బీజేపీ బహిష్కృత నేత, గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

బీజేపీ బహిష్కృత నేత, గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వచ్చే అసెంబ్లీలో తాను ఎమ్మెల్యేగా ఉండకపోవచ్చని రాజాసింగ్‌ చెప్పారు. అంటే రానున్న ఎన్నికల తర్వాత ఏర్పడే అసెంబ్లీకి తాను రాకపోవచ్చని అసెంబ్లీ వేదికగా వ్యాఖ్యానించారు. ఇంటా బయటా తనను అసెంబ్లీకి రావొద్దనే కోరుకుంటున్నారని చెప్పారు. ఇప్పుడీ వ్యాఖ్యలు సర్వత్రా చర్చనీయాంశమయ్యాయి._

_మ‌హ్మద్ ప్రవ‌క్తపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకుగాను బీజేఎల్పీ నేత రాజాసింగ్‌పై గతేడాది ఆగస్టు 23న బీజేపీ స‌స్పెన్షన్ వేటు వేసింది. పార్టీ విధానాల‌కు వ్యతిరేకంగా మాట్లాడినందుకు ఆయనపై చ‌ర్యలు తీసుకుంటున్నట్లు తెలిపింది. శాస‌న స‌భాప‌క్ష ప‌ద‌వినుంచి కూడా తొల‌గించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఆయనను పార్టీ కార్యకలాపాలకు దూరంగా పెడుతూ వస్తున్నారు._.

Comments

Popular posts from this blog

అర్ధరాత్రి రోడ్లపై తిరిగితే అరెస్ట్‌! టోలీచౌకీ పోలీసుల కఠిన చర్యలు

🔐 కొత్త ఆధార్ కార్డు డిజైన్: ఫోటో & QR కోడ్ మాత్రమే – మీ గోప్యతకు కొత్త రక్షణ!

🗳️🔥 లోక్‌సభలో ఘాటు డిబేట్: రాహుల్ విసిరిన 3 ఆరోపణలకు అమిత్ షా ఇచ్చిన ఝలక్!