Posts

Showing posts from December, 2018

హత్య చేసి రండి... విద్యార్థులకు వీసీ ఉద్బోధ..

Image
ఉత్తరప్రదేశ్‌లోని ఘాజీపూర్‌లో శనివారం రాళ్లు రువ్విన ఘటనలో ఓ పోలీస్ కానిస్టేబుల్ మృత్యువాత పడిన ఘటనపై ఓవైపు దుమారం రేగుతుండగా, మరోవైపు జాన్‌పూర్ యూనివర్శిటీ వైస్‌ఛాన్సలర్ వివాదాస్పద వ్యాఖ్యలతో మరో వివాదానికి తెరలేపారు. ఆయన చేసిన ప్రసంగంతో కూడిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో రాజకీయ పార్టీల నేతలతో పాటు నెటిజెన్లు మండిపడుతున్నారు.   హింసకు పాల్పడిన వారిని హత్య చేసేందుకు కూడా వెనుదీయ వద్దంటూ వీర్ బహదూర్ సింగ్ పూర్వాంచల్ యూనివర్శిటీ వైస్‌ ఛాన్సలర్ రాజా రాం మాదవ్ విద్యార్థులకు పిలుపునివ్వడం ఈ వీడియోలో కనిపిస్తోంది. 'మీరు పూర్వాంచల్ యూనివర్శిటీ విద్యార్థులైతే ఏడుస్తూ ఎప్పుడూ నా దగ్గరకు రావద్దు. ఎవరైనా మీతో పోట్లాడితే అతన్ని చితక్కొట్టండి. చేయగలిగితే అతన్ని చంపేసి మరీ రండి. ఆ తర్వాత వ్యవహారం మనం చూసుకుందాం' అంటూ యాదవ్ ప్రసంగం సాగింది. ఘజీపూర్‌లోని గాంధీపురంలో ఉన్న సత్యదేవ్ కాలాజీలో జరిగిన కార్యక్రమంలో రాజా రాం మాధవ్ ఈ వ్యాఖ్యలు చేశారు. యాదవ్‌ను యూనివర్శిటీ వీసీగా గవర్నర్ రామ్ నాయక్ గత ఏడాది నియమించారు. అంతకుముందు అలీగఢ్ యూనివర్శిటీ ఫిజిక్స్ డిపార్ట్‌మెంట్ ప్రొఫెసర్‌గా...

రాజ్యసభ ఎంపీలకు విప్ జారీ చేసిన బీజేపీ

Image
రాజ్యసభ ఎంపీలకు భారతీయ జనతా పార్టీ ఆదివారంనాడు విప్ జారీ చేసింది. సోమవారంనాడు జరిగే రాజ్యసభ సమావేశానికి ఎంపీలంతా తప్పనిసరిగా హాజరుకావాలని ఆ విప్‌లో కోరింది. ట్రిపుల్ తలాక్ బిల్లును సోమవారంనాడు పెద్దల సభలో కేంద్రం ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ఈ విప్ జారీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది.   ట్రిపుల్ తలాక్ బిల్లు గత గురువారంనాడు విపక్షాల వాకౌట్ మధ్య లోక్‌సభ ఆమోదం పొందింది. బిల్లుకు అనుకూలంగా 245 ఓట్లు రాగా, వ్యతిరేకంగా 11 ఓట్లు వచ్చాయి. దీంతో రాజ్యసభలోనూ బిల్లు ప్రవేశపెడుతున్నట్టు న్యాయశాఖ మంత్రి రవిశంర్ ప్రసాద్ ప్రకటించారు. అందుకు అనుగుణంగానే ఈనెల 31న రాజ్యసభ ఎజెండాలో ఈ అంశాన్ని చేర్చారు.

లాలీపాప్‌ల‌తో జాగ్రత్త.. ప్రధాని మోదీ హెచ్చరిక..

Image
 పేరిట రైతులను మోసం చేస్తున్నారంటూ కాంగ్రెస్ పార్టీపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ విరుచుకుపడ్డారు. అలాంటి ‘‘లాలీపాప్‌ల’’ విషయంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఇవాళ ఉత్తర ప్రదేశ్‌లోని ఘాజీపూర్‌లో జరిగిన ఓ ర్యాలీలో ఆయన పాల్గొని ప్రసంగించారు. తాను ‘‘కాపలాదారుడినే’’ అని పునరుద్ఘాటించిన ఆయన.. ‘‘దొంగలను’’ వదిలిపెట్టబోనని, వారిని ఎక్కడికి పంపాలో అక్కడికే పంపిస్తానని వ్యాఖ్యానించారు. పేదలు, రైతుల అభ్యున్నతి కోసం తన ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుంటే.. ప్రతిపక్షాలు రుణమాఫీ వంటి ‘‘లాలీపాప్’’లతో తక్షణ రాజకీయ లబ్ది కోసం పాకులాడుతున్నాయన్నారు. ‘‘ఎలాంటి హామీలు ఇస్తున్నారో చూశారా? తక్షణ రాజకీయ ప్రయోజనాల కోసమే ఇలాంటి హామీలు, నిర్ణయాలు తీసుకుంటున్నారు. కానీ సమస్యలకు ఇది శాశ్వత పరిష్కారం కాదు..’’ అని ప్రధాని పేర్కొన్నారు. మధ్య ప్రదేశ్, రాజస్థాన్‌‌ రాష్ట్రాల్లో ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వాలు రైతు రుణమాఫీలు ప్రకటించిన నేపధ్యంలోనే ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.   ‘‘2009 లోక్‌సభ ఎన్నికలకు ముందు కూడా.. కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ లాలీపాప్‌లాంటి రుణమాఫీ ప్రకటన చేసింది. మరి ...

మంచులో చిక్కుకున్న 3వేల మంది టూరిస్టులు.. కాపాడిన సైన్యం..

Image
సిక్కింలోని భారత్-చైనా సరిహద్దుల్లో నాథులా మార్గం వద్ద  చిక్కుకున్న 3 వేల మంది టూరిస్టులను భారత సైన్యం కాపాడింది. పెద్దఎత్తున కురుస్తున్న మంచు కారణంగా వీరు ప్రయాణిస్తున్న వాహనాలు మంచులో చిక్కుకుపోవడంతో సైన్యం హుటాహుటిన వీరిని సురక్షిత ప్రాంతాలకు తరలించింది. పర్యాటకులకు వసతి కల్పించడం కోసం జవాన్లు తమ బ్యారక్‌లను ఖాళీ చేసి ఇవ్వడం విశేషం. పర్యాటకుల్లో మహిళలు, చిన్నపిల్లలు కూడా ఉన్నారనీ.. అందరికీ ఆహారం, వసతితో పాటు రగ్గులు కూడా అందించినట్టు ఆర్మీ వెల్లడించింది.   ‘‘నాథులా మార్గాన్ని సందర్శించి తిరిగి వస్తున్న 300 నుంచి 400 వాహనాలు మంచు కారణంగా 17వ మైలు వద్ద చిక్కుకున్నాయి. భారత సైన్యం వెంటనే రంగంలోకి దిగ సహాయక చర్యలు చేపట్టింది. అందరినీ తరలించి ఆహారం, వసతి కల్పించింది. చలినుంచి కాపాడుకోవడానికి రగ్గులతో పాటు అవసరమైన మందులు సరఫరా చేశాం..’’ అని ఆర్మీ అధికారి ఒకరు వెల్లడించారు. 17వ మైలు వద్ద 1500 మంది చిక్కుకోగా... మిగతా వారంతా 13వ మైలువద్ద నిలిచిపోయారని ఆయన తెలిపారు. రోడ్లపై పేరుకుపోయిన మంచును తొలగించేందుకు సైన్యం భారీ యంత్రాలు, డోజర్లు వినియోగిస్తోంది.

మోదీ బ‌యోపిక్‌లో రామ్ చ‌ర‌ణ్ విల‌న్

Image
బాలీవుడ్‌లో ప్ర‌స్తుతం బ‌యోపిక్ సీజ‌న్ న‌డుస్తుంది. క్రీడా, రాజ‌కీయానికి సంబంధించిన ప‌లువురు ప్ర‌ముఖుల జీవిత నేప‌థ్యంలో బ‌యోపిక్స్ తెర‌కెక్కుతుండ‌గా ప్ర‌స్తుతం భార‌త ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ బ‌యోపిక్‌ని తెర‌కెక్కించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఒమంగ్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో ఈ ప్రాజెక్ట్ తెర‌కెక్క‌నుండ‌గా, దీనికి సంబంధించిన వ‌ర్క్ గ‌త ఏడాదిన్న‌ర నుండి జ‌రుగుతుంద‌ట‌. స్క్రిప్ట్‌, స్టోరీ, స్క్రీన్‌ప్లే త‌దిత‌ర అంశాల‌పై ఒమంగ్ కుమార్ టీం భారీ వ‌ర్క్ చేస్తున్న‌ట్టు తెలుస్తుంది. అధికారుల నుండి అనుమతి రాగానే చిత్రాన్ని సెట్స్‌పైకి తీసుకెళ్ళాల‌నే ఆలోచ‌న‌లో టీం ఉంది. అయితే బ‌యోపిక్‌లో ప్ర‌ధాని మోదీ పాత్ర కోసం బాలీవుడ్ న‌టుడు వివేక్ ఒబేరాయ్‌ని ప‌రిశీలిస్తున్న‌ట్టు స‌మాచారం. నార్త్‌తో పాటు సౌత్‌లోను క్రేజ్ పెంచుకున్న వివేక్ ఒబేరాయ్ అయితే చిత్రానికి దేశ‌మంత‌టా ఆద‌ర‌ణ ల‌భిస్తుంద‌ని చిత్ర బృందం భావిస్తుంద‌ట‌. వివేక్ ఓబేరాయ్ రీసెంట్‌గా తెలుగులో తెర‌కెక్కిన విన‌య విధేయ రామ చిత్రంలో ప్ర‌తినాయ‌కుడిగా క‌నిపించిన సంగ‌తి తెలిసిందే.

దేశ చరిత్రలొ మరొక తిరుగులేని ఓప్పందం చేసుకోనున్న మోది ప్రభుత్వం

Image
దేశ చరిత్రలొ మరొక తిరుగులేని ఓప్పందం చేసుకోనున్న మోది ప్రభుత్వం భారతదేశాన్ని ప్రపంచశక్తిగా మార్చే దిశగా మోది ప్రభుత్వం మరొక గొప్ప నిర్ణయం తీసుకుంది .... ఇప్పటికే అమెరికా, ఫ్రాన్స్ దేశాలతొ లాజిస్టిక్ అగ్రిమెంట్ చేసుకున్న భారత్, ఇప్పుడు మనకు అత్యంత అవసరమైన, కీలక దేశమైన #జపాన్ తొ లాజిస్టిక్స్ అగ్రిమెంట్ చేసుకొనుంది. ఈ అగ్రిమెంట్ పేరే  Acquisition and Cross-Servicing Agreement (ACSA)  ....  హిందూ మహాసముద్రంలొ పెరుగున్న చైనా హవాను తగ్గించడానికి మోది ప్రభుత్వం ఈ కీలక  నిర్ణయం తీసుకుంది ....  ఈ ఓప్పందం ద్వారా ఇరు దేశాల మద్య రక్షణ సౌకర్యాలను ఇచ్చిపుచ్చుకొవడం, లాజిస్టిక్స్,  మిలటరీ తొడ్పాటుతొపాటు ఇరు దేశాలు ఒకరికొకరు పొర్టులను, బేస్ లను కూడా ఉపయొగించుకునేలా ఈ ఓప్పందం కుదుర్చుకోనున్నారు ...  ఇప్పటికే ఒక అంగీకారానికి వచ్చిన ఇరు దేశాలు,  కొత్త సంవత్సరంలొ దీనికి సంబందించిన చర్చలు + ఓప్పందం చేసుకోనున్నారు ...   లాజిస్టిక్స్ కు సంబందించిన గొప్ప టెక్నాలజి జపాన్ సొంతం ... దీనితొ, ఈ ఒప్పందం భారత్ కు మంచి బూస్ట్ ఇచ్చే అంశం కానుంది.

