మీరు ఎక్కువగా స్పందిస్తున్నారు.. మీ పని మీరు చూసుకుంటే బెటర్: ఇమ్రాన్‌కు భారత్ సూచన
కశ్మీర్‌లో జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనపై తానెంతగానో చింతిస్తున్నానంటూ పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చేసిన వ్యాఖ్యలపై భారత్ తీవ్రంగా స్పందించింది. అతిగా స్పందించడం మాని మీ పని మీరు చేసుకుంటే బెటర్ అని భారత విదేశాంగ శాఖ ప్రతినిధి రవీష్ కుమార్ సూచించారు. భారత్ గురించి కాకుండా వారి దేశంలోని అంతర్గత పరిస్థితుల గురించి పట్టించుకుంటే బాగుంటుందనేది తన భావన అని అన్నారు. పాకిస్థాన్‌లో ఉగ్రవాదాన్ని నివారించగలిగితే ఇక్కడ దాడులనేవే జరగవని అన్నారు. ‘‘అసలు ఉగ్రదాడులు జరగడానికి కారణమే పాకిస్థాన్. ఆ విషయాన్ని తొలుత వారు తెలుసుకుంటే మంచిది’’ అని ఘాటుగా బదులిచ్చారు.
ఈ నెల 15న పుల్వామాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతయ్యారు. మరో ఏడుగురు పౌరులు మృతి చెందారు. ఈ ఘటనపై ఇమ్రాన్ స్పందిస్తూ.. కశ్మీర్‌లో జరుగుతున్న దాడులు తనను కలచి వేస్తున్నాయన్నారు. వారి భవిష్యత్తును వారే నిర్ణయించుకోవాలని, భారత్‌లో జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనపై ఐక్యరాజ్య సమితి దృష్టికి తీసుకెళ్లాలని భావిస్తున్నట్టు చెప్పారు. ఇమ్రాన్ వ్యాఖ్యలపై స్పందించిన రవీష్ కుమార్ ఘాటుగా బదులిచ్చారు.
Comments
Post a Comment