మహిళలను శబరిమల తీసుకెళ్ళడంపై దేవాదాయ మంత్రి సంచలన వ్యాఖ్యలు
తిరువనంతపురం : శబరిమల అయ్యప్ప దేవాలయంలోకి మహిళలను తీసుకెళ్ళడంపై కేరళ ప్రభుత్వానికి ప్రత్యేక ఆసక్తి లేదని దేవాదాయ శాఖ మంత్రి కే సురేంద్రన్ చెప్పారు. గురువారం జరిగిన దేవస్థానం బోర్డు సమావేశం అనంతరం సురేంద్రన్ మీడియాతో మాట్లాడుతూ సన్నిధానంలో గూండాలు సృష్టించే సమస్యలకు తాము భయపడేది లేదన్నారు. ప్రభుత్వం తలచుకుంటే ఈపాటికి చాలా మంది మహిళలు అయ్యప్ప దేవాలయాన్ని సందర్శించి ఉండేవారన్నారు. అయ్యప్ప దేవాలయంలోకి మహిళలను తీసుకెళ్ళాలన్న ఆసక్తి తమకు లేదన్నారు.
అన్ని వయసుల మహిళలు అయ్యప్ప దేవాలయంలో ప్రవేశించవచ్చునని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో దాదాపు 20 మంది మహిళలు అయ్యప్పను దర్శించుకునేందుకు ప్రయత్నించారు. కానీ పెద్ద ఎత్తున నిరసన ఎదురవడంతో వారంతా వెనుదిరిగారు.
శబరిమల అయ్యప్ప దేవాలయంలోకి ప్రవేశించేందుకు వచ్చే మహిళలకు తాము భద్రత కల్పించలేమని ఈ ఆలయం వద్ద నియమితులైన పోలీసులు రాష్ట్ర డీజీపీ లోక్‌నాథ్ బెహరాకు బుధవారం తెలిపిన సంగతి తెలిసిందే.
Comments
Post a Comment