సకాలంలో రుణాలు చెల్లించే రైతులకు వడ్డీ రద్దు!

Image
పంట రుణాలను సకాలంలో తిరిగి చెల్లించే రైతులకు ప్రోత్సాహకం ఇచ్చేందుకు నరేంద్ర మోదీ ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఈ నిర్ణయం తీసుకుంటే ప్రభుత్వ ఖజానాపై రూ.15 వేల కోట్లు భారం పడుతుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఆహార పంటలపై బీమా ప్రీమియంను పూర్తిగా రద్దు చేయాలన్న ప్రతిపాదన కూడా పరిశీలనలో ఉన్నట్లు తెలిపాయి. ఉద్యాన వన పంటలపై ప్రీమియంను కూడా తగ్గించే ప్రయత్నం జరుగుతున్నట్లు తెలిపాయి.   రైతులకు ప్రయోజనకరమైన పథకాల రూపకల్పన కోసం కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధా మోహన్ సింగ్ ఇతర సీనియర్ మంత్రులతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.

బాలలపై అత్యాచారం చేస్తే మరణ శిక్ష

Image
బాలలపై అత్యాచారాలకు పాల్పడే నేరస్థులకు మరింత కఠిన శిక్షలు విధించేందుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ శుక్రవారం మాట్లాడుతూ లైంగిక నేరాల నుంచి బాలల పరిరక్షణ (పోక్సో) చట్టానికి సవరణలను మంత్రివర్గం ఆమోదించినట్లు తెలిపారు. ఈ చట్టంలోని కొన్ని సెక్షన్ల ప్రకారం విధించే శిక్షలను పెంచాలని నిర్ణయించినట్లు తెలిపారు.   బాలలు మేజర్ అయ్యేందుకు హార్మోన్లను ఇంజెక్ట్ చేయడాన్ని సెక్షన్ 9 ప్రకారం తీవ్ర నేరంగా పరిగణించేందుకు ఆమోదం లభించిందని చెప్పారు. చైల్డ్ పోర్నోగ్రఫీకి పాల్పడే నేరస్థులకు కొన్ని సెక్షన్ల ప్రకారం మరణ శిక్ష విధించే అవకాశం కల్పించినట్లు తెలిపారు.

సొంత నియోజకవర్గానికి మళ్లీ మోదీ...

Image
ప్రధాని నరేంద్ర మోదీ శనివారంనాడు వారణాసి, ఘజీపూర్‌లో పర్యటించనున్నారు. తన సొంత నియోజకవర్గమైన వారణాసిలో గత రెండు నెలల్లో మోదీ పర్యటించనుండటం ఇది రెండోసారి. ప్రధాని తన పర్యటనలో భాగంగా వారణాసిలోని నేషనల్ సీడ్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ సెంటర్‌లో ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (ఐఆర్ఆర్ఐ) అండ్ ఆసియా రీజినల్ సెంటర్ (ఐఎస్ఏఆర్‌సీ)ను ప్రారంభిస్తారు. అనంతరం, దీన్‌దయాళ్ హస్తకళా సంకుల్‌లో ఏర్పాటు చేస్తున్న 'వన్ డిస్ట్రిక్ట్, వన్ ప్రొడక్ట్' ప్రాంతీయ సదస్సులో మోదీ పాల్గొంటారు. అనంతరం ఘజీపూర్‌లో జరిగే కార్యక్రమంలో మహారాజా సుహల్‌దేవ్ స్మారక పోస్టల్ స్టాంప్ విడుదల చేస్తారు.   కాగా, యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వంలో సీనియర్ మంత్రి, ఎస్‌బీఎస్‌పీ ఆధ్యక్షుడు ప్రకాష్ రాజ్‌భర్ మాత్రం ప్రధాని కార్యక్రమంలో పాల్గొనేది లేదని గతవారం ప్రకటించారు. ఘజిపూర్ జిల్లా జహూరాబాద్‌ అసెంబ్లీ నియోజకవర్గానికి ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వెనుకబడిన తరగతి నేత అయిన మహారాజా సుహల్‌ దేవ్ రాజ్‌భర్ పూర్తి పేరు పోస్టల్ స్టాంప్‌‌లో లేదంటూ ప్రకాష్ రాజ్ భర్  ఇప్పటికే తన అసంతృప్తిని వ్యక్తం చేశారు.

మోదీ కొత్త ఆలోచన... నేరుగా ప్రజల బ్యాంకు ఖాతాల్లోకి సొమ్ము...!!

Image
లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం ఓ కొత్త పథకానికి రూపకల్పన చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆదాయం సంపాదించుకునే సామర్థ్యం లేనివారి బ్యాంకు ఖాతాలకు నిర్దిష్ట మొత్తంలో సొమ్మును జమ చేయాలని ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. దీనిని సార్వజనీన మౌలిక ఆదాయ పథకంగా పిలిచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.   పెద్ద నోట్ల రద్దు, జీఎస్‌టీ వంటి నిర్ణయాలపై ప్రజలు స్పందిస్తున్న తీరుతో బీజేపీ ఏదో విధంగా మళ్ళీ ప్రజలను తమవైపు తిప్పుకోవాలని ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. రైతుల కోసం రుణమాఫీ వంటి పథకం గురించి ఆలోచిస్తున్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. మోదీ, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, వ్యవసాయ శాఖ మంత్రి ఇటీవలే చర్చలు జరిపినట్లు సమాచారం.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై బీజేపీ ఫైట్.. సెంట్రల్ ఈసీకి ఫిర్యాదు

Image
ముందస్తు ఎన్నికలు ప్రజాస్వామ్య పద్దతిలో జరగలేదని మండిపడుతున్న రాష్ట్ర బీజేపీ నేతలు.. గురువారం కేంద్రం ఎన్నికల సంఘం అధికారులకు ఫిర్యాదు చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని పేర్కొన్నారు. అధికార టీఆర్ఎస్ పార్టీకి రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు అనుకూలంగా ఉన్నారనే విషయాన్ని అందులో ప్రస్తావించారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు లక్షల మంది ఓటర్ల పేర్లు గల్లంతవడంలో ఈసీ ప్రమేయం ఉందని ఆరోపించారు. బీజేపీకి బలమున్న చోట ఓటర్ల సంఖ్య తగ్గిందని.. అదే మజ్లిస్ ప్రాబల్యమున్న ప్రాంతాల్లో ఓటర్ల సంఖ్య పెరిగిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇదంతా కూడా పలు అనుమానాలకు తావిస్తోందని సెంట్రల్ ఈసీ దృష్టికి తీసుకెళ్లారు బీజేపీ నేతలు. ఓటర్ల తొలగింపులో పొరపాట్లు జరిగిన మాట వాస్తవమేనంటూ రాష్ట్ర ఎన్నికల అధికారి క్షమాపణలు కూడా కోరడం అక్రమాలు జరిగాయనడానికి నిదర్శనమని తెలిపారు. అయితే కేంద్ర ఎన్నికల కమిషనర్ తమ ఫిర్యాదుపై సానుకూలంగా స్పందించారని తెలిపారు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్.

మహిళలను శబరిమల తీసుకెళ్ళడంపై దేవాదాయ మంత్రి సంచలన వ్యాఖ్యలు

Image
తిరువనంతపురం : శబరిమల అయ్యప్ప దేవాలయంలోకి మహిళలను తీసుకెళ్ళడంపై కేరళ ప్రభుత్వానికి ప్రత్యేక ఆసక్తి లేదని దేవాదాయ శాఖ మంత్రి కే సురేంద్రన్ చెప్పారు. గురువారం జరిగిన దేవస్థానం బోర్డు సమావేశం అనంతరం సురేంద్రన్ మీడియాతో మాట్లాడుతూ సన్నిధానంలో గూండాలు సృష్టించే సమస్యలకు తాము భయపడేది లేదన్నారు. ప్రభుత్వం తలచుకుంటే ఈపాటికి చాలా మంది మహిళలు అయ్యప్ప దేవాలయాన్ని సందర్శించి ఉండేవారన్నారు. అయ్యప్ప దేవాలయంలోకి మహిళలను తీసుకెళ్ళాలన్న ఆసక్తి తమకు లేదన్నారు.   అన్ని వయసుల మహిళలు అయ్యప్ప దేవాలయంలో ప్రవేశించవచ్చునని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో దాదాపు 20 మంది మహిళలు అయ్యప్పను దర్శించుకునేందుకు ప్రయత్నించారు. కానీ పెద్ద ఎత్తున నిరసన ఎదురవడంతో వారంతా వెనుదిరిగారు.   శబరిమల అయ్యప్ప దేవాలయంలోకి ప్రవేశించేందుకు వచ్చే మహిళలకు తాము భద్రత కల్పించలేమని ఈ ఆలయం వద్ద నియమితులైన పోలీసులు రాష్ట్ర డీజీపీ లోక్‌నాథ్ బెహరాకు బుధవారం తెలిపిన సంగతి తెలిసిందే.

రైతులకు తాయిలాల కోసం మోదీ కీలక భేటీ!

నరేంద్ర మోదీ ప్రభుత్వం దేశంలోని రైతులకు భారీ వరాలు ప్రకటించబోతున్నట్లు తెలుస్తోంది. జాతీయ మీడియా కథనాల ప్రకారం ప్రధాని మోదీ బుధవారం సాయంత్రం కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, వ్యవసాయ మంత్రి రాధామోహన్ సింగ్‌లతో సమావేశమమ్యారు. మోదీ నివాసంలో మూడు గంటలపాటు జరిగిన ఈ సమావేశంలో రైతుల కోసం కొత్తగా కొన్ని చర్యలను ప్రకటించబోతోంది. వచ్చే నెల 5న పార్లమెంటు శీతాకాల సమావేశాలు ముగుస్తాయి. అంతకుముందే ఈ ప్రకటన వెలువడే అవకాశం కనిపిస్తోంది.   కనీస మద్దతు ధరకు, మార్కెట్ ధరకు మధ్య వ్యత్యాసాన్ని రైతులకు నేరుగా చెల్లించడంపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఈ సొమ్మును నేరుగా రైతుల బ్యాంకు ఖాతాలకు జమ చేసేందుకు ఆలోచన జరిగినట్లు సమాచారం.   మధ్య ప్రదేశ్‌లో శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వం అమలు చేసిన భవతార్ స్కీమ్ (ధరల వ్యత్యాసం పథకం) విధానంలో ఈ నూతన పథకాన్ని రూపొందించాలని మోదీ ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు సమాచారం.

