రూటు మార్చిన మోదీ... ఈసారి మరో కొత్త ఆలోచన...
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రానున్న లోక్‌సభ ఎన్నికల్లో అనుసరించవలసిన వ్యూహాలకు పదును పెడుతున్నారు. బీజేపీ ఎంపీలతో మరింత సన్నిహితంగా సంభాషించేందుకు ‘భోజనం చేస్తూ చర్చ’ నిర్వహించాలని నిర్ణయించారు. గురువారం రాత్రి నుంచి ప్రారంభమైన ఈ చర్చలు వచ్చే నెల 3 వరకు జరుగుతాయి.
ప్రజలకు అనుకూలమైన ఎజెండాను రూపొందించాలని చాలా మంది ఎంపీలు మోదీని కోరినట్లు బీజేపీ వర్గాలు తెలిపాయి. ఎంపీల మాటలను మోదీ శ్రద్ధగా విన్నారని తెలిపాయి. కాంగ్రెస్ విసిరే సవాలును ఎదుర్కొనేందుకు పార్టీ సర్వసన్నద్ధంగా ఉండాలని చెప్పినట్లు పేర్కొన్నాయి.
Comments
Post a Comment