తెలుగు సీఎం లకు ఇంత అవసరమా !!!!
తెలుగు సీఎం లకు ఇంత అవసరమా !!!!
స్వంత రాష్టం లోని ఐదుకోట్ల మందిని ఉద్దరించింది లేదు..
యావత్ దేశం లోని 130 కోట్ల మంది అభివృద్ధి కోసం ఆరాటం పడుతున్నారు...
ఇది రాజకీయ అత్యాశనేనా !!!!
తెలుగు సీఎం లది తెలివో ...అతి తెలివో తెలియదు !!
కానీ చూడండి వీరిద్దరూ స్వంత రాష్ట్ర అభివృద్ధి కాదనీ...
కనీసం వీరు కలవకుండా , ఇతరులను ఎలా కలుస్తున్నారో గమనించండి వీరిద్దరినీ....
తెలుగు నట సార్వబౌములు ఈ ఇద్దరు సీఎంలు.....
పట్టుమని పదేళ్లు కూడా రాష్ట్రంలో పాలన చేయలేదు..
కేవలం ఐదంటె ఐదేళ్లు మాత్రమే నూతన రాష్ట్ర సీఎం లు గా సేవలు అందించారు ...
పెద్దగా జాతీయ రాజకీయ పార్టీలు కాదు వీరిద్దరివి...
ఐదు దశాబ్దాలుగా పాలించినోడే తన స్వంత రాష్ట్రంకోసం పాటు పడే ఆలోచన చేస్తున్నారు...
మరి వీరు ఇద్దరు మాత్రం ఐదేళ్ల కే రాష్ట్రం వదిలి ఆకాశంలో తిరుగుతున్నారు....
స్వంత రాష్ట్రాన్ని కనీసం 20 ఏళ్ళైనా పాలించి రాష్ట్రాలను దేశంలో నెంబర్ వన్ చేయండి ,అప్పుడు మీరు తిరగనవసరం లేదు ,అన్ని రాజకీయ పార్టీల నేతలు మీ వద్దకు వచ్చి మీ అవసరం కావాలని అడుగుతారు..
అలా కాకుండా మీరు తిరుగుతూ డబ్బా కొట్టడం అంత అవసరం లేధని పిస్తుంది.. మన రాష్ట్ర అభివృద్ధి ఫస్ట్....
యావత్ దేశంలో నా అంతటోటు లేడంటె...నా అంతటోడు లేడంటూ.. దేశంలోని రాజకీయ పార్టీలను ఏకం ఛేయడానికి ఈ ఇద్దరు తెలుగు సీఎం లు గంగిరెద్దుల్లా స్వంత రాష్ట్రాలను వదిలి తిరుగుతున్నారు....
ఈ ఇద్దరికి నా చిన్న సూచన !!!
వీల్లు ఇద్దరు తెలుగు రాష్ర్టాల కు చెందిన వారు..
ఇద్దరు నూతనంగా ఏర్పడిన రాష్రాలకం సీఎం లు..
ఈ ఇద్దరు తెలంగాణ ప్రజలను విడగొట్టి రెండు రాష్ట్రాలైతే అద్బుతంగా అభివృద్ధి చేస్తామని సవాల్ చేశారు...
పట్టు మని పదేళ్లు కూడా నూతన రాష్రాల అభివృద్ధి పైన ద్రుష్టి పెట్టకుండా వారికి వారే మా తెలుగు రాష్రాలు దేశంలో నెంబర్ వన్ అంటూ ..మా ప్రజలకు మా సేవలు ఎక్కువ అయిపోయాయంటూ ..గంగిరెద్దుల్లా దేశంలోని రాజకీయ నేతలను ఒకరి తరువాత మరొకరు ఇద్దరు నాతోకలవాలి ..నాతోకలవాలి అంటూ రాజకీయ పబ్బం గడుపే ప్రయత్నం చేస్తున్నారు....
ఇది సరైంది కాదని.. పక్క పక్కనే ఉన్న రాష్ట్రాల సీఎం లు,
ఎంతో స్నేహితులు , తెలుగు బాషకు చెందిన వీరిద్దరిలోనే ఐక్యం లేదు ,,,వీరు ఇతరులకు ఆధర్శం అంటే ఎవడు నమ్మడు...
రెండు రాష్ట్రాలలో ఎన్నౌ సమస్యలు ,ఆకలి చావులు ,కూటికి ,గూడుకు ,గుడ్డకు నోచుకోక లక్షలాది మంది అమాయక ప్రజలు అల్లాడుతుంటే ,పండించిన పంటకు గిట్టుబాటు ధరలు లేక ఆత్మహత్య లకు ,ఆందోళన చెందుతున్న రైతులకు రాష్ట్రంలో వుండి వీరి బాధలు తీర్చి రాష్ట్రాలను అభివృద్ధి చేస్తామని భరోసా ఇవ్వవలసిన వీరు స్వరాష్ట్రాలను వదిలి దేశంలోఏదో ఆశలతో తిరగటం మంచిదని....
Comments
Post a Comment