రైతులకు అబద్ధాలు చెప్పవద్దు : రాహుల్‌కు మోదీ సలహా

Image
కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తీవ్రంగా మండిపడ్డారు. హిమాచల్ ప్రదేశ్‌లో జరిగిన బహిరంగ సభలో మోదీ మాట్లాడుతూ రుణాల రద్దు పేరుతో రైతులను కాంగ్రెస్ తప్పుదోవ పట్టిస్తోందని ఆరోపించారు.   రుణాల రద్దు సాధ్యం కాదని కాంగ్రెస్‌కు తెలుసునని, ఎన్నికల్లో గెలవడానికి మాత్రమే ఆ విధంగా చేస్తున్నారని అన్నారు. ఎన్నికల్లో గెలవడానికి యువతను వెర్రివాళ్ళను చేస్తున్నారని, రైతులకు వెన్నుపోటు పొడుస్తున్నారని మోదీ అన్నారు.   కాంగ్రెస్ ప్రభుత్వాలు పని చేయలేకపోతే రైతులకు ఆ విషయం చెప్పాలని, దానిని రైతులు అంగీకరిస్తారన్నారు. రైతులతో అబద్ధాలు చెప్పవద్దని సలహా ఇచ్చారు. రైతుల జీవితాలతో ఆడుకోవద్దని హితవు పలికారు.   2008లో రైతుల రుణాలు రూ.6 లక్షల కోట్లు ఉంటే, కాంగ్రెస్ ప్రభుత్వం రూ.60 వేల కోట్లు రద్దు చేస్తున్నట్లు ప్రకటించి, కేవలం రూ.52 వేల కోట్లు చెల్లించిందని చెప్పారు. పంజాబ్‌లో ఎన్నికలకు ముందు రుణాల రద్దుకు హామీ ఇచ్చారని అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు ఏమీ ఇవ్వలేదని చెప్పారు. కర్ణాటకలో కూడా కేవలం 800 మంది రైతులు మాత్రమే లబ్ధి పొందారు. అది కూడా నామమాత్రమేనని చెప్పారు.

#మోడీ పాలనలో ప్రజలకు #మజా లేదు....!!

Image
#మోడీ పాలనలో ప్రజలకు #మజా లేదు....!! *************************** #మన్మోహన్ గద్దెనెక్కే నాటికి 32/- ఉన్న పెట్రోల్ రేటు దిగిపోయే నాటికి 75/- కు చేరింది., మధ్యలో ఒకసారి 83.60/- కూడా టచ్ అయింది.. ఈ #మోడీగారి పాలనేంటి....??  గద్దెనెక్కే నాటికి 75/- ఉన్న పెట్రోలును 69/- కి తీసుకొచ్చారు., మధ్యలో  ఒకసారి 62/- కడా టచ్ అయింది.. కింద #గూటం పెట్టించుకోవడానికి గత 70 ఏళ్ళుగా అలవాటు పడిన ఈదేశ ప్రజలకు మోడీ పాలన #మజా_కిక్ ఇవ్వడం లేదు.. అంతేకాదు ఎప్పుడూ ఏదో ఒక #కుంభకోణానికి సంబంధించిన వార్తలు వినడానికి, చదవడానికి చెవులూ కళ్ళూ అలవాటు పడిపోయాయి.. వాటికీ మజా లేదు.. #సరిహద్దుల్లో.. "కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లఘించిన పాకిస్థాన్, ముగ్గురు భారత సైనికులు మ్రృతి.." వంటి వార్తలు అసలే వినిపించడం లేదు.. మనిషి ఇంట్లోనుంచి బయటికెళ్ళి సాయంకాలం హాయిగా తిరిగొచ్చేస్తున్నాడు.. ఇంతకుముందు ఎక్కడ #బాంబు పేలుతుందో, శరీరాలు తునాతునకలై ఎక్కడ పడిపోతాయో అనే ఆలోచనతో ఒళ్ళు దగ్గరపెట్టుకుని బ్రతికేవాడు.. బస్సులో/ట్రైనులో కూర్చునేముందు సీటు కింద ప్రక్కన పదిసార్లు చెక్ చేసుకునేవారు.. నిత్యం బస్టాండుల్లో రైల్వే స్టేషన్లలో అ...

మరొక చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్న మోది ప్రభుత్వం

Image
మరొక చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్న మోది ప్రభుత్వం హిందువుల పవిత్ర పురాణ కావ్యం  #రామాయణం లొ కీలక ఘట్టం #రామసేతు .... రామసేతు వారధి భారత్ లొని #ధనుష్కొడి  నుండి ప్రారంభమవుతుంది ... అయితే ఇప్పటి వరకు రామేశ్వరం నుండి ధనుష్కొడి  కు వెళ్ళడానికి రైల్వే మార్గం లేదు ... ఇంతకు ముందు నిర్మించిన సింగిల్ లైన్  రైల్వే మార్గం, 1964 లొ వచ్చిన పెనుతుఫాన్ మూలంగా పూర్తిగా ద్వంసమయింది ... అప్పటి నుండి ఈ ప్రాజెక్టును ఏ ప్రభుత్వాలు పట్టించుకున్న పాపానపొలేదు ... అయితే 2003 లొ అప్పటి ప్రధాని వాజపాయ్ గారు ఇక్కడ రైల్వే లైన్ నిర్మాణానికి సంకల్పించారు ... అయితే తరువాత వచ్చిన UPA  ప్రభుత్వం, ఈ ప్రాజెక్టును మూలపడేసింది ... అయితే ఇప్పుడు మోది ప్రభుత్వం ఈ ప్రాజెక్టును మరలా పట్టాలకెక్కించింది ... రామేశ్వరం నుండి ధనుష్కొడి వరకు 17.20 కిలొమీటర్ల రైల్వే లైను 208 కొట్లతొ నిర్మించనున్నారు ... ప్రతి సంవత్సరం లక్షల మంది యాత్రికులు రామసేతు ను సందర్శిచడానికి ధనుష్కొడి  కు వస్తుంటారు .... దీనిని దృష్టిలొ పెట్టుకొని కొత్త సంవత్సరం కానుకగా, మోది ప్రభుత్వం ఈ ప్రాజెక్టును ప్రారంభించనుంది

ప్రధాని మోదీతో కేసీఆర్‌ భేటీ

Image
 నరేంద్ర మోదీతో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ భేటీ అయ్యారు. ఈ సాయంత్రం దిల్లీలోని ప్రధాని నివాసం 7 లోక కళ్యాణ్‌ మార్గ్‌ వద్దకు చేరుకున్న కేసీఆర్‌ మోదీతో సమావేశమయ్యారు. ఈ భేటీలో ప్రధానంగా రాష్ట్ర విభజన హామీలను మోదీ దృష్టికి తీసుకెళ్లనున్నారు. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించిన తర్వాత తొలిసారిగా ఆయన దిల్లీ వచ్చారు. సమాఖ్య కూటమి ఏర్పాటులో భాగంగా ఒడిశా, పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రులను కలిసిన కేసీఆర్‌ సోమవారం రాత్రి దిల్లీ చేరుకున్న విషయం తెలిసిందే. మంగళవారం క్రిస్మస్‌ సెలవు రోజు కావడంతో ఆయన ఎవరినీ కలవలేదు. ప్రధానమంత్రితో భేటీలో ప్రస్తావించే అంశాలపై ఉన్నతాధికారులతో చర్చించి కసరత్తు చేసినట్టు సమాచారం.  విభజన చట్టంలో పేర్కొన్న కాజీపేట రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు కర్మాగారం, ట్రిపుల్‌ ఐటీ.. తదితర అంశాలపై ప్రధానికి మరోసారి కేసీఆర్‌ లేఖలు అందజేయనున్నారు. ప్రత్యేక హైకోర్టు ఏర్పాటులో జాప్యంపై ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్‌, తెరాస ఎంపీలు అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రధానమంత్రితో భేటీలో ఈ అంశాన్ని లేవనెత్తే అవకాశం ఉంది. పోలవరానికి జాతీయ హోదా ఇచ్చిన నేపథ్యంలో త...

ఓటర్ల జాబితాపై ఫిర్యాదులు అందాయి పోటీ మొదలు ఫలితాల దాకా.. ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో తెలుసుకునే వీలు

Image
 పంచాయతీ ఎన్నికలు త్వరలో జరగనున్న నేపథ్యంలో పల్లెల్లో హడావుడి పెరిగింది. సర్పంచి పదవికి నామినేషన్‌ వేసేదెవరు.. ఉపసంహరించుకునే వారెవరు.. తుది పోరులో నిలిచేది ఎవరు.. అర్హతలేంటి.. ఇలాంటి విషయాలన్నీ ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో తెలుసుకోవచ్చు. తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ tsec.gov.in వెబ్‌సైట్‌లోకి వెళ్తే.. పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన సమస్త సమాచారం ఇట్టే తెలిసిపోతుంది. పోటీకి అర్హులేనా.. కాదా.. సర్పంచిగా పోటీ చేసే వారి కోసం ప్రత్యేకంగా క్యాండిడేట్‌ పోర్టల్‌ను రూపొందించారు. అభ్యర్థులు అనుసరించాల్సిన నియమావళిపై ఇందులో కరదీపిక ఉంటుంది. పోలింగ్‌ కేంద్రాలవారీగా ఓటర్ల జాబితా సైతం లభిస్తుంది. అన్నింటికన్నా ముఖ్యంగా గత ఎన్నికల్లో చేసిన ఖర్చును వెల్లడించకుండా అనర్హతకు గురైన వారి వివరాలూ ఇందులో ఉంటాయి. నామినేషన్‌ను సైతం ఆన్‌లైన్‌లో పూరించి, ప్రింట్‌ తీసి సంతకం చేసి ఎన్నికల రిటర్నింగ్‌ అధికారికి సమర్పిస్తే సరిపోతుంది. ఆన్‌లైన్‌లో ఓటర్‌ స్లిప్‌.. ఓటర్లు ఆన్‌లైన్‌లో ఓటరు స్లిప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. గ్రామంలో గతంలో పోటీ చేసిన ప్రజాప్రతినిధుల వివరాలు, ప్రస్తుతం బరిలోఉన్న వారి సమాచారాన్నీ వెబ్‌సై...

తెలంగాణ క్యాబినెట్ విస్త‌ర‌ణ ముహూర్తం ఖ‌రారు..! : కేటిఆర్ కు డౌట్ : స‌్పీక‌ర్ గా సీనియ‌ర్ ..!

Image
తెలంగాణ క్యాబినెట్ విస్త‌ర‌ణ ముహూర్తం దాదాపు ఖ‌రారైంది. తెలంగాణ ఎన్నిక‌ల్లో గెలిచిన త‌రువాత ముఖ్య‌మంత్రి గా కెసిఆర్..మంత్రిగా మ‌హ‌మూద్ అలీ ప్ర‌మాణ స్వీకారం చేసారు. ఆ త‌రువాత క్యాబినెట్ ఎప్పుడు విస్త‌రిస్తార‌నే అంశం పై అనేక ఊహాగానాలు ప్ర‌చారం లోకి వ‌చ్చాయి. అయితే, కేసీఆర్ దీని పై ఓ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు స‌మాచారం. స్పీక‌ర్ ప‌ద‌వి సైతం ఖ‌రారైంద‌ని చెబుతున్నారు. ఇక‌, కేటిఆర్ కు క్యాబినెట్ లో స్థానం పై ఇంకా స్ప‌ష్ట‌త రాలేదు.. విస్త‌ర‌ణ ముహూర్తం దాదాపు ఖరారు... తెలంగాణ క్యాబినెట్ విస్త‌ర‌ణ ముహూర్తం దాదాపు ఖ‌రారు అయింది. ముఖ్య‌మంత్రిగా కేసిఆర్‌..మంత్రిగా మ‌హ‌మూద్ అలీ ప్ర‌స్తుతం క్యాబినెట్‌లో ఉన్నారు. మ‌రో 16 మంది వ‌ర‌కు మంత్రివ‌ర్గంలోకి తీసుకొనేందుకు వెసులు బాటు ఉంది. అందు లో గ‌తంలో జ‌రిగిన పొర‌పాట్లు పున‌రావృతం కాకుండా..మ‌హిళ‌ల‌కు ప్రాధాన్య‌త ఇవ్వాల‌ని ఇప్ప‌టికే కేసిఆర్ నిర్ణ‌యించి న‌ట్లు స‌మాచారం. దీంతో..మ‌హిళ‌కు స్పీక‌ర్ ప‌ద‌వి ఇవ్వాలా లేక కీల‌క మంత్రి పోర్టుఫోలియో ఇవ్వాలా అనే దాని పై తుది నిర్ణ‌యం తీసుకోనున్నారు. ఈ నెల 30వ తేదీ కేసిఆర్ త‌న క్యాబినెట్ విస్త‌ర‌ణ కు యోచిస్తున్న‌ట్లు విశ్వ‌...

