లాలీపాప్‌ల‌తో జాగ్రత్త.. ప్రధాని మోదీ హెచ్చరిక..



 పేరిట రైతులను మోసం చేస్తున్నారంటూ కాంగ్రెస్ పార్టీపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ విరుచుకుపడ్డారు. అలాంటి ‘‘లాలీపాప్‌ల’’ విషయంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఇవాళ ఉత్తర ప్రదేశ్‌లోని ఘాజీపూర్‌లో జరిగిన ఓ ర్యాలీలో ఆయన పాల్గొని ప్రసంగించారు. తాను ‘‘కాపలాదారుడినే’’ అని పునరుద్ఘాటించిన ఆయన.. ‘‘దొంగలను’’ వదిలిపెట్టబోనని, వారిని ఎక్కడికి పంపాలో అక్కడికే పంపిస్తానని వ్యాఖ్యానించారు. పేదలు, రైతుల అభ్యున్నతి కోసం తన ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుంటే.. ప్రతిపక్షాలు రుణమాఫీ వంటి ‘‘లాలీపాప్’’లతో తక్షణ రాజకీయ లబ్ది కోసం పాకులాడుతున్నాయన్నారు. ‘‘ఎలాంటి హామీలు ఇస్తున్నారో చూశారా? తక్షణ రాజకీయ ప్రయోజనాల కోసమే ఇలాంటి హామీలు, నిర్ణయాలు తీసుకుంటున్నారు. కానీ సమస్యలకు ఇది శాశ్వత పరిష్కారం కాదు..’’ అని ప్రధాని పేర్కొన్నారు. మధ్య ప్రదేశ్, రాజస్థాన్‌‌ రాష్ట్రాల్లో ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వాలు రైతు రుణమాఫీలు ప్రకటించిన నేపధ్యంలోనే ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
 
‘‘2009 లోక్‌సభ ఎన్నికలకు ముందు కూడా.. కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ లాలీపాప్‌లాంటి రుణమాఫీ ప్రకటన చేసింది. మరి మీ రుణాలు మాఫీ అయ్యాయా? మీ ఖాతాలో డబ్బులు పడ్డాయా? అలాంటి వాళ్లని, వాళ్లు ఇచ్చే లాలీపాప్‌లని మీరు నమ్ముతారా? ప్రజలను మోసం చేస్తున్నది అలాంటి వాళ్లుకాదా?...’’ అని మోదీ ప్రశ్నించారు. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం కనీసం స్వామినాథన్ సిఫారసులను కూడా అమలు చేయలేదన్నారు. ‘‘రైతుల కష్టాలు తీర్చేందుకు ఉద్దేశించిన స్వామినాధన్ కమిషన్ నివేదిక 11 ఏళ్ల క్రితమే అందింది. దాన్ని అమలుచేసి ఉంటే ఇవాళ రుణమాఫీల అవసరమే ఉండేది కాదు. కాబట్టి అలాంటి వాళ్లు చేసే రుణమాఫీ హామీలతో జాగ్రత్తగా ఉండండి..’’ అని ప్రధాని మోదీ హెచ్చరించారు. రైతులు సహా సమాజంలోని అన్ని వర్గాల సాధికారతే లక్ష్యంగా తమ ప్రభుత్వం పలు కార్యక్రమాలను చేపట్టిందని ఆయన అన్నారు.

Comments

Popular posts from this blog

అర్ధరాత్రి రోడ్లపై తిరిగితే అరెస్ట్‌! టోలీచౌకీ పోలీసుల కఠిన చర్యలు

🔐 కొత్త ఆధార్ కార్డు డిజైన్: ఫోటో & QR కోడ్ మాత్రమే – మీ గోప్యతకు కొత్త రక్షణ!

🗳️🔥 లోక్‌సభలో ఘాటు డిబేట్: రాహుల్ విసిరిన 3 ఆరోపణలకు అమిత్ షా ఇచ్చిన ఝలక్!