సకాలంలో రుణాలు చెల్లించే రైతులకు వడ్డీ రద్దు!

పంట రుణాలను సకాలంలో తిరిగి చెల్లించే రైతులకు ప్రోత్సాహకం ఇచ్చేందుకు నరేంద్ర మోదీ ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఈ నిర్ణయం తీసుకుంటే ప్రభుత్వ ఖజానాపై రూ.15 వేల కోట్లు భారం పడుతుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఆహార పంటలపై బీమా ప్రీమియంను పూర్తిగా రద్దు చేయాలన్న ప్రతిపాదన కూడా పరిశీలనలో ఉన్నట్లు తెలిపాయి. ఉద్యాన వన పంటలపై ప్రీమియంను కూడా తగ్గించే ప్రయత్నం జరుగుతున్నట్లు తెలిపాయి.
 
రైతులకు ప్రయోజనకరమైన పథకాల రూపకల్పన కోసం కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధా మోహన్ సింగ్ ఇతర సీనియర్ మంత్రులతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.


Comments

Popular posts from this blog

అర్ధరాత్రి రోడ్లపై తిరిగితే అరెస్ట్‌! టోలీచౌకీ పోలీసుల కఠిన చర్యలు

🔐 కొత్త ఆధార్ కార్డు డిజైన్: ఫోటో & QR కోడ్ మాత్రమే – మీ గోప్యతకు కొత్త రక్షణ!

🗳️🔥 లోక్‌సభలో ఘాటు డిబేట్: రాహుల్ విసిరిన 3 ఆరోపణలకు అమిత్ షా ఇచ్చిన ఝలక్!