2019లో 40,000 కొత్త ఉద్యోగాలు రంగ సిద్ధం చేసిన టెక్‌, ఈ కామర్స్‌ సంస్థలు

Image
నిరుద్యోగులకు శుభవార్త! 2019లో టెక్నాలజీ ఉద్యోగార్థుల పంట పండనుంది. టెక్‌ అంకురాలు, ఈ కామర్స్‌ సంస్థలు భారీ స్థాయిలో ఉద్యోగాలు ఇవ్వనున్నాయి. హెల్తియన్స్‌, మిల్క్‌ బాస్కెట్‌, కార్స్‌ 24, ఇస్టామోజో, మో ఎంగేజ్‌ వంటి సంస్థలు ఇప్పటితో పోలిస్తే 50 శాతం ఎక్కువ ఉద్యోగాలు ఇవ్వనున్నాయట. మార్కెట్లలో చొచ్చుకు పోవాలని ప్రయత్నిస్తున్న జొమాటో, ఓయో, స్విగ్గీ వంటి సంస్థలు తమ ఉద్యోగులను 30 శాతం పెంచుకొనేందుకు ప్రణాళికలు సిద్ధం చేశాయని విశ్లేషకులు అంటున్నారు. ‘క్రృతిమ మేధస్సు, బిగ్‌డేటా అనలిటిక్స్‌ ఉద్యోగ వాతావరణాన్ని పూర్తిగా మార్చనున్నాయి. ఎక్కువ ఉద్యోగాలను సృష్టించనున్నాయి’ అని నాస్కామ్‌ ఉపాధ్యక్షుడు కేఎస్‌ విశ్వనాథన్‌ అన్నారు. 2019లో టెక్‌ సంస్థలు 40,000 అదనపు ఉద్యోగాలు ఇవ్వనున్నాయని ఆయన తెలిపారు. 2015తో పోలిస్తే టెక్‌ సంస్థలు రెట్టింపయ్యాయి. 2018లో ఉద్యోగ కల్పనలో 55 శాతం వృద్ధి నమోదు చేశాయి. పెరుగుతున్న అవసరాల రీత్యా ప్రస్తుతం చాలా సంస్థలు సొంత టెక్నాలజీ బృందాలను ఏర్పాటు చేసుకుంటున్నాయి. ఆహార సరఫరా, ఈ కామర్స్‌ వంటి సంస్థలు ముందున్నాయి. జొమాటోలో యాంట్‌ ఫైనాన్షియల్‌ 210 మిలియన్‌ డాలర్ల పెట్టుబడులు పెట...

కరీంనగర్‌ నుంచే ఎంపీగా కేసీఆర్‌ పోటీ?

Image
అసెంబ్లీ ఎన్నికలతో మొదలైన కోలాహలం మరో ఆరు నెలల పాటు కొనసాగనుంది. పంచాయతీ ఎన్నికలు 2019 జనవరిలో మొదలై ఫిబ్రవరి మొదటి వారానికి పూర్తి కానున్నాయి. ఆ వెంటనే వ్యవసాయ సహకార పరపతి సంఘాలు, మున్సిపాలిటీలు, ఎంపీటీసీ, జెడ్పీటీసీల ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల నిర్వహణకు కూడా అధికార యంత్రాంగం సన్నాహాలు చేస్తోంది. ఇదే సమయంలో రాజకీయ పార్టీలు సైతం పార్లమెంట్‌ ఎన్నికలు టార్గెట్‌గా పావులు కదుపుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఉమ్మడి కరీంనగర్‌లో అత్యధిక స్థానాలను సాధించుకున్న టీఆర్‌ఎస్‌ జోష్‌తో వెళ్తోంది. కాంగ్రెస్‌ కూటమి, బీజేపీ తదితర పార్టీలు సైతం పార్లమెంట్‌ బరిలో నిలిచేందుకు సన్నద్ధం అవుతుండగా, ఆయా పార్టీల నుంచి ఎవరెవరు పోటీలో ఉంటారనేది చర్చనీయాంశంగా మారింది. కాగా ఒక్కో ఎన్నికల్లో ఒక్కో రకంగా ఓటు వేసి తీర్పు చెప్పే కరీంనగర్, పెద్దపల్లి పార్లమెంట్‌ నియోజకవర్గాల ఓటర్లు.. ఈసారి ఎలా వ్యవహరి స్తారనే చర్చ కూడా జరుగుతోంది. అయితే ఈసా రి అన్ని పార్టీల నుంచి అభ్యర్థులు ఎవరు ఉంటారనేది చివరి నిమిషం వరకు చెప్పలేని పరిస్థితి రావచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతుండగా.. అన్ని పార్టీల లక్ష్యం పార్లమెంట్‌ ఎన్నికలే...

రాజనీతిగ్ణత అంటే ఇది 👇

Image
రాజనీతిగ్ణత అంటే ఇది 👇 భారత్ కు అత్యంత ప్యూహాత్మకమైన/వాణిజ్య కేంద్రమైన ఇరాన్ లొని చబహర్ పొర్టు ను ఒప్పందంలొ భాగంగా కొన్నిరొజులపాటు నిర్వహించేందుకు గాను  చబహార్ పొర్టును భారత్ స్వాధీనం చేసుకుంది ....  పాకిస్థాన్ లొ చైనా నిర్మించిన  గ్వాదర్ పొర్టుకు కౌంటర్ గా మోది ప్రభుత్వం ఇరాన్ లొ చబహార్ పొర్టు ను యుద్ధ ప్రాతిపదికన నిర్మించింది .... అంతేకాకుండా మొన్నటి వరకు Land locked  దేశాలయిన ఆఫ్ఘనిస్థాన్, మద్య అసియా, దక్షిన రష్యా లనుండి భారత్ కు సరుకులు ఏగుమతి/దిగుమతుల కొరకు చైనా, పాకిస్థాన్ లపై ఆధారపడవలసివచ్చేది ....  అయితే ఈ చబహార్ పొర్టు నిర్మాణంతొ భారత్ కు శాశ్వతంగా ఈ పీడ విరగడైంది.

మరొక చారిత్రాత్మక నిర్మాణం పూర్తి చేసిన మోది ప్రభుత్వం

Image
మరొక చారిత్రాత్మక నిర్మాణం పూర్తి చేసిన మోది ప్రభుత్వం ఇనాళ్ళూ భక్తులు, జమ్ముకాశ్మీర్ లొని ప్రసిధి చెందిన భైరొనినాధ్ దేవాలయాన్ని దర్శించుకొవడానికి తీవ్ర ఇబ్బందులు పడేవారు ... 6600 అడుగుల ఏత్తులొ హిమాలయాలపై ఉండే ఈ ఆలయానికి చేరుకొవడానికి చాలా కష్టపడాల్సి వచ్చేది ... ఇది గమనించిన మోది ప్రభుత్వం,  పర్వతం కిందనున్న భావన్ పట్టణం   నుండి నేరుగా ఈ ప్రాంతానికి రొప్ వే నిర్మాణం ప్రారంభించింది .... 1.5 కిలొమీటర్ల  ఈ రొప్ వే ప్రాజెక్టు శరవేగంగా పూర్తయి సొమవారం నాడు ప్రారంభొత్సవం చేశారు ....  ఈ రొప్ వే ద్వారా గంటకు 800 మంది చొప్పున, ఐదు నిమిషాలలొ భక్తులు భైరొనినాధ్ దేవాలయాన్ని చేరుకొవచ్చు

తీవ్రవాదులకు చుక్కలు చూపిస్తున్న భద్రతా దళాలు

Image
తీవ్రవాదులకు చుక్కలు చూపిస్తున్న భద్రతా దళాలు మోది ప్రభుత్వం వచ్చిన దగ్గరి నుండి తీవ్రవాదంపై ఉక్కుపాదం మొపుతున్న సంగతి తెలిసిందే... ఈ దెబ్బతొ #తీవ్రవాదుల సగటు #ఆయుర్ధాయం ఏకంగా #ఆరు_నెలలకు పడిపొయింది ... అంటే ఒక వ్యక్తి, తీవ్రవాదిగా మారిన తరువాత సగటున ఆరు నెలల కంటే ఏక్కువ బ్రతకలేడు ... ఈ లొపే భద్రతా దళాల చేతిలొ ఏన్ కౌంటర్ అవుతాడు ... కాగా ఈ సంవత్సరంలొ ఇంతవరకు కాశ్మీర్ లొ 258 మంది తీవ్రవాదులను ఏన్ కౌంటర్ చేయడం విశేషం .....

#నేతాజీ గౌరవార్ధం మరొక అద్భుత నిర్ణయం తీసుకున్న మోది

Image
#నేతాజీ గౌరవార్ధం మరొక అద్భుత నిర్ణయం తీసుకున్న మోది ఇప్పటికే "ఆజాద్ హింద్ ఫౌజ్" ప్రభుత్వాన్ని స్థాపించిన రొజు ఏర్రకొట పై త్రివర్ణ పతాకాన్ని ఏగురవేసి, #సుభాష్_చంద్రబొస్ కొరిక ను నేరవేర్చిన మోది గారు, ఇప్పుడు మరొక గొప్ప నిర్ణయం తీసుకున్నారు .... చంద్రబొస్ గారి గౌరవార్ధం అండమాన్ లొని మూడు దీవులకు నేతాజీ, నేతాజీ  సంబందిత పేర్లను పెట్టనున్నారు .... 'రొజ్ ఐస్ లాండ్' కు 'నేతాజీ సుభాష్ చంద్రబొస్ ఐస్ లాండ్' , నీల్ ఐస్ లాండ్ కు షాహిద్ ద్వీపం, 'హవేలాక్ ఐస్ లాండ్' కు 'స్వరాజ్ ద్వీపం' అని పేరు పెట్టనుండటం విశేషం .... అండమాన్ తొ సుభాష చంద్రబొస్ గారు #ప్రత్యేక_అనుబందాన్ని కలిగి ఉండటంతొ మోది గారు ఈ నిర్ణయం తీసుకున్నారు .... కాగా ఈ నెల 30 వ తారీకున జరిగే మోది గారి అండమాన్ పర్యటనలొ ఈ పేర్లను ప్రకటించనున్నారు

బొగిబీల్ వంతెన జాతికి అంకితం

Image
అస్సాంలోని బొగిబీల్ వంతెనను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మంగళవారం జాతికి అంకితం చేశారు. అరుణాచల్ ప్రదేశ్‌కు ప్రయాణ సమయం తగ్గుతుంది. ధిమజి - డిబ్రుగఢ్ మధ్య 4.94 కి.మీ. పొడవైన ఈ వంతెననను నిర్మించేందుకు 21 సంవత్సరాలు పట్టింది. ఇది భారతదేశపు అత్యంత పొడవైన రైలు-రోడ్డు వంతెన. అంతేకాకుండా ఆసియా ఖండంలో అత్యంత పొడవైన వంతెనల్లో ఇది రెండోది.   ఈ కార్యక్రమంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతోపాటు అస్సాం ముఖ్యమంత్రి సరా్వనంద్ సోనోవాల్ కూడా ఉన్నారు. అస్సాంలోని డిబ్రుగఢ్‌లో ఈ వంతెన ప్రారంభమవుతుంది. బ్రహ్మపుత్ర నది ఉత్తర, దక్షిణ దిశలను కలుపుతుంది.   డిసెంబరు 25న మాజీ ప్రధాన మంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయి జయంత్యుత్సవాలు జరుపుకుంటున్నట్లు బీజేపీ వర్గాలు తెలిపాయి. అంతేకాకుండా ప్రభుత్వం సుపరిపాలన దినంగా కూడా జరుపుతున్నట్లు పేర్కొన్నాయి.   ఈ వంతెనకు 1997లో అప్పటి ప్రధాన మంత్రి దేవెగౌడ శంకుస్థాపన చేశారు.

