మోదీ కొత్త ఆలోచన... నేరుగా ప్రజల బ్యాంకు ఖాతాల్లోకి సొమ్ము...!!

లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం ఓ కొత్త పథకానికి రూపకల్పన చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆదాయం సంపాదించుకునే సామర్థ్యం లేనివారి బ్యాంకు ఖాతాలకు నిర్దిష్ట మొత్తంలో సొమ్మును జమ చేయాలని ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. దీనిని సార్వజనీన మౌలిక ఆదాయ పథకంగా పిలిచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
 
పెద్ద నోట్ల రద్దు, జీఎస్‌టీ వంటి నిర్ణయాలపై ప్రజలు స్పందిస్తున్న తీరుతో బీజేపీ ఏదో విధంగా మళ్ళీ ప్రజలను తమవైపు తిప్పుకోవాలని ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. రైతుల కోసం రుణమాఫీ వంటి పథకం గురించి ఆలోచిస్తున్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. మోదీ, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, వ్యవసాయ శాఖ మంత్రి ఇటీవలే చర్చలు జరిపినట్లు సమాచారం.


Comments

Popular posts from this blog

అర్ధరాత్రి రోడ్లపై తిరిగితే అరెస్ట్‌! టోలీచౌకీ పోలీసుల కఠిన చర్యలు

🔐 కొత్త ఆధార్ కార్డు డిజైన్: ఫోటో & QR కోడ్ మాత్రమే – మీ గోప్యతకు కొత్త రక్షణ!

🗳️🔥 లోక్‌సభలో ఘాటు డిబేట్: రాహుల్ విసిరిన 3 ఆరోపణలకు అమిత్ షా ఇచ్చిన ఝలక్!