తాజా వార్తలు తొందర్లోనే కొత్త రూ.20 నోటు

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా త్వరలోనే కొత్త రూ.20 నోటును విడుదల చేయనుంది. కొన్ని అదనపు ఫీచర్లతో ఈ నోటును మార్కెట్‌లోకి తీసుకురానున్నట్లు ఆర్బీఐ వెల్లడించింది. ఇప్పటికే ఆర్బీఐ రూ.10, 50, 100, 200, 500, 2000 నోట్లను విడుదల చేసిన విషయం తెలిసిందే. మహాత్మాగాంధీ సిరీస్‌లో 2016 నుంచి ఈ కొత్త నోట్ల విడుదలను కేంద్ర బ్యాంకు కొనసాగిస్తున్నది. ఈ కొత్త నోట్లన్నీ గతంలో ఉన్న వాటికి పూర్తి భిన్నమైన రంగులు, సైజులతో వచ్చాయి. ఇప్పుడు కొత్తగా రూ.20 నోటు కూడా రానుంది. పాత నోట్లన్నీ చెల్లుబాటు కానున్నాయి. 2016, మార్చి 31 నాటికి 492 కోట్ల రూ.20 నోట్లు మార్కెట్లో చెలామణి అవుతున్నాయి. 2018, మార్చి నాటికి వీటి సంఖ్య వెయ్యి కోట్లకు చేరింది. మొత్తం కరెన్సీలో రూ.20 నోట్ల వాటా 9.8 శాతంగా ఉంది.

Comments

Popular posts from this blog

అర్ధరాత్రి రోడ్లపై తిరిగితే అరెస్ట్‌! టోలీచౌకీ పోలీసుల కఠిన చర్యలు

🔐 కొత్త ఆధార్ కార్డు డిజైన్: ఫోటో & QR కోడ్ మాత్రమే – మీ గోప్యతకు కొత్త రక్షణ!

🗳️🔥 లోక్‌సభలో ఘాటు డిబేట్: రాహుల్ విసిరిన 3 ఆరోపణలకు అమిత్ షా ఇచ్చిన ఝలక్!