హనుమంతుడి పేరుతో ఓట్ల వేట.. పండితులు, సాధువుల ఆగ్రహం

Image
ఏ కులము నీదంటే.. గోకులము నవ్వింది ..అన్నట్టుగా, ఆంజనేయుడు తన కులంపై జరుగుతున్న రాజకీయ రగడను చూసి నవ్వుకుంటూ ఉండి ఉంటాడేమో బహుశా! నది మూలం, రుషి మూలం అడగకూడదంటారు పెద్దలు! కానీ, ఓట్ల వేటలో మన రాజకీయ నాయకులు.. ముఖ్యంగా బీజేపీ నేతలు ఆ వానరశ్రేష్టుడి కులం ఫలానాదంటూ కుంపటి రాజేశారు.   దీనికి ఆద్యుడు యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌. రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా నవంబరులో అక్కడి మల్‌పుర నియోజకవర్గంలో పర్యటించిన యోగి.. హనుమంతుడు దళిత గిరిజనుడని, ఆయనకులానికి చెందినవారంతా బీజేపీ అభ్యర్థికి ఓటేయాలని పిలుపునిచ్చారు. అంతకుముందు ఛత్తీస్‌గఢ్‌ ఎన్నికల ప్రచారంలోనూ ఆయన ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. హనుమంతుడు అందరికన్నా పెద్ద ఆదివాసీ, వనవాసి అంటూ ఓట్ల వేట కొనసాగించారు. ఆదిత్యనాథ్‌ వ్యాఖ్యలను సమర్థిస్తూ బీజేపీకే చెందిన మరో నేత.. ఎంపీ సావిత్రీబాయి పూలే మరింత వివాదాస్పదవ్యాఖ్యలు చేశారు.   హనుమంతుడు దళితుడు, మానవుడు అని.. కానీ ఆయనను మనువాదులకు బానిసగా మార్చారని.. రాముడి కోసం ఎంతో చేసినప్పటికీ కేవలం దళితుడైన కారణంగా హనుమకు తోక తగిలించి, ఆయన ముఖానికి మసి పూసి కోతిగా చేశారని ఆరోపించారు. ఇంత...

తాజా వార్తలు తొందర్లోనే కొత్త రూ.20 నోటు

Image
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా త్వరలోనే కొత్త రూ.20 నోటును విడుదల చేయనుంది. కొన్ని అదనపు ఫీచర్లతో ఈ నోటును మార్కెట్‌లోకి తీసుకురానున్నట్లు ఆర్బీఐ వెల్లడించింది. ఇప్పటికే ఆర్బీఐ రూ.10, 50, 100, 200, 500, 2000 నోట్లను విడుదల చేసిన విషయం తెలిసిందే. మహాత్మాగాంధీ సిరీస్‌లో 2016 నుంచి ఈ కొత్త నోట్ల విడుదలను కేంద్ర బ్యాంకు కొనసాగిస్తున్నది. ఈ కొత్త నోట్లన్నీ గతంలో ఉన్న వాటికి పూర్తి భిన్నమైన రంగులు, సైజులతో వచ్చాయి. ఇప్పుడు కొత్తగా రూ.20 నోటు కూడా రానుంది. పాత నోట్లన్నీ చెల్లుబాటు కానున్నాయి. 2016, మార్చి 31 నాటికి 492 కోట్ల రూ.20 నోట్లు మార్కెట్లో చెలామణి అవుతున్నాయి. 2018, మార్చి నాటికి వీటి సంఖ్య వెయ్యి కోట్లకు చేరింది. మొత్తం కరెన్సీలో రూ.20 నోట్ల వాటా 9.8 శాతంగా ఉంది.

మూడు అండమాన్ దీవుల పేర్లు మార్పు

Image
కేంద్ర ప్రభుత్వం తమ పేర్లు మార్పు ప్రక్రియను కొనసాగిస్తున్నది. తాజాగా అండమాన్ దీవుల్లో మూడింటి పేర్లను మార్చాలని నిర్ణయించింది. హావ్‌లాక్ దీవిని స్వరాజ్ ద్వీప్‌గా, నీల్ ఐలాండ్‌ను షహీద్ ద్వీప్‌గా, రాస్ ఐలాండ్‌ను నేతాజీ సుభాష్ చంద్రబోస్ దీవిగా పేర్లు మార్చారు. అండమాన్ దీవుల్లో నేతాజీ చారిత్రక పర్యటనకు 75 ఏళ్లు గడిచిన సందర్భంగా అక్కడికి వెళ్లనున్న ప్రధాని మోదీ.. ఈ పేర్లను అధికారికంగా ప్రకటించనున్నారు. ఈ పేర్లకు ఇప్పటికే హోంశాఖ ఆమోదం తెలిపింది. 1943, డిసెంబర్ 30న పోర్ట్ బ్లెయిర్‌లోని జింఖానా గ్రౌండ్‌లో నేతాజీ జాతీయ జెండాను ఆవిష్కరించారు. బ్రిటిష్ పాలన నుంచి విముక్తి పొందిన తొలి భారత భూభాగం ఈ అండమాన్ దీవులే అని నేతాజీ ఆ రోజు ప్రకటించారు. ఆ సమయంలో రెండో ప్రపంచ యుద్ధం సందర్భంగా జపనీయులు ఈ దీవులను ఆక్రమించుకున్నారు. అప్పుడు అండమాన్ దీవికి షహీద్ అని, నికోబార్ దీవికి స్వరాజ్ అని నేతాజీ పేర్లు మార్చారు. ఇప్పుడు పశ్చిమ బెంగాల్‌కు చెందిన నేతాజీ బంధువు, బీజేపీ ఉపాధ్యక్షుడు చంద్రకుమార్ బోస్ ఆ పేర్లను పునరుద్ధరించాలని కోరుతూ ప్రధాని మోదీకి లేఖ రాశారు. నెల రోజుల తర్వాత మోదీ సర్కార్ ఈ ప్రతిపాదనలకు ఆమోదం...

‘డబుల్’ ఇంటికి మార్గమేది..?

Image
స్పష్టమైన మార్గదర్శకాలు కరువు నిధుల విడుదలపై ప్రభావం పీఎంఏవై ఫండ్స్‌ విడుదలలో జాప్యం లక్ష ఇళ్లకు రూ.1,500 కోట్లు మొదటి విడతగా రూ.600 కోట్లు విడుదల రెండో దశ కేటాయింపులో తీవ్ర జాప్యం దరఖాస్తుదారుల వివరాలు ఇవ్వని జీహెచ్‌ఎంసీ రెవెన్యూ విభాగాల వద్ద లేని లెక్కలు నిర్మాణంపైనే దృష్టి... లబ్ధిదారుల ఎంపిక పట్టని వైనం రెండు పడకల ఇళ్లు.. ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన ప్రాజెక్టు. నిరుపేదలు ఆత్మగౌరవంతో జీవించేలా దేశంలో ఎక్కడా లేని విధంగా పక్కా గృహాల నిర్మాణానికి సర్కారు శ్రీకారం చుట్టింది. గ్రేటర్‌లో దాదాపు లక్ష గృహాల నిర్మాణం ప్రారంభించింది. మరో నాలుగైదు నెలల్లో 50 శాతం ఇళ్ల పనులు పూర్తవుతాయని అధికారులు చెబుతున్నారు. కానీ ఇప్పటి వరకు లబ్ధిదారుల ఎంపిక దిశగా అడుగు ముందుకు పడలేదు. కనీసం డిమాండ్‌ ఎంత ఉంది..? అన్న వివరాలూ అందుబాటులో లేవు. ఇది ఇప్పుడు కేంద్ర నిధుల రాక.. నిర్మాణ పనులపై ప్రభావం చూపుతోంది.   ‘డబుల్‌’ ఇళ్లకు కేంద్రం నిధులొచ్చేనా..? ఏఎంఏవై ఫండ్స్‌ విడుదలలో జాప్యం లబ్ధిదారుల ఎంపిక పట్టని వైనం   ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల ప్రాజెక్టును ప్రారం...

వాజ్‌పేయ్ స్మారకంగా రూ.100 కాయిన్

Image
మాజీ ప్రధాని, భారతరత్న అటల్ బిహారీ వాజ్‌పేయి స్మారకంగా భారత ప్రభుత్వం రూ.100 కాయిన్ విడుదల చేసింది. రేపు(డిసెంబరు 25) వాజ్‌పేయి 94వ జయంతిని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ కాయిన్‌ను ఢిల్లీలో విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ అగ్రనేత ఎల్‌‌కే అడ్వాణీ, లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్, కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తదితరులు పాల్గొన్నారు.అనారోగ్యంతో చాలాకాలం పాటు ఇంటికే పరిమితమైన వాజ్‌పేయ్ ఈ ఏడాది ఆగస్టులో కన్నుమూసిన సంగతి తెలిసిందే.

తెలుగు సీఎం లకు ఇంత అవసరమా !!!!

Image
తెలుగు సీఎం లకు ఇంత అవసరమా !!!! స్వంత రాష్టం లోని ఐదుకోట్ల మందిని ఉద్దరించింది లేదు.. యావత్ దేశం లోని 130 కోట్ల మంది అభివృద్ధి కోసం ఆరాటం పడుతున్నారు...  ఇది రాజకీయ అత్యాశనేనా !!!! తెలుగు సీఎం లది తెలివో ...అతి తెలివో తెలియదు !! కానీ చూడండి వీరిద్దరూ స్వంత రాష్ట్ర అభివృద్ధి కాదనీ...  కనీసం వీరు కలవకుండా , ఇతరులను ఎలా కలుస్తున్నారో గమనించండి వీరిద్దరినీ.... తెలుగు నట సార్వబౌములు ఈ ఇద్దరు సీఎంలు..... పట్టుమని పదేళ్లు కూడా రాష్ట్రంలో పాలన చేయలేదు.. కేవలం ఐదంటె ఐదేళ్లు మాత్రమే నూతన రాష్ట్ర సీఎం లు గా సేవలు అందించారు ... పెద్దగా జాతీయ రాజకీయ పార్టీలు కాదు వీరిద్దరివి... ఐదు దశాబ్దాలుగా పాలించినోడే తన స్వంత రాష్ట్రంకోసం పాటు పడే ఆలోచన చేస్తున్నారు... మరి వీరు  ఇద్దరు మాత్రం ఐదేళ్ల కే రాష్ట్రం వదిలి ఆకాశంలో తిరుగుతున్నారు.... స్వంత రాష్ట్రాన్ని కనీసం 20 ఏళ్ళైనా పాలించి రాష్ట్రాలను దేశంలో నెంబర్ వన్ చేయండి ,అప్పుడు మీరు తిరగనవసరం లేదు ,అన్ని రాజకీయ పార్టీల నేతలు మీ వద్దకు వచ్చి మీ అవసరం కావాలని అడుగుతారు.. అలా కాకుండా మీరు తిరుగుతూ డబ్బా కొట్టడం అంత అవసరం లేధని పిస్తుంది.. మన రాష...

