కేంద్ర సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి దేశంలోని ప్రతీ కంప్యూటర్‌పై నిఘా పెట్టాలని నిర్ణయించింది

కేంద్ర సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి దేశంలోని ప్రతీ కంప్యూటర్‌పై నిఘా పెట్టాలని నిర్ణయించింది. వ్యక్తిగత సమాచారాన్ని కూడా పరిశీలించే అధికారాన్ని దర్యాప్తు సంస్థలకు ఇచ్చింది. ఇందుకు సంబంధించి దేశంలోని 10 దర్యాప్తు సంస్థలకు కేంద్ర హోంశాఖ అనుమతులిచ్చింది. దర్యాప్తు సంస్థలకు సహకరించనివారికి ఏడేళ్ల జైలు శిక్ష విధించే అవకాశం ఉంది.

కేంద్ర హోంశాఖ అనుమతులిచ్చిన వాటిల్లో ఐబీ, సీబీఐ, ఈడీ, రా, ఎన్ఐఏ, డీఆర్ఐ, ఐబీ, నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో, డైరెక్టోరేట్ ఆఫ్ సిగ్నల్ ఇంటలిజెన్స్, రెవెన్యూ ఇంటలిజెన్స్, దర్యాప్తు సంస్థలు ఉన్నాయి. ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 69(1),2000 కింద కేంద్ర హోంశాఖ ఈ ఉత్తర్వులు జారీ చేసింది. దేశ సమగ్రత, భద్రత, రక్షణ వంటి అంశాలను దృష్టిలో ఉంచుకుని కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.


Comments

Popular posts from this blog

అర్ధరాత్రి రోడ్లపై తిరిగితే అరెస్ట్‌! టోలీచౌకీ పోలీసుల కఠిన చర్యలు

🔐 కొత్త ఆధార్ కార్డు డిజైన్: ఫోటో & QR కోడ్ మాత్రమే – మీ గోప్యతకు కొత్త రక్షణ!

🗳️🔥 లోక్‌సభలో ఘాటు డిబేట్: రాహుల్ విసిరిన 3 ఆరోపణలకు అమిత్ షా ఇచ్చిన ఝలక్!