#మోడీ పాలనలో ప్రజలకు #మజా లేదు....!!

#మోడీ పాలనలో ప్రజలకు #మజా లేదు....!!
***************************
#మన్మోహన్ గద్దెనెక్కే నాటికి 32/- ఉన్న పెట్రోల్ రేటు దిగిపోయే నాటికి 75/- కు చేరింది., మధ్యలో ఒకసారి 83.60/- కూడా టచ్ అయింది..

ఈ #మోడీగారి పాలనేంటి....?? 
గద్దెనెక్కే నాటికి 75/- ఉన్న పెట్రోలును 69/- కి తీసుకొచ్చారు., మధ్యలో  ఒకసారి 62/- కడా టచ్ అయింది..
కింద #గూటం పెట్టించుకోవడానికి గత 70 ఏళ్ళుగా అలవాటు పడిన ఈదేశ ప్రజలకు మోడీ పాలన #మజా_కిక్ ఇవ్వడం లేదు..

అంతేకాదు ఎప్పుడూ ఏదో ఒక #కుంభకోణానికి సంబంధించిన వార్తలు వినడానికి, చదవడానికి చెవులూ కళ్ళూ అలవాటు పడిపోయాయి.. వాటికీ మజా లేదు..

#సరిహద్దుల్లో.. "కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లఘించిన పాకిస్థాన్, ముగ్గురు భారత సైనికులు మ్రృతి.." వంటి వార్తలు అసలే వినిపించడం లేదు..

మనిషి ఇంట్లోనుంచి బయటికెళ్ళి సాయంకాలం హాయిగా తిరిగొచ్చేస్తున్నాడు.. ఇంతకుముందు ఎక్కడ #బాంబు పేలుతుందో, శరీరాలు తునాతునకలై ఎక్కడ పడిపోతాయో అనే ఆలోచనతో ఒళ్ళు దగ్గరపెట్టుకుని బ్రతికేవాడు.. బస్సులో/ట్రైనులో కూర్చునేముందు సీటు కింద ప్రక్కన పదిసార్లు చెక్ చేసుకునేవారు..

నిత్యం బస్టాండుల్లో రైల్వే స్టేషన్లలో అనుమానితులకు సంబంధించి ఒకటే ప్రకటనలు.. ఇప్పుడవేవీ లేకుండా మజా లేకుండా పోయింది....
అందుకే మోడీ పాలన చప్పగా ఉన్నది..

#పప్పుదినుశులను ముట్టుకోవాలంటేనే భయమేసేది..
కందిపప్పు/మినప్పప్పు/శనగపప్పు.. అలా ఏ పప్పు ముట్టుకున్నా ముక్కుపిండి 180-200/- వసూలు చేసేవారు.. ఇప్పుడవన్నీ 60-70/- లకే దొరుకుతున్నాయి..

#సెల్‌ఫోన్ రీఛార్జి చేయాలంటే భయమేసేది..
మరీ డేటా రీఛార్జి అంటే గుండె గుభేలే..
28 రోజులకు అన్‌లిమిటెడ్ కాల్స్ కోసం1000-1200/- చెల్లించేవారం..
ఒక GB డేటా కోసం 350/- చెల్లించేవారం..
ఇప్పుడు 398/- లకే మూడు నెలలు అన్నీ అన్‌లిమిటెడ్..

#మెయిల్‌లో వచ్చిన ఒక చిన్న డాక్యుమెంట్ డౌన్‌లోడ్ చేసుకోవడానికి నెట్ సెంటర్ కెళ్ళి 30 నిమిషాలు కుస్తీ పట్టేవాళ్ళం.. ఇప్పుడు 3 సెకెన్లలో పని అయిపోతున్నది..

#కరెంటు బిల్లు కట్టడానికి ఎంచెక్కా ఇంట్లోనుంచెళ్ళి సాయంకాలం వచ్చేవాళ్ళం.. ఇప్పుడు మొబైల్‌లో 3 సెకన్లలో అయిపోతుంది..

