*వడ్డీ మాఫీనా ... రుణమాఫీనా ... ?*

*వడ్డీ మాఫీనా ... రుణమాఫీనా ... ?*
*బాబ్రాజిమానం భజగోవిందం .. పాలాభిషేకం పాపహరణం* 

గత ఎన్నికల్లో ఇచ్చిన రుణమాఫీ హామీకి ఆశపడి భంగపడ్డ రైతన్నకు వొరిగేదేముంది.. ఆదుకున్నది ఏడున్నది.. ఇప్పటికే తీసుకున్న తీసుకున్న రుణానికి వడ్డీ కూడా సగం తోడైయింది.. ఇన్నాళ్లు రెన్యూవల్ చేసుకున్న వడ్డీ కట్టడమే జరిగింది. ఎన్నికలొస్తున్నాయాని *ఇత్తినమ్మ మిత్తి వాయినం .. పుచ్చుకుంటామమ్మ ఓటు వాయినం* అన్నట్టుంది యవ్వారం.  ఇన్నాళ్లు కట్టిన మిత్తికి పంగనామమేనా? బ్యాంకులో ఉన్న రుణానికి మిత్తి కట్టేదెవరు? రుణ ఎగవేతదారుగా ముద్రపడి క్రెడిట్ స్కోర్ కోల్పోయిన రైతుల సంగతేమిటి? 
నెల గడువులో వడ్డీ మాఫీ జరుగుంతుందా ? కేవలం గులాబీ కార్యకర్తలకే పరిమితం కానుందా ? మీరు చేసే మాఫీ రుణమాఫీనా ? వడ్డీ మాఫీనా ? 

*రైతన్నలారా ఒక్కసారి ఆలోచన చెయ్యండి* 
ఇన్నాళ్లు ఋణం మాఫీ కాకా కొత్తగా అప్పు పుట్టాక, వడ్డీ వ్యాపారాలు నడ్డి విరిచిన తప్పదని భరించారు. ఐదేళ్లు ప్రతి బడ్జెట్ సమావేశములో ఆర్థిక ఆమోదం రాగానే వారములో మాఫి అంటూ ఊరిస్తూ.. ఊరిస్తూ చెవులల్ల నూనె పోసి ఇయ్యకుండ ఇప్పడిదాకా ఆపిండు. ఇప్పుడు వ్యతిరేకత వచ్చిందని రుణమాఫీ పేరున మాట చెప్పి పాలాభిషేకాలు అందుకుంటున్న కెసిఆర్ 

ఉద్దెరమాటల కాలం చెల్లింది .... సాగనంపే రోజులు వచ్చినై ... త్వరలో రాష్ట్రానికి పాలకొరత తీరనుంది


Comments

Popular posts from this blog

అర్ధరాత్రి రోడ్లపై తిరిగితే అరెస్ట్‌! టోలీచౌకీ పోలీసుల కఠిన చర్యలు

🔐 కొత్త ఆధార్ కార్డు డిజైన్: ఫోటో & QR కోడ్ మాత్రమే – మీ గోప్యతకు కొత్త రక్షణ!

🗳️🔥 లోక్‌సభలో ఘాటు డిబేట్: రాహుల్ విసిరిన 3 ఆరోపణలకు అమిత్ షా ఇచ్చిన ఝలక్!