సొంత నియోజకవర్గానికి మళ్లీ మోదీ...

ప్రధాని నరేంద్ర మోదీ శనివారంనాడు వారణాసి, ఘజీపూర్‌లో పర్యటించనున్నారు. తన సొంత నియోజకవర్గమైన వారణాసిలో గత రెండు నెలల్లో మోదీ పర్యటించనుండటం ఇది రెండోసారి. ప్రధాని తన పర్యటనలో భాగంగా వారణాసిలోని నేషనల్ సీడ్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ సెంటర్‌లో ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (ఐఆర్ఆర్ఐ) అండ్ ఆసియా రీజినల్ సెంటర్ (ఐఎస్ఏఆర్‌సీ)ను ప్రారంభిస్తారు. అనంతరం, దీన్‌దయాళ్ హస్తకళా సంకుల్‌లో ఏర్పాటు చేస్తున్న 'వన్ డిస్ట్రిక్ట్, వన్ ప్రొడక్ట్' ప్రాంతీయ సదస్సులో మోదీ పాల్గొంటారు. అనంతరం ఘజీపూర్‌లో జరిగే కార్యక్రమంలో మహారాజా సుహల్‌దేవ్ స్మారక పోస్టల్ స్టాంప్ విడుదల చేస్తారు.
 
కాగా, యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వంలో సీనియర్ మంత్రి, ఎస్‌బీఎస్‌పీ ఆధ్యక్షుడు ప్రకాష్ రాజ్‌భర్ మాత్రం ప్రధాని కార్యక్రమంలో పాల్గొనేది లేదని గతవారం ప్రకటించారు. ఘజిపూర్ జిల్లా జహూరాబాద్‌ అసెంబ్లీ నియోజకవర్గానికి ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వెనుకబడిన తరగతి నేత అయిన మహారాజా సుహల్‌ దేవ్ రాజ్‌భర్ పూర్తి పేరు పోస్టల్ స్టాంప్‌‌లో లేదంటూ ప్రకాష్ రాజ్ భర్  ఇప్పటికే తన అసంతృప్తిని వ్యక్తం చేశారు.


Comments

Popular posts from this blog

అర్ధరాత్రి రోడ్లపై తిరిగితే అరెస్ట్‌! టోలీచౌకీ పోలీసుల కఠిన చర్యలు

🔐 కొత్త ఆధార్ కార్డు డిజైన్: ఫోటో & QR కోడ్ మాత్రమే – మీ గోప్యతకు కొత్త రక్షణ!

🗳️🔥 లోక్‌సభలో ఘాటు డిబేట్: రాహుల్ విసిరిన 3 ఆరోపణలకు అమిత్ షా ఇచ్చిన ఝలక్!