“సనాతన ధర్మ ఆనవాళ్లు: గుజరాత్ లో వెలుగులోకి వచ్చిన అద్భుతమైన స్పటిక శివలింగం”
ఎంత తొక్కేసి, నలిపేసి, ధ్వంసం చేసి ఆనవాళ్లు లేకుండా చేద్దాం అని అనుకుంటూ ఉంటే అంత ఉవ్వెత్తున మళ్లీ ఎగిసి పడుతున్నాయి "సనాతన ధర్మ" ఆనవాళ్లు.
గుజరాత్ లో భరూచ్ జిల్లాలోని జంబూసర్ తాలూకాలో ఉన్న ' కవి 'గ్రామం.
బుధవారం కవి గ్రామ తీరానికి సమీపంలో అరేబియా సముద్రంలో చేపల వేటకు వెళ్లిన మత్స్యకారుల వలలో చిక్కుకున్న 100 కిలోగ్రాములకు పైగాబరువు ఉన్న సుమారు ఎనిమిది అడుగుల ఎత్తుల ఉన్న స్పటిక (క్రిస్టల్) శివలింగం దొరికింది.
బాగా బరువు ఉండటంతో అతి కష్టం మీద 10 మంది మత్స్యకారులు శివలింగాన్ని జాగ్రత్తగా తమ పడవలోకి ఎక్కించి ఒడ్డుకు చేర్చారు. ఈ అరుదైన శివలింగాన్ని చూసేందుకు పెద్ద సంఖ్యలో గ్రామస్తులు సముద్రం ఒడ్డుకు చేరుకున్నారు
కాళీ దాస్ వాఘేలా, మంగళ్ కాళీ దాస్ ఫకీరా మరియు మరో డజను మంది మత్స్యకారులు తీరానికి దగ్గరగా ఉన్న ఢంకా తీర్థం దగ్గర సాధారణ చేపల వేటకు బయలుదేరారు. వారి వల లాగుతున్నప్పుడు, వారి వలలో చేపలుతో పాటు ఈ పెద్ద స్పటిక శివలింగం కూడా చిక్కుకుంది.
దానిని జాగ్రత్తగా శుభ్రపరచి పరిశీలించిన మీదట అది స్పటిక శివలింగం గా తేలింది. మత్స్యకారులు ఒడ్డుకు తీసుకువచ్చి పూర్తిగా శుభ్రం చేసిన తర్వాత, స్ఫటిక శివలింగం లో శంఖం, సూక్ష్మ విగ్రహాలు మరియు వెండి సర్పం వంటి అద్భుతమైన వివరాలు ఉన్నాయి.
ప్రస్తుతం, గ్రామస్తులు ఈ శివలింగాన్ని కమలేశ్వర్ మహాదేవ్ ఆలయంలో లేదా సమీపంలోని మరొక శివాలయంలో ప్రతిష్టించాలని ఆలోచిస్తున్నారు.



Comments
Post a Comment