అది సంపన్నుల కూటమి

Image
ఉనికి కోసమే జట్టుకట్టారు వ్యక్తి ఆకాంక్షలు, అధికారం కోసమే ప్రజల ఆశయాల కోసం కాదు నాడు కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఎన్టీఆర్‌ తెలుగుదేశం పార్టీ పెట్టారు ఇప్పుడా పార్టీ ‘హస్తం’ చేతుల్లో! వీటికి సైద్ధాంతిక సారూప్యం లేదు ప్రధాని మోదీ తీవ్ర విమర్శలు విపక్షాల ప్రతిపాదిత మహాకూటమి అపవిత్ర కూటమి అని ప్రధాని మోదీ విమర్శించారు. రాజకీయ ఉనికి కోసం కొన్ని సంపన్న రాజకీయ కుటుంబాలు జట్టుకట్టాయని ధ్వజమెత్తారు. ఈ పార్టీలకు సైద్ధాంతిక సారూప్యత లేదని.. వ్యక్తిగతంగా ఉనికి నిలబెట్టుకోవడానికి చేతులు కలుపుతున్నాయని దుయ్యబట్టారు. ఆదివారం తమిళనాడులోని చెన్నై సెంట్రల్‌, చెన్నై నార్త్‌, మదురై, తిరుచిరాపల్లి, తిరువళ్లూరు నియోజకవర్గాల బీజేపీ కార్యకర్తలతో ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడారు. ‘ఆనాడు సొంత పార్టీకి చెందిన ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి (టి.అంజయ్య)ని కాంగ్రెస్‌ అవమానించింది. ఫలితంగా తెలుగువారి ఆత్మగౌరవం కోసం స్వర్గీయ ఎన్టీఆర్‌.. టీడీపీని స్థాపించారు. అలాంటి పార్టీ ఇప్పుడు కాంగ్రెస్ తో చేతులు కలపాలనుకుంటోంది. ఆ రాష్ట్ర ప్రజలు దీన్నెలా అంగీకరిస్తారు’ అని ప్రశ్నించారు.   మహాకూటమిలోని కొన్ని పార్టీలు సామాజిక...

జాతీయం పంబలో మహిళల అడ్డగింత

Image
కొండపైకి వెళ్లనివ్వని అయ్యప్ప భక్తులు శబరిమలలో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు వెనుదిరిగిన 11 మంది మహిళలు సన్నిధానానికి వెళ్లి తీరతామని ప్రకటన పంబ,  శబరిమలలో మళ్లీ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆదివారం తమిళనాడుకు చెందిన మణితి సంస్థ నుంచి 11 మంది మహిళలు అయ్యప్ప దర్శనం చేసుకుంటామంటూ పంబకు చేరుకోవడంతో హైడ్రామా నెలకొంది. వీరంతా 50 ఏళ్ల లోపు వారే కావడం గమనార్హం. వీరిలో ఆరుగురు ఇరుముడి కట్టుకొని వచ్చారు. కేరళ సీఎం విజయన్‌కు ముందే సమాచారం ఇవ్వడంతో వారిని పోలీసులు పంబ వరకు తీసుకురాగలిగారు. తెల్లవారు జామున 3.30 గంటలకు పంబ చేరుకున్నప్పటికీ వందలాది మంది భక్తులు కొండపైకి వెళ్లే దారిని దిగ్బంధించారు. మహిళల బృందం అతి కష్టం మీద 100 మీటర్లు వెళ్లగలిగింది.   భక్తులు, ఆందోళనకారులు వెంటపడడంతో మహిళలు పారిపోయి సమీపంలోని గార్డ్‌రూమ్‌లకు చేరుకున్నారు. తాము ఎట్టి పరిస్థితుల్లోనూ అయ్యప్ప దర్శనానికి వెళ్తామంటూ దాదాపు 6 గంటల పాటు రోడ్డుపైనే బైఠాయించారు. అయినా ఫలితం లేకపోవడంతో వెనుదిరిగారు. బృందానికి నేతృత్వం వహించిన సెల్వి మాట్లాడుతూ.. శబరిమల సన్నిధానానికి చేరుకోవాలన్న తమ మిషన్‌ను మాత్రం విరమించబోమ...

శబరిమలలో మళ్లీ ఉద్రిక్తత.. పంబ చేరుకున్న 11 మంది మహిళా భక్తులు

Image
శబరిమలలో మళ్లీ ఉద్రిక్తత చోటుచేసుకుంది. శబరిమల అయ్యప్ప స్వామిని దర్శనం చేసుకునేందుకు ఆరుగులు మహిళా భక్తుల బృందం ఆదివారం తెల్లవారుజామునే పంబ బేస్ క్యాప్‌కు చేరుకుంది. మదురై రోడ్డు మార్గం గుండా ప్రయాణించి వీరు పంబకు చేరుకున్నారు. తెల్లవారు జామున 3.30 గంటల ప్రాంతంలో వీరు అక్కడకు చేరుకోగా, మరో ఐదు మంది మహిళలు వారితో కలిశారు. మొత్తం 30 మంది మహిళలు బేస్ క్యాంప్ వద్ద జమ కావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.   కాగా, మహిళా భక్తులంతా 10 నుంచి 50 ఏళ్ల లోపు వారే కావడంతో వారిని అడ్డుకునేందుకు ఆందోళనకారులు మళ్లీ రంగప్రవేశం చేశారు. దీంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఆందోళనకారులకూ, పోలీసులకు మధ్య వాగ్యుద్ధం చోటుచేసుకుంది. మహిళలను కొండ ఎక్కనీయకుండా అడ్డుకుంటామని ఆందోళనకారులు చెబుతున్నారు. అయితే, అయ్యప్ప దర్శనం చేసుకోకుండా తాము వెళ్లేది లేదని మహిళా భక్తులు పోలీసులకు తెగేసి చెబుతున్నారు.   పదొకండు మంది మహిళలు ఉదయమే బేస్ క్యాంప్ చేరుకోగా, వారిలో ఆరుగురు మాత్రమే కొండపైకి వెళ్తామని చెబుతున్నారని, తక్కిన వారు వారికి రక్షణగా ఉంటామని తెలిపారని, సీనియర్ అధికారుల నుంచి ఆదేశాల కోసం చూస్తున్నామని పంబ బేస్ క్యాంప్...

తగ్గేదే లేదు : Tit for Tat

Image
తగ్గేదే లేదు : Tit for Tat శత్రువు ఒక అడుగు ముందుకేస్తే, మనం రెండడుగులు ముందుకేయాలనేది యుద్ద నీతి .... చైనా టిబెట్ లొని తమ ఏయిర్ బేస్ లలొ కొత్త ఏక్విమెంట్లను   సమకూర్చుకుంటుండటం , టిబెట్ లొ తరచుగా మిలటరీ ఏక్సరసైజులు నిర్వహిస్తుండటంతొ ---- వెంటనే మోది ప్రభుత్వం ఆరు ఆకాశ్ మిసైల్ సిస్టంస్ ను ఈస్ట్రన్ సెక్టార్ కు పంపించారు .... ఇప్పటికే ఈ మిసైల్ వ్యవస్థలు LAC కు చేరినట్టు తెలుస్తుంది ... దీనితొపాటుగా   ఆమెరికా నుండి రానున్న అత్యంత శక్తివంతమైన #చినూక్_అపాచీ హెలీకాప్టర్లను టిబెట్ సరిహద్దు రాస్ట్రాలయిన అరుణాచలప్రదేశ్, సిక్కిం రాస్ట్రాలలొ మొహరించనున్నారు ... అంతేకాకుండా 2019 మొదటి త్రైమాసికంలొ ఇండియా చేరనున్న మొదటి బ్యాచ్ రాఫెల్ ఫైటర్లను కూడా దగ్గరలొ మొహరించనుండటం చైనాకు దిమ్మతిరిగే మరొక విషయం. మొథియొర్ మిసైల్స్ తొ సహా  రాఫెల్ ఫైటర్లను చైనా సరిహద్దులకు దగ్గరగా మొహరించనుండటం చైనాకు సంబందించి అతి పెద్ద విషయం, చైనాను ఉక్కిరిబిక్కిరి చేసే విషయం. ఇండియా_చైనా సరిహద్దుల వద్ద చైనా ఇష్టారాజ్యం పెట్రేగిపొయినప్పటికీ, ఇమతకు ముందటి ప్రభుత్వాలు కిమ్మనకుండా కూర్చున్నాయి ఇవన్నీ చూస్తుంటే రాఫెల్ ...

Keshaboinasridhar: సామాన్యుడికి కేంద్ర ప్రభుత్వం నూతన సంవత్సర కానుక

Keshaboinasridhar: సామాన్యుడికి కేంద్ర ప్రభుత్వం నూతన సంవత్సర కానుక : వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) భారాన్ని కేంద్ర ప్రభుత్వం బాగా తగ్గించింది. ఇకపై విలాస వస్తువులు మాత్రమే 28 శాతం పన్ను పరిథిలో ఉంటాయి. శనివారం ...

Keshaboinasridhar: హైదరాబాద్‌లో మరో కొత్త సాంకేతికత వ్యవస్థ

Keshaboinasridhar: హైదరాబాద్‌లో మరో కొత్త సాంకేతికత వ్యవస్థ : త్వరలో డ్రోన్‌ కెమెరాలు ట్రాఫిక్‌ క్రమబద్ధీకరణ... నేరాల అదుపు అక్రమ కట్టడాలకు ఇక చెక్‌ నగరంలో పెరుగుతున్న నేరాలు, ట్రాఫిక్‌ సమస్యలకు చెక్‌ ప...

హైదరాబాద్‌లో మరో కొత్త సాంకేతికత వ్యవస్థ

Image
త్వరలో డ్రోన్‌ కెమెరాలు ట్రాఫిక్‌ క్రమబద్ధీకరణ... నేరాల అదుపు అక్రమ కట్టడాలకు ఇక చెక్‌ నగరంలో పెరుగుతున్న నేరాలు, ట్రాఫిక్‌ సమస్యలకు చెక్‌ పెట్టడానికి మరో కొత్త సాంకేతికత వ్యవస్థ వస్తోంది. పోలీస్‌ శాఖ మాత్రమే కాకుండా జీహెచ్‌ఎంసీ, ఇతర ప్రభుత్వ విభాగాలు సైతం ఈ టెక్నాలజీ ద్వారా లబ్ధి పొందనున్నాయి. ప్రస్తుతం ప్రయోగాత్మకం, పరిశీలన దశలో ఉన్న డ్రోన్‌ కెమెరాలు త్వరలోనే నగరంలో చక్కర్లు కొట్టనున్నాయి. ప్రధానంగా శాంతిభద్రతలను కాపాడటం, పోకిరీలకు బుద్ధి చెప్పడంతో పాటు ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తకుండా పోలీసులు డ్రోన్‌ కెమెరాల సాయంతో ఆకాశం ద్వారా నిఘా పెట్టనున్నారు. ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుని ప్రజా సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపనున్నారు. డ్రోన్‌ కెమెరాల ద్వారా ప్రమాదాల స్పాట్‌లను గుర్తించడం, జరిగిన ప్రమాదం లేదా నేరాన్ని పరిశీలించడం, అక్రమ నిర్మాణాలు... కబ్జాలు అన్నింటికీ అడ్డుకట్ట వేయడానికి డ్రోన్‌కెమెరాలు త్వరలోనే పని ప్రారంభించనున్నాయి.   ప్రయోగాత్మకంగా గతంలో గ్రేహౌండ్స్‌ ద్వారా కూంబింగ్‌ ఆపరేషన్‌లో వినియోగించిన డ్రోన్‌ కెమెరాలతో పోలీసులు కొంతవరకు ఫలితాలు సాధించారు. ఎన్నికలకు ముందు టీఆర్‌ఎస్‌ బహ...

