిన గాయాలతో ఉస్మానియా ఆసుపత్రి లో చేరి చికిత్స పొందుతున్న విజయ్ ను   *బీజేపీ యస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కొప్పు భాషా గారు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు కుమ్మరి శంకర్ గారు, కాంతి కిరణ్ గారు రాష్ట్ర ఉపాధ్యక్షులు గూటూరు అంబేద్కర్ గారు గద్దల అంజి బాబు గారు* పరామర్శించి, ఆ.. కుటుంబానికి అండగా ఉంటామన్నారు.  MIM గూండాలపై SC ST అట్రాసిటీ కేసు నమోదు చేసి, పిర్యాదు చేసినా పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీస్ అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

అసెంబ్లీ మీడియా పాయింట్ : - ఈటల రాజేందర్.

అసెంబ్లీ మీడియా పాయింట్ :  రాబోయే ఎన్నికల్లో ఓడిపోతామనే భయం కెసిఆర్ కి పట్టుకుంది.  అందుకే అన్ని వర్గాలను మచ్చిక చేసుకొనే ప్రయత్నం చేస్తున్నారు. కానీ నమ్మడానికి ప్రజలు సిద్దంగా లేరు.  అసెంబ్లీలో మాకు రూం ఇవ్వకపోవడం, BAC కి పిలవకపోవడం అంటే మమ్ముల్ని కాదు అసెంబ్లీనీ అవమానించారు.  మూడు రోజులపాటే అసెంబ్లీ జరపడం అంటే ప్రజసమస్యలపై చిత్తశుద్ది లేనట్టే.  సమైక్యపాలకులకు ఉన్న సోయి కేసీఆర్ ప్రభుత్వానికి లేదు.. అన్ని పార్టీలకు రూములు కేటాయించేవి గత ప్రభుత్వాలు,  కానీ ఈరోజు ముగ్గురు శాసనసభ్యులు ఉన్న బిజెపి పార్టీకి మాత్రం ఒక్క రూమ్ కూడా కేటాయించలేకపోతున్నారు.. ఇది కేవలం కక్ష సాధింపుకు నిదర్శనం. ఈరోజు ఉదయం స్పీకర్ గారికి ఫోన్ చేసి మాట్లాడితే కూడా సరిగా స్పందించలేదు. మా హక్కులను, సభా సాంప్రదాయాలను కాపాడవలసిన స్పీకర్ గారు మమ్మల్ని అవమానించడం చాలా బాధాకరం. ఈ రాష్ట్రంలో ప్రశాంతత లేదు. వందల మంది విద్యార్థులు, ప్రజలు మా వద్దకు వచ్చి మా యొక్క సమస్యలు అసెంబ్లీలో ప్రస్తావించండి అని మొరపెట్టుకుంటున్నారు. కనివిని ఎరుగని రీతిలో తెలంగాణలో వరదలు వచ్చి వేల ఎకరాలు కోతకు గురైనవి, వందల ఎక...

కుటుంబ సమేతంగా శ్రీ నరేంద్ర మోడీ గారిని కలిసిన బండి సంజయ్ కుమార్ గారు

Image
కుటుంబ సమేతంగా ప్రధాన మంత్రి శ్రీ *నరేంద్ర మోడీ* గారిని కలిసిన బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ *బండి సంజయ్ కుమార్* గారు

