మోదీ బయోపిక్‌లో రామ్ చరణ్ విలన్
బాలీవుడ్‌లో ప్రస్తుతం బయోపిక్ సీజన్ నడుస్తుంది. క్రీడా, రాజకీయానికి సంబంధించిన పలువురు ప్రముఖుల జీవిత నేపథ్యంలో బయోపిక్స్ తెరకెక్కుతుండగా ప్రస్తుతం భారత ప్రధాని నరేంద్రమోదీ బయోపిక్‌ని తెరకెక్కించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఒమంగ్ కుమార్ దర్శకత్వంలో ఈ ప్రాజెక్ట్ తెరకెక్కనుండగా, దీనికి సంబంధించిన వర్క్ గత ఏడాదిన్నర నుండి జరుగుతుందట. స్క్రిప్ట్, స్టోరీ, స్క్రీన్‌ప్లే తదితర అంశాలపై ఒమంగ్ కుమార్ టీం భారీ వర్క్ చేస్తున్నట్టు తెలుస్తుంది. అధికారుల నుండి అనుమతి రాగానే చిత్రాన్ని సెట్స్‌పైకి తీసుకెళ్ళాలనే ఆలోచనలో టీం ఉంది. అయితే బయోపిక్‌లో ప్రధాని మోదీ పాత్ర కోసం బాలీవుడ్ నటుడు వివేక్ ఒబేరాయ్‌ని పరిశీలిస్తున్నట్టు సమాచారం. నార్త్‌తో పాటు సౌత్‌లోను క్రేజ్ పెంచుకున్న వివేక్ ఒబేరాయ్ అయితే చిత్రానికి దేశమంతటా ఆదరణ లభిస్తుందని చిత్ర బృందం భావిస్తుందట. వివేక్ ఓబేరాయ్ రీసెంట్‌గా తెలుగులో తెరకెక్కిన వినయ విధేయ రామ చిత్రంలో ప్రతినాయకుడిగా కనిపించిన సంగతి తెలిసిందే.
Comments
Post a Comment