*రీజినల్ రింగ్ రోడ్డుకు కేంద్రం అంగీకారం*

*రీజినల్ రింగ్ రోడ్డుకు కేంద్రం అంగీకారం*

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ చుట్టూ నాలుగు వరుసల రీజినల్ రింగ్ రోడ్డును నిర్మించేందుకు కేంద్రం సూత్రప్రాయంగా అంగీకరించింది. రీజినల్ రింగ్ రోడ్డుకు సంబంధించి భూసేకరణ ప్రారంభించుకోవాలని రాష్ర్టానికి కేంద్రం సూచించింది. దీంతో సూత్రప్రాయ అనుమతులు సాధించడంలో టీఆర్ఎస్ ఎంపీలు విజయం సాధించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో ఈ నెల 18న కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీని టీఆర్ఎస్ ఎంపీలు కలిసి రీజినల్ రింగ్ రోడ్డు ఏర్పాటుకు అనుమతివ్వాలని కోరారు. 

ఈ నెల 21న ఎన్ హెచ్ ఏ ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహిస్తామని గడ్కరీ నాడు టీఆర్ఎస్ ఎంపీలకు హామీనిచ్చారు. ఆ హామీ మేరకు కేంద్రమంత్రి ఆదేశాలతో టీఆర్ఎస్ ఎంపీలతో ఎన్ హెచ్ ఏ ఉన్నతాధికారులు ఇవాళ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రింగ్ రోడ్డు ఆవశ్యకత, డీపీఆర్ ను ఉన్నతాధికారులకు ఎంపీలు వివరించారు. రాజధాని హైదరాబాద్ చుట్టూ 362 కిలోమీటర్ల పొడవునా రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణం కానుంది. 

రీజినల్‌ రింగ్‌ రోడ్డు: సంగారెడ్డి నుంచి నర్సాపూర్‌-తూప్రాన్‌- గజ్వేల్‌-జగ్దేవ్‌పూర్‌-భువనగిరి-చౌటుప్పల్‌-ఇబ్రహీంపట్నం-చేవెళ్ల-శంకరపల్లి మీదుగా కంది.


Comments

Popular posts from this blog

అర్ధరాత్రి రోడ్లపై తిరిగితే అరెస్ట్‌! టోలీచౌకీ పోలీసుల కఠిన చర్యలు

🔐 కొత్త ఆధార్ కార్డు డిజైన్: ఫోటో & QR కోడ్ మాత్రమే – మీ గోప్యతకు కొత్త రక్షణ!

🗳️🔥 లోక్‌సభలో ఘాటు డిబేట్: రాహుల్ విసిరిన 3 ఆరోపణలకు అమిత్ షా ఇచ్చిన ఝలక్!