సామాన్యుడికి కేంద్ర ప్రభుత్వం నూతన సంవత్సర కానుక

Image
వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) భారాన్ని కేంద్ర ప్రభుత్వం బాగా తగ్గించింది. ఇకపై విలాస వస్తువులు మాత్రమే 28 శాతం పన్ను పరిథిలో ఉంటాయి. శనివారం జరిగిన 31వ జీఎస్‌టీ కౌన్సిల్ సమావేశం అనంతరం కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ మీడియాతో మాట్లాడుతూ 28 శాతం జీఎస్‌టీ పరిథిలో 34 వస్తువులు మాత్రమే ఉంటాయని తెలిపారు. ఇవన్నీ విలాస సంబంధిత వస్తువులన్నారు.   మానిటర్లు, టెలివిజన్ స్క్రీన్స్, టైర్లు, లిథియం-అయాన్ బ్యాటరీలతో కూడిన పవర్ బ్యాంకులపై పన్ను తగ్గుతుంది. వీటిని 28 శాతం నుంచి 18 శాతం పన్ను పరిథిలోకి తీసుకొచ్చినట్లు జైట్లీ తెలిపారు. దివ్యాంగుల ప్రయాణానికి ఉపయోగించే వాహనాలకు ఉపయోగించే విడి భాగాలపై పన్నును 5 శాతానికి తగ్గించినట్లు తెలిపారు.   సినిమా టిక్కెట్ల ధరను బట్టి పన్ను తగ్గించారు. టికెట్ ధర రూ.100 వరకు ఉంటే 12 శాతం జీఎస్‌టీ విధిస్తారని, టికెట్ ధర రూ.100కుపైగా ఉంటే పన్ను 18 శాతం విధిస్తారని జైట్లీ తెలిపారు. ఈ పన్ను ఇప్పటి వరకు 28 శాతం ఉండేదన్నారు.   రియల్ ఎస్టేట్‌పై జీఎస్‌టీ గురించి వచ్చే జీఎస్‌టీ కౌన్సిల్ సమావేశంలో చర్చిస్తామని ఉత్తరాఖండ్ ఆర్థిక మంత్రి ప్రకాశ్ పంత్ చెప్పారు.  ...

రూటు మార్చిన మోదీ... ఈసారి మరో కొత్త ఆలోచన...

Image
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రానున్న లోక్‌సభ ఎన్నికల్లో అనుసరించవలసిన వ్యూహాలకు పదును పెడుతున్నారు. బీజేపీ ఎంపీలతో మరింత సన్నిహితంగా సంభాషించేందుకు ‘భోజనం చేస్తూ చర్చ’ నిర్వహించాలని నిర్ణయించారు. గురువారం రాత్రి నుంచి ప్రారంభమైన ఈ చర్చలు వచ్చే నెల 3 వరకు జరుగుతాయి.   ప్రజలకు అనుకూలమైన ఎజెండాను రూపొందించాలని చాలా మంది ఎంపీలు మోదీని కోరినట్లు బీజేపీ వర్గాలు తెలిపాయి. ఎంపీల మాటలను మోదీ శ్రద్ధగా విన్నారని తెలిపాయి. కాంగ్రెస్ విసిరే సవాలును ఎదుర్కొనేందుకు పార్టీ సర్వసన్నద్ధంగా ఉండాలని చెప్పినట్లు పేర్కొన్నాయి.

*పాటశాల బియ్యంలో పురుగులు!!* *గత కొంత కాలంగాఅలాగే పురుగుల బియ్యం!!*

Image
*పాటశాల బియ్యంలో పురుగులు!!* *గత కొంత కాలంగాఅలాగే పురుగుల బియ్యం!!* *విద్యార్థులకు  పురుగుల అన్నం నీళ్ల ఛారే దిక్కు!!* *ఆవేదన వ్యక్తం చేస్తున్నా విద్యార్థులు!!* రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గ పరిధిలోని ఫరూక్ నగర్ మండలంలోని మధుల పూర్,గ్రామములోని ప్రభుత్వ పాటశాలల్లో గత వారం రోజులుగా ముక్కిపోయిన పురుగుల బియ్యం ఉండడంతో ఆ పురుగుల బియ్యంతో విద్యార్థులకు భోజనానికి ఉపయోగించడంతో విద్యార్థులు ఆ బియ్యంతో వండిన భోజనాన్ని తినలేక ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఓ వైపు తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు సన్నబియ్యంతో నాణ్యమైన భోజనాన్ని పెడుతూన్నామని చెబుతుంటే  ఇక్కడ విద్యార్థులకు మాత్రం పురుగుల అన్నం నీళ్ల చారే దిక్కు అయిందని చాలా కాలంగా ఇలా జరుగుతున్న అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు విద్యార్థులు.

కేసీఆర్ అమలు చేయబోతోన్న కొత్త ప్లాన్ ఇదేనా?

Image
కాకలుతీరిన రాజకీయ యోధుల వ్యూహాలకు కూడా అందని ఎత్తుగడలు సీఎం కేసీఆర్‌వి అని అందరూ అంటుంటారు. మరి అలాంటి నేత తాజాగా ఎలాంటి వ్యూహాలు అమలుచేస్తున్నారు? జాతీయ రాజకీయాల్లో కీలకపాత్ర పోషించాలనుకుంటున్న కేసీఆర్ తరవాతి అడుగు ఎటువైపు వేయబోతున్నారు? కరీంనగర్ కేంద్రంగా కేసీఆర్ అమలు చేయబోతోన్న కొత్త ప్లాన్ ఏంటి? పార్లమెంట్ ఎన్నికలు కేంద్రంగా టీఆర్ఎస్ అధినేత ఏం చేయబోతున్నారు? వివరాలు ఈ కథనంలో తెలుసుకోండి.       అసెంబ్లీ ఎన్నికల తర్వాత జాతీయ రాజకీయాల్లో కీలకపాత్ర పోషిస్తానన్న కేసీఆర్ అందుకు గ్రౌండ్‌వర్క్ సిద్ధం చేసుకుంటున్నారట. అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించని విధంగా విజయం సాధించిన కేసీఆర్ ఇకపై కొత్త ప్రణాళికను అమలుచేయబోతున్నారు. వచ్చే రోజుల్లో జాతీయ రాజకీయాల్లో కీలకపాత్ర పోషించాలనుకుంటున్నారట. అందులో భాగంగానే సిరిసిల్ల ఎమ్మెల్యే, తన తనయుడు కేటీఆర్‌కు టీఆర్ఎస్ పగ్గాలు అప్పగించారట. సరే, ఆ విషయం అందరికీ తెలుసు. కానీ చాలామందికి తెలియని విషయం మరొకటుంది. దాని గురించే ఇప్పుడు కరీంనగర్ వాసులు చర్చించుకుంటున్నారు.       కేసీఆర్‌కు ఉమ్మడి కరీంనగర్ జిల్లా అంటే ఓ పెద్ద సెంటిమెంట్! ఏ పని ...

*రీజినల్ రింగ్ రోడ్డుకు కేంద్రం అంగీకారం*

Image
*రీజినల్ రింగ్ రోడ్డుకు కేంద్రం అంగీకారం* తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ చుట్టూ నాలుగు వరుసల రీజినల్ రింగ్ రోడ్డును నిర్మించేందుకు కేంద్రం సూత్రప్రాయంగా అంగీకరించింది. రీజినల్ రింగ్ రోడ్డుకు సంబంధించి భూసేకరణ ప్రారంభించుకోవాలని రాష్ర్టానికి కేంద్రం సూచించింది. దీంతో సూత్రప్రాయ అనుమతులు సాధించడంలో టీఆర్ఎస్ ఎంపీలు విజయం సాధించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో ఈ నెల 18న కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీని టీఆర్ఎస్ ఎంపీలు కలిసి రీజినల్ రింగ్ రోడ్డు ఏర్పాటుకు అనుమతివ్వాలని కోరారు.  ఈ నెల 21న ఎన్ హెచ్ ఏ ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహిస్తామని గడ్కరీ నాడు టీఆర్ఎస్ ఎంపీలకు హామీనిచ్చారు. ఆ హామీ మేరకు కేంద్రమంత్రి ఆదేశాలతో టీఆర్ఎస్ ఎంపీలతో ఎన్ హెచ్ ఏ ఉన్నతాధికారులు ఇవాళ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రింగ్ రోడ్డు ఆవశ్యకత, డీపీఆర్ ను ఉన్నతాధికారులకు ఎంపీలు వివరించారు. రాజధాని హైదరాబాద్ చుట్టూ 362 కిలోమీటర్ల పొడవునా రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణం కానుంది.  రీజినల్‌ రింగ్‌ రోడ్డు: సంగారెడ్డి నుంచి నర్సాపూర్‌-తూప్రాన్‌- గజ్వేల్‌-జగ్దేవ్‌పూర్‌-భువనగిరి-చౌటుప్పల్‌-ఇబ్రహీంపట్నం-...

హైదరాబాద్‌లో ఉద్యోగావకాశాలు..గ్రామీణ నిరుద్యోగ యువతీ, యువకులకు శుభవార్త

Image
 గ్రామీణ నిరుద్యోగ యువతీ, యువకులకు ఎస్‌పీఐ సినిమాస్‌, హైదరాబాద్‌లో ఉద్యోగావకాశాలు ఉన్నాయని డీఆర్‌డీవో వెంకటేశ్వర్‌రావు ఒక ప్రకటనలో తెలిపారు. వేతనం 8,100, బోనస్‌ ఉంటుందని, ఉచిత భోజన, వసతి, పీఎఫ్‌, ఈస్‌ఐ, ఇన్స్యూ రెన్స్‌ ఉంటాయని పేర్కొన్నారు. ఎస్‌ఎస్‌సీ పాస్‌ లేదా ఫెయిలైన అభ్యర్థులకు అవకాశాలు కలవని పేర్కొన్నారు. వయస్సు 18 నుంచి 30 సంవత్సరాల్లోపు ఉండాలని తెలిపారు. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు విద్యార్హతల సర్టిఫికెట్లతో ఈ నెల 22న ఉదయం 10 గంటలకు స్వశక్తి కళాశాలలోని ఈజీఎంఎం కార్యాలయంలో జరిగే ఇంటర్వ్యూలకు హాజరు కావాలని కోరారు.

