బాలలపై అత్యాచారం చేస్తే మరణ శిక్ష
బాలలపై అత్యాచారాలకు పాల్పడే నేరస్థులకు మరింత కఠిన శిక్షలు విధించేందుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ శుక్రవారం మాట్లాడుతూ లైంగిక నేరాల నుంచి బాలల పరిరక్షణ (పోక్సో) చట్టానికి సవరణలను మంత్రివర్గం ఆమోదించినట్లు తెలిపారు. ఈ చట్టంలోని కొన్ని సెక్షన్ల ప్రకారం విధించే శిక్షలను పెంచాలని నిర్ణయించినట్లు తెలిపారు.
బాలలు మేజర్ అయ్యేందుకు హార్మోన్లను ఇంజెక్ట్ చేయడాన్ని సెక్షన్ 9 ప్రకారం తీవ్ర నేరంగా పరిగణించేందుకు ఆమోదం లభించిందని చెప్పారు. చైల్డ్ పోర్నోగ్రఫీకి పాల్పడే నేరస్థులకు కొన్ని సెక్షన్ల ప్రకారం మరణ శిక్ష విధించే అవకాశం కల్పించినట్లు తెలిపారు.
Comments
Post a Comment