బొగిబీల్ వంతెన జాతికి అంకితం
అస్సాంలోని బొగిబీల్ వంతెనను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మంగళవారం జాతికి అంకితం చేశారు. అరుణాచల్ ప్రదేశ్‌కు ప్రయాణ సమయం తగ్గుతుంది. ధిమజి - డిబ్రుగఢ్ మధ్య 4.94 కి.మీ. పొడవైన ఈ వంతెననను నిర్మించేందుకు 21 సంవత్సరాలు పట్టింది. ఇది భారతదేశపు అత్యంత పొడవైన రైలు-రోడ్డు వంతెన. అంతేకాకుండా ఆసియా ఖండంలో అత్యంత పొడవైన వంతెనల్లో ఇది రెండోది.
ఈ కార్యక్రమంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతోపాటు అస్సాం ముఖ్యమంత్రి సరా్వనంద్ సోనోవాల్ కూడా ఉన్నారు. అస్సాంలోని డిబ్రుగఢ్‌లో ఈ వంతెన ప్రారంభమవుతుంది. బ్రహ్మపుత్ర నది ఉత్తర, దక్షిణ దిశలను కలుపుతుంది.
డిసెంబరు 25న మాజీ ప్రధాన మంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయి జయంత్యుత్సవాలు జరుపుకుంటున్నట్లు బీజేపీ వర్గాలు తెలిపాయి. అంతేకాకుండా ప్రభుత్వం సుపరిపాలన దినంగా కూడా జరుపుతున్నట్లు పేర్కొన్నాయి.
ఈ వంతెనకు 1997లో అప్పటి ప్రధాన మంత్రి దేవెగౌడ శంకుస్థాపన చేశారు.
Comments
Post a Comment