సోహ్రబుద్దీన్ బతికుంటే మోదీని చంపేసేవాడు: మాజీ డీజీ వంజారా

Image
సోహ్రబుద్దీన్ షేక్‌ కనుక బతికి ఉంటే అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోదీని చంపేసి ఉండేవాడని గుజరాత్ మాజీ డీజీపీ డీజీ వంజారా సంచలన వ్యాఖ్యలు చేశారు. 2005 నాటి సోహ్రబుద్దీన్ ఎన్‌కౌంటర్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న 22 మంది నిందితులను నిర్దోషులుగా పేర్కొంటూ ప్రత్యేక సీబీఐ న్యాయస్థానం శుక్రవారం సంచలన తీర్పు ఇచ్చింది. తీర్పు అనంతరం వంజారా మాట్లాడుతూ.. తాను తన బృందం సత్యం వైపు నిలబడ్డామన్న విషయం నేడు రుజువైందన్నారు.   ‘‘అప్పటి గుజరాత్ ఏటీఎస్ పోలీసులు కనుక సోహ్రబుద్దీన్‌ను చంపకపోయి ఉంటే, అప్పటి (2005) గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోదీని సోహ్రబుద్దీన్ చంపేసి ఉండేవాడు’’ అని వంజారా పేర్కొన్నారు. రాజకీయ కారణాలతో తాను తొమ్మిదేళ్లు జైలులో గడపాల్సి వచ్చిందని అయితే, సత్యం ఏంటనేది నేడు బయటకు వచ్చిందన్నారు.   వంజారాను ఈ కేసును విముక్తి కల్పిస్తూ ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును ఈ ఏడాది సెప్టెంబరులో బాంబే హైకోర్టు సమర్థించింది. ఈ కేసులో గుజరాత్‌కు చెందిన సీనియర్ పోలీసు అధికారులు అభయ్ చుడాస్మా, పీసీ పాండే, రాజస్థాన్ మాజీ హోంమంత్రి గులాబ్ చంద్ కటారియా, గుజరాత్ మాజీ హోంమంత్రి , ప్రస్తుత బీజేపీ చీఫ్ అమ...

మీరు ఎక్కువగా స్పందిస్తున్నారు.. మీ పని మీరు చూసుకుంటే బెటర్: ఇమ్రాన్‌కు భారత్ సూచన

Image
కశ్మీర్‌లో జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనపై తానెంతగానో చింతిస్తున్నానంటూ పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చేసిన వ్యాఖ్యలపై భారత్ తీవ్రంగా స్పందించింది. అతిగా స్పందించడం మాని మీ పని మీరు చేసుకుంటే బెటర్ అని భారత విదేశాంగ శాఖ ప్రతినిధి రవీష్ కుమార్ సూచించారు. భారత్‌ గురించి కాకుండా వారి దేశంలోని అంతర్గత పరిస్థితుల గురించి పట్టించుకుంటే బాగుంటుందనేది తన భావన అని అన్నారు. పాకిస్థాన్‌లో ఉగ్రవాదాన్ని నివారించగలిగితే ఇక్కడ దాడులనేవే జరగవని అన్నారు. ‘‘అసలు ఉగ్రదాడులు జరగడానికి కారణమే పాకిస్థాన్. ఆ విషయాన్ని తొలుత వారు తెలుసుకుంటే మంచిది’’ అని ఘాటుగా బదులిచ్చారు.   ఈ నెల 15న పుల్వామాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతయ్యారు. మరో ఏడుగురు పౌరులు మృతి చెందారు. ఈ ఘటనపై ఇమ్రాన్ స్పందిస్తూ.. కశ్మీర్‌లో జరుగుతున్న దాడులు తనను కలచి వేస్తున్నాయన్నారు. వారి భవిష్యత్తును వారే నిర్ణయించుకోవాలని, భారత్‌లో జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనపై ఐక్యరాజ్య సమితి దృష్టికి తీసుకెళ్లాలని భావిస్తున్నట్టు చెప్పారు. ఇమ్రాన్ వ్యాఖ్యలపై స్పందించిన రవీష్ కుమార్ ఘాటుగా బదులిచ్చారు.

కేంద్ర సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి దేశంలోని ప్రతీ కంప్యూటర్‌పై నిఘా పెట్టాలని నిర్ణయించింది

Image
కేంద్ర సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి దేశంలోని ప్రతీ కంప్యూటర్‌పై నిఘా పెట్టాలని నిర్ణయించింది. వ్యక్తిగత సమాచారాన్ని కూడా పరిశీలించే అధికారాన్ని దర్యాప్తు సంస్థలకు ఇచ్చింది. ఇందుకు సంబంధించి దేశంలోని 10 దర్యాప్తు సంస్థలకు కేంద్ర హోంశాఖ అనుమతులిచ్చింది. దర్యాప్తు సంస్థలకు సహకరించనివారికి ఏడేళ్ల జైలు శిక్ష విధించే అవకాశం ఉంది. కేంద్ర హోంశాఖ అనుమతులిచ్చిన వాటిల్లో ఐబీ, సీబీఐ, ఈడీ, రా, ఎన్ఐఏ, డీఆర్ఐ, ఐబీ, నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో, డైరెక్టోరేట్ ఆఫ్ సిగ్నల్ ఇంటలిజెన్స్, రెవెన్యూ ఇంటలిజెన్స్, దర్యాప్తు సంస్థలు ఉన్నాయి. ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 69(1),2000 కింద కేంద్ర హోంశాఖ ఈ ఉత్తర్వులు జారీ చేసింది. దేశ సమగ్రత, భద్రత, రక్షణ వంటి అంశాలను దృష్టిలో ఉంచుకుని కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.

ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఈ నెల 23 నుంచి ఆంధ్రప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, దేశ రాజధాని న్యూ ఢిల్లీలో పర్యటించనున్నారు.

Image
ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఈ నెల 23 నుంచి ఆంధ్రప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, దేశ రాజధాని న్యూ ఢిల్లీలో పర్యటించనున్నారు.  # టీఆర్ఎస్ పార్టీ కోసం నెల రోజుల పాటు ఎంగేజ్ చేసుకున్న ప్రత్యేక విమానంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబ సభ్యులతో పాటు ఈ నెల 23న ఉదయం 10గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి విశాఖపట్నం బయలుదేరుతారు.  # విశాఖలో శారదా పీఠాన్ని సందర్శిస్తారు. పీఠంలోని రాజశ్యామల దేవాలయంలో ప్రత్యేక పూజలు జరుపుతారు. స్వామి స్వరూపానందేంద్ర స్వామీజీ ఆశీస్సులు తీసుకుంటారు.  # ఆశ్రమంలోనే మధ్యాహ్న భోజనం చేస్తారు. ఆ తర్వాత విశాఖ విమానాశ్రయం నుండి ఒడిశా రాజధాని భువనేశ్వర్ బయలుదేరుతారు.  # సాయంత్రం 6గంటలకు ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తో ఆయన నివాసంలోనే సమావేశం అవుతారు.  # ఆ రోజు సీఎం అధికార నివాసంలోనే బస చేస్తారు. 24న ఉదయం రోడ్డు మార్గం ద్వారా కోణార్క్ దేవాలయం సందర్శిస్తారు.  # అనంతరం జగన్నాథ దేవాలయాన్ని సందర్శిస్తారు. పూజల అనంతరం భువనేశ్వర్ చేరుకుని మధ్యాహ్న భోజనం చేస్తారు.  # అక్కడ నుండి ప్రత్యేక విమానంలో కోల్ కతా వెళ్తారు. సాయంత్రం 4గంటలకు పశ్చిమ బెంగాల్ ముఖ్...

కాంగ్రెస్‌కు ఎమ్మెల్సీల షాక్‌!

Image
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం చవిచూసిన కాంగ్రెస్‌ పార్టీకి మరో షాక్‌ తగిలింది! ఆ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్సీలు.. కాంగ్రెస్‌ శాసనమండలి పక్షాన్ని తెరాసలో విలీనం చేయాలని కోరేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు మండలి ఛైర్మన్‌ స్వామిగౌడ్‌ను కాంగ్రెస్‌ ఎమ్మెల్సీలు దామోదర్‌రెడ్డి, ప్రభాకర్‌, ఆకుల లలిత, సంతోష్‌ కుమార్‌ కలవనున్నారు. విలీనం చేయాలని కోరుతూ లేఖ అందజేయనున్నట్లు సమాచారం. నిజామాబాద్‌, కరీంనగర్‌ జిల్లాలకు చెందిన కాంగ్రెస్‌ పార్టీ శాసనమండలి సభ్యులు ఆకుల లలిత, టి.సంతోష్‌కుమార్‌ గురువారం ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ను వేర్వేరుగా కలిసిన సంగతి తెలిసిందే. ఎన్నికల్లో తెరాస విజయం సాధించినందుకు అభినందనలు తెలిపారు. దీంతో వీరు తెరాసలో చేరుతారన్న ప్రచారం ఊపందుకుంది.  ఇప్పటికే ప్రభాకర్‌రావు, దామోదర్‌రెడ్డి తెరాసలో చేరారు. ఆ పార్టీ అనుబంధ సభ్యులుగా కొనసాగుతున్నారు. ప్రతిపక్ష హోదా గల్లంతేనా? మండలి పక్షాన్ని తెరాసలో విలీనం చేస్తే శాసనమండలిలో కాంగ్రెస్‌ సభ్యుల బలం కేవలం రెండుకు చేరే అవకాశం ఉంది. షబ్బీర్‌ అలీ, పొంగులేటి సుధాకర్‌రెడ్డి మాత్రమే కాంగ్రెస్‌ ఎమ్మెల్సీలుగా ఉంటారు. వారి...

పట్టువిడువని మమత.. బీజేపీకి మళ్లీ టెన్షన్!

Image
పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ నిర్వహించ తలపెట్టిన ‘రథయాత్ర’ను అడ్డుకునేందుకు సీఎం మమతా బెనర్జీ పట్టువిడువని పోరాటం కొనసాగిస్తున్నారు. బీజేపీ ‘రథయాత్ర’కు అనుమతి నిరాకరిస్తూ పశ్చిమబెంగాల్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని నిన్న కోల్‌కతా హైకోర్టు కొట్టివేసిన సంగతి తెలిసిందే. బీజేపీకి అనుకూలంగా ఏకసభ్య ధర్మాసనం వెలువరించిన ఈ తీర్పుపై పశ్చిమబెంగాల్ ప్రభుత్వం చీఫ్ జస్టిస్ డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించింది. ఈ పిటిషన్‌ ఇవాళ చీఫ్ జస్టిస్ డివిజన్ బెంచ్ ముందుకు రానుంది.   కాగా నిన్న కోల్‌కతా హైకోర్టు వెలువరించిన తీర్పు మేరకు బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఈ నెల 28 నుంచి 31 వరకు ‘రథయాత్ర’ నిర్వహించేందుకు సన్నాహాలు మొదలుపెట్టింది. ‘ప్రజాస్వామ్య పరిరక్షణ యాత్ర’ పేరుతో 3 దశలుగా రాష్ట్రంలోని మొత్తం 42 లోక్‌సభ నియోజకవర్గాల్లో ‘రథయాత్ర’ నిర్వహించాలని కమలనాథులు సన్నాహాలు చేస్తున్నారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కైలాశ్ విజయవర్గియా మాట్లాడుతూ.. ‘‘కోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం. ఈ నెల 28, 29, 31 తేదీల్లో రథయాత్ర నిర్వహించాలని పార్టీ సమావేశంలో తీర్మానించాం. ఇంకా ఈ తేదీలపై తుదినిర్ణయం తీసుకోలేదు. త్వరలోనే వీటిని రాష్ట...