*_🙏నమస్కారం విలువ.. ఎంతో తెలుసా!?🙏_*

Image
*_🙏నమస్కారం విలువ.. ఎంతో తెలుసా!?🙏_* _[ప్రస్తుతం సమాజంలోని అనేక సమస్యలకు మూల కారణం ఒకరి నొకరు గౌరవించుకోక పోవడమే! అహంకారం వదిలి, ఎదుటి వారిని చులకనగా చూడడం వలన అనర్థాలు జరుగు తున్నాయి.]_ 💥💥💥💥💥 *మహాభారత యుద్ధ సమయంలో "మీరు పక్షపాతంగా యుద్ధం చేస్తున్నారు" అని దుర్యోధనుడు అనిన వ్యంగ్యమైన మాటలకు బాధపడిన భీష్మ పితామహడు _"నేను రేపు పాండవులను చంపుతాను"_ అని ప్రకటించాడు.* *అంతే... పాండవుల శిబిరంలో ఆందోళన పెరిగింది. భీష్ముని సామర్ధ్యం గురించి అందరికీ తెలుసు కాబట్టి, జరగబోయే పరిణామాల గురించి భయంతో కలవరపడ్డారు. అప్పుడు.. శ్రీ కృష్ణుడు తన వెంట ద్రౌపదిని తీసుకొని భీష్ముని శిబిరానికి వెళ్ళాడు.* *తను బయటే నిలబడి ద్రౌపదితో "నీవు వెళ్లి భీష్మునికి నమస్కరించు, ఆయన _"అఖండ సౌభాగ్యవతీ భవ"_ అని ఆశీర్వదిస్తాడు. తర్వాత జరిగేది గమనించు అన్నాడు.* *ద్రౌపది అలానే చేసింది, భీష్ముడు దీవించి, "ఏంటమ్మా! ఇంత రాత్రి ఒంటరిగా వచ్చావు. నిన్ను కృష్ణుడు తీసుకు వచ్చాడు కదా!" అన్నాడు.* *దానికి ద్రౌపది "అవును తాతయ్యా..! అన్న శిబిరం బయట నిలబడి ఉన్నారు" అనింది. భీష్ముడ...

(RGIA) మరోసారి ప్రపంచంలోనే అతిపెద్ద కార్గో విమానం ఎయిర్‌బస్ బెలూగా ల్యాండింగ్‌ను చూసింది.

హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (RGIA) మరోసారి ప్రపంచంలోనే అతిపెద్ద కార్గో విమానం ఎయిర్‌బస్ బెలూగా ల్యాండింగ్‌ను చూసింది. ప్రత్యేక తిమింగలం ఆకారంలో ఉండే ఎయిర్‌బస్ బెలూగా జూలై 31 గురువారం నాడు హైదరాబాద్ విమానాశ్రయానికి చేరుకుంది. భారీ విమానం ల్యాండింగ్, పార్కింగ్ మరియు టేకాఫ్ కోసం RGIA విమానాశ్రయం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. హైదరాబాద్‌లో ‘వేల్ ఆఫ్ ద స్కై’కి ఇది రెండోసారి. నివేదికల ప్రకారం, ఇంధనం నింపడానికి విమానం ఆగిపోయింది. బెలూగా వేల్ ఆకారపు ప్లాన్డ్ భారీ ఎయిర్ కార్గోను రవాణా చేయగల సామర్థ్యానికి ప్రసిద్ధి చెందింది. మే 2016లో, ఆంటోనోవ్ AN 225, ప్రపంచంలోనే అతిపెద్ద కార్గో విమానం, హైదరాబాలోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారతదేశంలో మొదటిసారిగా ల్యాండింగ్ చేయబడింది. 

ప్రధాన మంత్రి పథకాలు

*ప్రధాన మంత్రి పథకాలు*                 *A-Zలో*              *చూడండి*                     ఓటు రాక ముందు నుండి రాజకీయం చేస్తా ఉంటాం కానీ మన ప్రియతమ నేత *శ్రీ నరేంద్ర మోడీ* గారు మన దేశంలో అమలు చేసిన పథకాలను ప్రజలకు వివరించే విషయంలో చాలామంది వెనుకబడి ఉన్నాం కనుక ఒక చిన్న వయసు గల ఈ బాబు చిరునవ్వుతో తన మొహంలో సంతోషం చూస్తుంటే మరో తరానికి మరో *మోదీ* లాగా కనిపిస్తున్నాడు వినండి భారతీయe జనతా పార్టీ నాయకులకు కార్యకర్తలకు *నమస్కారాలు* దయచేసి ఈ యొక్క వీడియో నో ప్రతి ఒక్కరూ చూసి డిలీట్ చేయొద్దు అన్ని విలేజ్ గ్రూపులలో స్టేటస్ లలో మరియు మన ఫ్రెండ్స్ కి అందరికీ షేర్ చేయాలని కోరుకుంటున్నాను  

శీలేన శోభతే విద్య.. విద్య మనకు సంస్కారాన్ని నేర్పించాలి.

