హైదరాబాద్‌లో ఉద్యోగావకాశాలు..గ్రామీణ నిరుద్యోగ యువతీ, యువకులకు శుభవార్త
గ్రామీణ నిరుద్యోగ యువతీ, యువకులకు ఎస్‌పీఐ సినిమాస్, హైదరాబాద్‌లో ఉద్యోగావకాశాలు ఉన్నాయని డీఆర్‌డీవో వెంకటేశ్వర్‌రావు ఒక ప్రకటనలో తెలిపారు. వేతనం 8,100, బోనస్ ఉంటుందని, ఉచిత భోజన, వసతి, పీఎఫ్, ఈస్‌ఐ, ఇన్స్యూ రెన్స్ ఉంటాయని పేర్కొన్నారు. ఎస్‌ఎస్‌సీ పాస్ లేదా ఫెయిలైన అభ్యర్థులకు అవకాశాలు కలవని పేర్కొన్నారు. వయస్సు 18 నుంచి 30 సంవత్సరాల్లోపు ఉండాలని తెలిపారు. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు విద్యార్హతల సర్టిఫికెట్లతో ఈ నెల 22న ఉదయం 10 గంటలకు స్వశక్తి కళాశాలలోని ఈజీఎంఎం కార్యాలయంలో జరిగే ఇంటర్వ్యూలకు హాజరు కావాలని కోరారు.
Comments
Post a Comment