అన్నా హజారే ఆదర్శాలు: శిష్యుల చేతుల్లో ఎలా చెడిపోయాయి?"**
మీ చుట్టూ చేరిన వారితో జాగ్రత్త అని చెప్పితే, గిట్టనివారు ఇలాగే దుష్ప్రచారం చేస్తారని పెద్దగా పట్టించుకోలేదు అన్నాహజారే.. క్రమంగా అనుభవానికి వచ్చేసరికి పరిస్థితి చేజారిపోయింది. అప్పటికే నిఖార్సయిన శిష్యులను దూరం చేసుకొని ఒంటరిగా మిగిలిపోయారు.. ఇంతకాలంగా ఆయన చేసిన పనంతా బూడదలో పోసిన పన్నీరైంది. హాజారేకన్నా తామే యోధులం అన్నట్లు మాటల గారడీతో నమ్మించేశారు సోకాల్డ్ శిష్యులు.
మనకు రాజకీయాలు వద్దు, ఉద్యమం ద్వారా మార్పు తెద్దాం అని అన్నాహజారే చెప్పిన మాటలు ఎవరికీ రుచించలేదు. అలా ప్రారంభమైన పార్టీ తత్వం ప్రారంభంలోనే బోధపడ్డా ఎవరూ పెద్ద పట్టించుకోలేదు. ఏ పార్టీ అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేశారో, అదే పార్టీ మద్దతుతో ఢిల్లీలో అధికారం చేపట్టారు. ఈ విషయంలో వారిద్దరినీ కలిపిన ఎజెండా జాతీయవాద వ్యతిరేకత.
అన్నా హజారే మద్యానికి వ్యతిరేకంగా ప్రజల్లో చైతన్యం తెచ్చి తన ఊరు రాలేగావ్ సిద్దీని అభివృద్ది చేశారు. కానీ ఈ సోకాల్డ్ శిష్యులు అదే మద్యం మాఫియాతో అంటకాగి ప్రజాధనాన్ని దోచుకొని శీష్ మహల్ లాంటి అద్దాల మేడలు కట్టుకున్నారు. చేసిన పాపం ఊరికే పోదు కదా.. ఎవరి కర్మ వారే అనుభవించాలి. చేస్తూనే ఉండండి..
Comments
Post a Comment