Image
శీలేన శోభతే విద్య.. విద్య మనకు సంస్కారాన్ని నేర్పించాలి. దురదృష్టవశాత్తు నేతి విద్యావ్యవస్థ మన సంస్కృతిని సాంప్రయాదాలు, విలువలను విద్యార్థులను నేర్పించడం లేదు.. మంచి నేర్పకున్నా చెడు నేర్పకుంటే అదే పదివేలు.. పదో తరగతి విద్యార్థులకు పేకాట పరిచయం ఏమిటని ఆశ్చర్యపోతున్నారా? ముమ్మాటికీ నిజం.. స్వయంగా మన ప్రభుత్వమే నేర్పిస్తోంది.. పేకాట అనేది ఒక జూదం.. ఎక్కడ పేకాట జరిగినా పోలీసులు రైడ్‌ చేసి సీజ్‌ చేస్తారు.. పేకాట రాయుళ్ల అరెస్టు అనే వార్తలు పత్రికల్లో, టీవీల్లో చూసే ఉంటారు..  ఇప్పుడు అసలు విషయానికి వద్దాం.. 10వ తరగతి ఇంగ్లీషు మీడియం మాథ్స్‌ పుస్తకంలో Deck of Cards and Probability అనే ఛాప్టర్‌ ఉంది (పేజీ 317) ' ఈ పాఠం లో పేకాట  లో మొత్తం ఎన్ని కార్డులు ఉంటయ్  ? వాటిలో ఎరుపు రంగు కార్డులు ఎన్ని ? నలుపు రంగు కార్డులు ఎన్ని ? ఇస్పెట్లు ఎన్ని ? చౌకిన్ లు ఎన్ని ? ఫ్లవర్లు ఎన్ని ? బాదం లు ఎన్ని ? ప్యాకాట కార్డుల్లోంచి ఒక కార్డు తీస్తే అది  బాదం ఎక్కా  అయ్యే చాన్స్ ఎంత ? అది చౌకిన్ 9 అయ్యే  చాన్సు ఎంత ? అది నలుపు రంగు కార్డు అయ్యే  చాన్స్ ఎంత ? కార్డుల్లోని ఒక కార్...

ఎన్డీఏ ఎంపీలకు ప్రధాని దిశానిర్దేశం

Image
*ఎన్డీఏ ఎంపీలకు ప్రధాని దిశానిర్దేశం* *ముగిసిన దక్షిణ భారత ఎన్డీఏ ఎంపీలు, ఆఫీస్ బేరర్ల సమావేశం* పార్లమెంట్ అనెక్స్ భవనంలో జరిగిన సమావేశం ఎన్డీఏ ఎంపీల భేటీకి హాజరైన తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలు, తమిళనాడు అన్నాడీఎంకే ఎంపీలు, కర్ణాటక బీజేపీ ఎంపీలు *హాజరైన తెలుగు నేతల్లో కిషన్ రెడ్డి, బండి సంజయ్, డీకే అరుణ, జీవీఎల్ నరసింహారావు, సోయం బాపూరావు, ధర్మపురి అరవింద్, డా. కే. లక్ష్మణ్* ఒకే రోజు రెండు ప్రాంతాల ఎన్డీఏ ఎంపీల భేటీలు మహారాష్ట్ర సదన్‌లో ఉత్తర్ ప్రదేశ్ ఎన్డీఏ ఎంపీల సమావేశం అక్కడ ముగించుకుని దక్షిణ భారత ఎన్డీఏ ఎంపీల భేటీకి హాజరైన ప్రధాని చేసింది చెప్పుకోవాలి. గత ప్రభుత్వాలు దశాబ్దాలుగా సాధించలేనిది కొన్నేళ్లలో సాధించి చూపెట్టాం మీమీ నియోజకవర్గాలు, ప్రాంతాల్లో కాల్ సెంటర్లను ఏర్పాటు చేసుకోండి కేంద్రం ప్రభుత్వం, మీరు చేసిన పనిని విస్తృతంగా ప్రచారం చేయండి. ప్రత్యర్థి పార్టీలు, అభ్యర్థులు వ్యాప్తి చేస్తున్న గందరగోళాన్ని తొలగించగల ప్రొఫెషనల్ సోషల్ మీడియా నిపుణులను నియమించుకోండి. ఇప్పటి నుంచి ఎన్నికల వరకు, మీ సంబంధిత లోక్‌సభ నియోజకవర్గాల్లో అత్యధిక సమయం ప్రజల మధ్య గడపండి. 👆పీఎం నరేంద్ర మోడీ ...

