శీలేన శోభతే విద్య.. విద్య మనకు సంస్కారాన్ని నేర్పించాలి.

శీలేన శోభతే విద్య.. విద్య మనకు సంస్కారాన్ని నేర్పించాలి. దురదృష్టవశాత్తు నేతి విద్యావ్యవస్థ మన సంస్కృతిని సాంప్రయాదాలు, విలువలను విద్యార్థులను నేర్పించడం లేదు.. మంచి నేర్పకున్నా చెడు నేర్పకుంటే అదే పదివేలు..
పదో తరగతి విద్యార్థులకు పేకాట పరిచయం ఏమిటని ఆశ్చర్యపోతున్నారా? ముమ్మాటికీ నిజం.. స్వయంగా మన ప్రభుత్వమే నేర్పిస్తోంది..
పేకాట అనేది ఒక జూదం.. ఎక్కడ పేకాట జరిగినా పోలీసులు రైడ్‌ చేసి సీజ్‌ చేస్తారు.. పేకాట రాయుళ్ల అరెస్టు అనే వార్తలు పత్రికల్లో, టీవీల్లో చూసే ఉంటారు.. 
ఇప్పుడు అసలు విషయానికి వద్దాం.. 10వ తరగతి ఇంగ్లీషు మీడియం మాథ్స్‌ పుస్తకంలో Deck of Cards and Probability అనే ఛాప్టర్‌ ఉంది (పేజీ 317) ' ఈ పాఠం లో పేకాట  లో మొత్తం ఎన్ని కార్డులు ఉంటయ్  ? వాటిలో ఎరుపు రంగు కార్డులు ఎన్ని ? నలుపు రంగు కార్డులు ఎన్ని ? ఇస్పెట్లు ఎన్ని ? చౌకిన్ లు ఎన్ని ? ఫ్లవర్లు ఎన్ని ? బాదం లు ఎన్ని ? ప్యాకాట కార్డుల్లోంచి ఒక కార్డు తీస్తే అది  బాదం ఎక్కా  అయ్యే చాన్స్ ఎంత ? అది చౌకిన్ 9 అయ్యే  చాన్సు ఎంత ? అది నలుపు రంగు కార్డు అయ్యే  చాన్స్ ఎంత ? కార్డుల్లోని ఒక కార్డు ను తీస్తే అది ఫేస్ కార్డు అయ్యే  చాన్స్ ఎంత ?'  అనే ప్రశ్నలు అడుగుతారు.
ఇక్కడ నేను అడుగుతున్న ప్రశ్న ఏమిటంటే..  పదో తరగతి విద్యార్థులకు మీరు లెక్కలు నేర్పుతున్నారా? పత్తాలు (పేకాట) ఆడటం నేర్పిస్తున్నారా? అసలు పేకాటను ఉదహరిస్తూ గణిత పాఠం బోధించాల్సిన అవసరం ఏమిటి? 
ఇటీవల Facebookలో మిత్రుడు Thaniparthi Thirupathi Rao  పెట్టిన పోస్టు చూసి చాలా ఆశ్యర్యపోయాను.. ఆయన మాథ్స్‌ టీచర్‌గా పని చేస్తారు. ఆయనకు పేకాట రాదు. ఈ ప్రాబబిలిటీ ఛాప్టర్‌ విద్యార్థులకు నేర్పించడానికి పేకాట నేర్చుకోక తప్పలేదని, సబ్జెక్టు మరచిపోకుండా ఉండేందుకు అప్పుడప్పుడు ఈ పత్తాలను ఇలా పట్టుకుంటానని తెలిపారు. 
ఇప్పటితో రాష్ట్రంలో మద్యపాన వ్యసనం దారుణంగా మారింది. ఆదాయం కోసం వైన్‌షాపులు, బార్లకు విచ్చల విడిగా అనుమతులు ఇచ్చి మద్యాపానాన్ని ప్రోత్సహిస్తున్నారు.. ఇప్పుడు ఏకంగా విద్యార్థులకు పేకాటను కూడా నేర్పిస్తున్నారు.. భవిష్యత్తులో ప్రభుత్వం ఇంకెన్ని వ్యసనాలను సమాజం మీద రుద్దుతారోనని నిజంగా నాకు భయంగా ఉంది..


Comments

Popular posts from this blog

అర్ధరాత్రి రోడ్లపై తిరిగితే అరెస్ట్‌! టోలీచౌకీ పోలీసుల కఠిన చర్యలు

🔐 కొత్త ఆధార్ కార్డు డిజైన్: ఫోటో & QR కోడ్ మాత్రమే – మీ గోప్యతకు కొత్త రక్షణ!

🗳️🔥 లోక్‌సభలో ఘాటు డిబేట్: రాహుల్ విసిరిన 3 ఆరోపణలకు అమిత్ షా ఇచ్చిన ఝలక్!