మణిపూర్‌లో ఏం జరుగుతోందనే అంశంపై ప్రతి ఒక్కరికీ స్పష్టమైన అవగాహన ఉండాలి
మణిపూర్‌లో ఏం జరుగుతోందనే అంశంపై ప్రతి ఒక్కరికీ స్పష్టమైన అవగాహన ఉండాలి. అక్కడ జరుగుతున్న వాస్తవాలకన్నా అవాస్తవాలే ఎక్కువ ప్రచారమైపోతున్నాయి. నిజం తెలిసే సరికి అబద్దం లోకం చుట్టి వస్తోంది.
మణిపూర్‌లో తెగల మధ్య జరుగుతున్న పోరాటానికి మతం రంగు రుద్దుతున్నారు. అక్కడ అరాచకాల సృష్టిస్తూ చిచ్చు పెడుతున్న విదేశీ శక్తులు, వేర్పాటువాద సంస్థలు, మిషనరీల కుట్రలు అన్నీ ఇన్నీ కాదు. ముఖ్యంగా మన తెలుగునాట ఈ దుష్ప్రచారం ఎక్కువ జరుగుతోంది.
ఈశాన్య రాష్ట్రాల్లో పుష్కర కాలం పాటు ఆర్‌ఎస్‌ఎస్ ప్రచారక్‌గా, సామాజిక కార్యకర్తగా పని చేసి వచ్చిన మన తెలుగువారు కస్తూరి రాకా సుధాకర్ రావు గారికి మణిపూర్ సమస్య పట్ల స్పష్టమైన అవగాహన ఉంది. వారికి అక్కడి ప్రాంతీయ భాషలు కూడా తెలుసు, వివిధ తెగల వారిని, వేర్పాటువాద గ్రూపులను దగ్గర నుంచి చూసి వచ్చారు.. మరింత సమాచారం కోసం రాకాజీ నిర్వహిస్తున్న #Rakalokam యూట్యూబ్ చానల్ చూడండి.
Comments
Post a Comment