రైతులకు అబద్ధాలు చెప్పవద్దు : రాహుల్‌కు మోదీ సలహా

కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తీవ్రంగా మండిపడ్డారు. హిమాచల్ ప్రదేశ్‌లో జరిగిన బహిరంగ సభలో మోదీ మాట్లాడుతూ రుణాల రద్దు పేరుతో రైతులను కాంగ్రెస్ తప్పుదోవ పట్టిస్తోందని ఆరోపించారు.
 
రుణాల రద్దు సాధ్యం కాదని కాంగ్రెస్‌కు తెలుసునని, ఎన్నికల్లో గెలవడానికి మాత్రమే ఆ విధంగా చేస్తున్నారని అన్నారు. ఎన్నికల్లో గెలవడానికి యువతను వెర్రివాళ్ళను చేస్తున్నారని, రైతులకు వెన్నుపోటు పొడుస్తున్నారని మోదీ అన్నారు.
 
కాంగ్రెస్ ప్రభుత్వాలు పని చేయలేకపోతే రైతులకు ఆ విషయం చెప్పాలని, దానిని రైతులు అంగీకరిస్తారన్నారు. రైతులతో అబద్ధాలు చెప్పవద్దని సలహా ఇచ్చారు. రైతుల జీవితాలతో ఆడుకోవద్దని హితవు పలికారు.
 
2008లో రైతుల రుణాలు రూ.6 లక్షల కోట్లు ఉంటే, కాంగ్రెస్ ప్రభుత్వం రూ.60 వేల కోట్లు రద్దు చేస్తున్నట్లు ప్రకటించి, కేవలం రూ.52 వేల కోట్లు చెల్లించిందని చెప్పారు. పంజాబ్‌లో ఎన్నికలకు ముందు రుణాల రద్దుకు హామీ ఇచ్చారని అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు ఏమీ ఇవ్వలేదని చెప్పారు. కర్ణాటకలో కూడా కేవలం 800 మంది రైతులు మాత్రమే లబ్ధి పొందారు. అది కూడా నామమాత్రమేనని చెప్పారు.


Comments

Popular posts from this blog

అర్ధరాత్రి రోడ్లపై తిరిగితే అరెస్ట్‌! టోలీచౌకీ పోలీసుల కఠిన చర్యలు

🔐 కొత్త ఆధార్ కార్డు డిజైన్: ఫోటో & QR కోడ్ మాత్రమే – మీ గోప్యతకు కొత్త రక్షణ!

🗳️🔥 లోక్‌సభలో ఘాటు డిబేట్: రాహుల్ విసిరిన 3 ఆరోపణలకు అమిత్ షా ఇచ్చిన ఝలక్!