#డబ్బులు ఎవరికైనా పంపాలంటే #DDలు తీసి కొరియర్లు చేసేవాళ్ళం.. అందుకు హాయిగా ఒకరోజు ఆడుతూ పాడుతూ కేటాయించేవారం.. ఇప్పడు అదీ బ్యాంకింగ్ మొబైల్ యాప్‌ల ద్వారా 5 సెకన్లలోపే కానించేస్తున్నాం..

మనం పుట్టి పెరిగిన #మనపల్లెకు పోయిరావాలంటే ఎముకలకు నరాలకూ మంచి ఎక్సర్‌సైజు ఉండేది.. మనిషిలోతు గతుకులతో పడుతూ లేస్తూ పోయివచ్చేవారం.. మన ఎముకలు/నరాల బలం ఎంతో తెలిసేది.. ఇప్పుడు అక్కడకూ డబుల్ లేన్న రోడ్లు వేసేయడంతో పోయివచ్చినట్లే తెలియడం లేదు..

ఇంతకుముందు #కరెంటు పోతే ఎప్పుడు వస్తుందో తెలియదు.. ఎంచక్కా నిద్రమానుకుని కుటుంబసభ్యులతో కబుర్లు చెప్పుకుంటూ విసనకర్రలతో విసురుకుంటూ రాత్రంతా గడిపేవారం.. ఓ నాలుగు గంటలు కూడా నిరంతరాయంగా విద్యుత్ ఉండేది కాదు.. అటువంటిది ఈ మోడీ పాలనలో వేసవిలో సైతం 24 గంటలూ నిరంతరాయంగా దేశం అంతటా విద్యుత్ సరఫరా జరుగుతున్నది.. అంతేకాకుండా ఇప్పుడు #భారత్ మిగులు విద్యుత్ కలిగిన దేశంగా అవతరించి #నేపాల్, #మయన్మార్, #బాంగ్లాదేశ్‌లకు విద్యుత్ ఎగుమతి చేస్తున్నది..

ఇంటి నుండి బయటికొస్తే #పెంటకుప్పల నుండి వచ్చే దుర్వాసనకు ముక్కులు అలవాటుపడిపోయాయి.. ఇప్పుడేమో #స్వచ్ఛభారత్ పేరుతో అంతా శుభ్రంగా పరిసరాలు తయారయ్యాయి..

ఏ ఏడాదికో రెండేళ్ళకో వినేవారం "#ఇస్రో ప్రయోగం సక్సెస్.." అని అది చదువుకుని ఎంతో ఆనందించేవారం.. 
ఇప్పుడేమో నెలకు రెండుసార్లు వింటున్నాం, అది పిల్లవాడు గాలిపటం ఎగరేసినంత శులువైపోయింది..

#అమెరికా అధ్యక్షుడు పాకిస్థాన్‌లో పర్యటిస్తుంటే ఆదేశానికి ఎంత సహాయం చేసేశాడోనని బిక్కుబిక్కుమంటూ పేపరు చదివేవాళ్ళం.. ఇప్పుడేమో పాకిస్థాన్‌కు తను సహాయం కాదుకదా ఇతరులు చేసే సహాయాన్నీ నిలిపేసేటట్టు అమెరికాను ఈ మోడీజీ ఒప్పించాడట..

అందుకే మోడీజీ పాలన #చప్పగా_ఉన్నది_మజా_లేదు


Comments

Popular posts from this blog

అర్ధరాత్రి రోడ్లపై తిరిగితే అరెస్ట్‌! టోలీచౌకీ పోలీసుల కఠిన చర్యలు

🔐 కొత్త ఆధార్ కార్డు డిజైన్: ఫోటో & QR కోడ్ మాత్రమే – మీ గోప్యతకు కొత్త రక్షణ!

🗳️🔥 లోక్‌సభలో ఘాటు డిబేట్: రాహుల్ విసిరిన 3 ఆరోపణలకు అమిత్ షా ఇచ్చిన ఝలక్!