అసెంబ్లీ మీడియా పాయింట్ : - ఈటల రాజేందర్.

అసెంబ్లీ మీడియా పాయింట్ : 

రాబోయే ఎన్నికల్లో ఓడిపోతామనే భయం కెసిఆర్ కి పట్టుకుంది. 
అందుకే అన్ని వర్గాలను మచ్చిక చేసుకొనే ప్రయత్నం చేస్తున్నారు.
కానీ నమ్మడానికి ప్రజలు సిద్దంగా లేరు. 

అసెంబ్లీలో మాకు రూం ఇవ్వకపోవడం, BAC కి పిలవకపోవడం అంటే మమ్ముల్ని కాదు అసెంబ్లీనీ అవమానించారు. 

మూడు రోజులపాటే అసెంబ్లీ జరపడం అంటే ప్రజసమస్యలపై చిత్తశుద్ది లేనట్టే. 

సమైక్యపాలకులకు ఉన్న సోయి కేసీఆర్ ప్రభుత్వానికి లేదు..

అన్ని పార్టీలకు రూములు కేటాయించేవి గత ప్రభుత్వాలు,  కానీ ఈరోజు ముగ్గురు శాసనసభ్యులు ఉన్న బిజెపి పార్టీకి మాత్రం ఒక్క రూమ్ కూడా కేటాయించలేకపోతున్నారు.. ఇది కేవలం కక్ష సాధింపుకు నిదర్శనం.

ఈరోజు ఉదయం స్పీకర్ గారికి ఫోన్ చేసి మాట్లాడితే కూడా సరిగా స్పందించలేదు. మా హక్కులను, సభా సాంప్రదాయాలను కాపాడవలసిన స్పీకర్ గారు మమ్మల్ని అవమానించడం చాలా బాధాకరం.

ఈ రాష్ట్రంలో ప్రశాంతత లేదు. వందల మంది విద్యార్థులు, ప్రజలు మా వద్దకు వచ్చి మా యొక్క సమస్యలు అసెంబ్లీలో ప్రస్తావించండి అని మొరపెట్టుకుంటున్నారు.

కనివిని ఎరుగని రీతిలో తెలంగాణలో వరదలు వచ్చి వేల ఎకరాలు కోతకు గురైనవి, వందల ఎకరాల పంట నష్టం, మనుషులు, పశువులు కొట్టుకుపోయిన ఈ ప్రభుత్వం సహాయ సహకారాలు అందించలేదు.

నిర్మల్, భూపాలపల్లి, హనుమకొండ, వరంగల్ జిల్లాలలో వరద ప్రవాహిత ప్రాంతాలను పర్యటించినం.

25 వేల చొప్పున వారికి ఆర్థిక సాయం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.

కాలేశ్వరం ప్రాజెక్టు వల్ల మంచిర్యాల, చెన్నూరు, ములుగు ప్రాంతాలు నీట మునిగాయి.

ఢిల్లీకి వెళ్లి అమిత్ షా గారిని కలిసి కేంద్ర బృందాల సహాయం కోరితే వారి తక్షణమే పంపడం జరిగింది.

తెలంగాణ వచ్చిన నాడు 56,000 మంది ఆర్టీసీ ఉద్యోగులు ఉండేవారు, కానీ ఇప్పుడు 43 వేల మందికి ఉన్నారు. 9వేల ఆర్టీసీ బస్సులు ఉండేవి.. ఇవాళ 6000 కు తగ్గిపోయినాయి, ప్రైవేట్ బస్సులు 1200 ఉండేవి ఇప్పుడు 3000 బస్సులకు పెరిగిపోయినాయి..
ప్రైవేట్ వాళ్లకి బస్సులు ఇచ్చి ఆర్టీసీని కతం పట్టించే కుట్ర జరుగుతుంది.

మల్టీపర్పస్ ఉద్యోగులుగా పనిచేయాలని గ్రామపంచాయతీ ఉద్యోగులకు ఇచ్చిన జీవోను తక్షణమే రద్దు చేయాలి.

కరోనా సమయంలో సేవలందించిన ఉద్యోగులను కొనసాగించాలి.

18,000 మంది VRO, VRA లను మిషన్ భగీరథ పనులకు వాడుకుంటున్నారు.

గెస్ట్ లెక్చరర్స్, కానిస్టేబుల్ అభ్యర్థులు సమస్యలు వెంటనే పరిష్కరించాలి.

గ్రూప్ 2 ఎగ్జామ్ పోస్ట్ పోన్ చేయాలనీ డిమాండ్ చేస్తున్నాం.

కేసీఆర్ సభలో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలని నేను డిమాండ్ చేస్తున్నాను.

- ఈటల రాజేందర్. 
ఎమ్మెల్యే హుజూరాబాద్

Comments

Popular posts from this blog

అర్ధరాత్రి రోడ్లపై తిరిగితే అరెస్ట్‌! టోలీచౌకీ పోలీసుల కఠిన చర్యలు

🔐 కొత్త ఆధార్ కార్డు డిజైన్: ఫోటో & QR కోడ్ మాత్రమే – మీ గోప్యతకు కొత్త రక్షణ!

🗳️🔥 లోక్‌సభలో ఘాటు డిబేట్: రాహుల్ విసిరిన 3 ఆరోపణలకు అమిత్ షా ఇచ్చిన ఝలక్!