తెలంగాణలో 21 అమృత్ భారత్ స్టేషన్లకు శంకుస్థాపన

Image
*తెలంగాణలో 21 అమృత్ భారత్ స్టేషన్లకు శంకుస్థాపన* *- ఆగస్టు 6న శంకుస్థాపన చేయనున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ* *- తెలంగాణలో మొత్తం 39 అమృత్ భారత్ స్టేషన్లు* *- తొలివిడతలో రూ.894 కోట్ల వ్యయంతో 21 స్టేషన్లలో పనులు ప్రారంభం* *- ఈ పథకం ద్వారా.. రైల్వే స్టేషన్ల ఆధునీకరణ, ప్రయాణీకుల సౌకర్యార్థం వసతుల కల్పన, స్వచ్ఛత, ఉచిత వైఫై తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి* 1 ఆగస్టు, 2023, హైదరాబాద్ దేశంలో రైల్వేస్టేషన్ల సామర్థ్యాన్ని పెంచడం, ప్రయాణీకుల అవసరాలకు తగ్గట్లుగా అధునాతన సౌకర్యాలతో ఆధునీకరించడం కోసం కేంద్ర ప్రభుత్వం ‘అమృత్ భారత్ స్టేషన్ల’ పథకాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా జరుగుతున్న ఈ కార్యక్రమంలో భాగంగా.. తెలంగాణలో మొత్తం 39 స్టేషన్లను గుర్తించి వీటిని సంపూర్ణంగా ఆధునీకరించాలని నిర్ణయించారు. ఇందులో మొదటి విడతగా తెలంగాణ నుంచి 21 స్టేషన్లకు సంబంధించిన పనులు ఆగస్టు 6వ తేదీన ప్రధానమంత్రి నరేంద్రమోదీ గారి చేతుల మీదుగా ప్రారంభం కానున్నాయి. రైల్వే స్టేషన్ల ఆధునీకరణ కోసం ప్రారంభించిన ‘అమృత్ భారత్ స్టేషన్ల’ పథకంలో భాగంగా.. స్టేషన్లను ఆధునీకరించడంతోపాటు స్టేషన్ పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉ...

సినీనటి జయసుధ.. బీజేపీలో చేరిక

Image
*సినీనటి జయసుధ.. నేడే బీజేపీలో చేరిక*    *హైదరాబాద్ :ఆగస్టు 02*   *సినీనటి, మాజీ ఎమ్మెల్యే జయసుధ*  *బుధవారం ఉదయం ఢిల్లీకి చేరుకున్నారు.*   *ఈరోజు జయసుధ కాషాయం తీర్థం పుచ్చుకోనున్నారు. ఈ క్రమంలో జయసుధ దేశరాజధానికి చేరుకున్నారు. ఢిల్లీలోని బీజేపీ* *హెడ్‌క్వార్టర్స్‌లో ఈరోజు సాయంత్రం ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా  సమక్షంలో మధ్యాహ్నం జయసుధ కాషాయి* *కండువా* *కప్పుకోనున్నారు. పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో తెలంగాణ బీజేపీ అధ్యక్షులు, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఎంపీ లక్ష్మణ్  ఇప్పటికే* *ఢిల్లీలో ఉన్నారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శులు సునీల్ బన్సల్,బండి సంజయ్  తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు.*   *2009లో కాంగ్రెస్ నుంచి సికింద్రాబాద్ ఎమ్మెల్యేగా జయసుధ విజయం సాధించారు. అయితే గతంలో సికింద్రాబాద్ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన జయసుధ.. ఇప్పుడు ముషీరాబాద్ లేదా సికింద్రాబాద్ టికెట్ ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. మరి బీజేపీ పెద్దలు జయసుధకు ఎలాంటి హామీ ఇవ్వనున్నారో చూడాలి.           *వడే. అంబాజీరావు బిజెపి...