రాజ్యసభ ఎంపీలకు విప్ జారీ చేసిన బీజేపీ
రాజ్యసభ ఎంపీలకు భారతీయ జనతా పార్టీ ఆదివారంనాడు విప్ జారీ చేసింది. సోమవారంనాడు జరిగే రాజ్యసభ సమావేశానికి ఎంపీలంతా తప్పనిసరిగా హాజరుకావాలని ఆ విప్‌లో కోరింది. ట్రిపుల్ తలాక్ బిల్లును సోమవారంనాడు పెద్దల సభలో కేంద్రం ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ఈ విప్ జారీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది.
ట్రిపుల్ తలాక్ బిల్లు గత గురువారంనాడు విపక్షాల వాకౌట్ మధ్య లోక్‌సభ ఆమోదం పొందింది. బిల్లుకు అనుకూలంగా 245 ఓట్లు రాగా, వ్యతిరేకంగా 11 ఓట్లు వచ్చాయి. దీంతో రాజ్యసభలోనూ బిల్లు ప్రవేశపెడుతున్నట్టు న్యాయశాఖ మంత్రి రవిశంర్ ప్రసాద్ ప్రకటించారు. అందుకు అనుగుణంగానే ఈనెల 31న రాజ్యసభ ఎజెండాలో ఈ అంశాన్ని చేర్చారు.
Comments
Post a Comment