నెహ్రూ విదేశీ విధానం మరియు జాక్విలినా కెన్నెడీ: 'JFK's Forgotten Crisis' పుస్తకం నుండి వివాదాస్పద విషయాలు #JawaharlalNehru #JFK #ForeignPolicy #NehruControversies #IndiraGandhi
'డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధాని మోదీని ఆహ్వానించే విధంగా అమెరికాను అడుక్కుందికి మోడీ ప్రభుత్వం భారత విదేశీ వ్యవహారాల మంత్రిని మూడు లేదా నాలుగు సార్లు అమెరికాకు పంపిందని" కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మొన్న పార్లమెంట్‌లో మాట్లాడుతూ ఆరోపించాడు.
మనం అద్దాల మేడలో ఉంటూ ఎదురు వాళ్ళ మీద రాళ్లు విసరకూడదు అని సామెత.
అందులోనూ మోదీ వంటి వారితో అసలు పెట్టుకోకూడదు. కానీ రాహువు కి అంత IQ ఉంటే కాంగ్రేస్ నాయకులకు, నెహ్రూ కుటుంబ బానిసలకు విచారం ఎందుకు ఉంటుంది?
మరి రాహుల్ చేసిన ఆరోపణలు పై మోడీ జవాబు చెప్పకుండా మౌనంగా ఉంటారా?
అందుకే మొన్న మోడీ పార్లమెంట్ లో మాట్లాడుతూ ...
"విదేశాంగ విధానంపై ఆసక్తి ఉన్నవారు అమెరికా అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెన్నెడీతో జవహర్‌లాల్ నెహ్రూ జరిపిన సమావేశాలపై సమాచారాన్ని ఇచ్చే JFK's Forgotten crisis అనే పుస్తకాన్ని చదవాలని ప్రధాని మోదీ అందరికి సలహా ఇచ్చారు.
"ఒక వైపు దేశం గట్టి సవాళ్లను ఎదుర్కొంటున్న పరిస్థితులలలో నెహ్రూ మరియు అతని దౌత్యం విధానం పై కూడా ఈ పుస్తకంలో రాయబడింది అందుచేత తప్పక చదవండి" అని మోదీ చెప్పారు.
ఇంతకీ " JFK's Forgotten Crisis: Tibet, the CIA and the Sino-Indian War'" అనే పేరుతో ఉన్న పుస్తకం లో ఏముంది?
ఈ పుస్తకాన్ని CIA మాజీ అధికారి బ్రూస్ రీడెల్ రాశారు. ఇది 1962 చైనా-ఇండియన్ యుద్ధం, చైనా దూకుడుకు వ్యతిరేకంగా భారతదేశానికి యుద్ధ విమానాలను అందించమని నెహ్రూ కెన్నెడీని ఎలా అభ్యర్ధించారు, చైనాను అర్ధం చేసుకోవడం లో నెహ్రూ ఎలా విఫలం చెంది ఓటమి మూటకట్టుకున్నారు అనే విషయాల గురించి ఈ పుస్తకం లో రాయబడ్డది.
ఈ పుస్తకంలో కొన్ని 'వాడి-వేడి' విషయాలు కూడా ప్రస్తావించబడ్డాయి.
*నవంబర్ 6, 1961న నెహ్రూ అమెరికా పర్యటన సందర్భంగా JF కెనడీ 27 ఏళ్ల ఆకర్షణీయమైన" సోదరి 'పాట్ కెన్నెడీ' పట్ల నెహ్రూ "ఆసక్తి" గా ఎలా ఉన్నారో వంటి పలు వివాదాస్పద అంశాలు పుస్తకం లోబరాయబడ్డాయి.
* నెహ్రూ అమెరికా వచ్చినప్పుడు ఎద్వినా మౌంట్ బాటన్ ఏ గెస్ట్ హౌస్ లో తరుచుగా వుండేవారో దాన్లో నే ఉండడానికి నెహ్రూ బాగా ఆసక్తి చూపారని రాయబడింది.
* 1962 మార్చి నెలలో కెన్నడీ మరియు అతని భార్య జాక్విలినా భారత పర్యటన సందర్భంగా, జాక్విలినా ఉండడానికి అమెరికా ఎంబసీ ఒక విల్లా తీసుకుంటే, తీరా ఆమె దేశంలో కాలు పెట్టాక ప్రధాని బంగ్లా లోనే ఒక సూట్ లో ఆమెను ఉంచాలని నెహ్రూ పట్టు పట్టారు అని, ఆ సూట్ ప్రత్యేకత ఏమిటంటే భారత్ కు స్వాతంత్రం వచ్చిన తరువాత భారత్ కు తరుచుగా వచ్చే ఎద్వినా మౌంట్ బాటన్ ఆ సూట్ ఉపయోగిస్తూ వుండేవారు అని ఈ పుస్తకం పేర్కొంది.
* ఈ పుస్తకం లో పేర్కొనబడిన మరొక దారుణమైన విషయం ఏమిటంటే 'తన ప్రెసిడెన్సీ కాలంలో ఇది (అంటే ఈ భారత పర్యటన) అత్యంత చెత్త విదేశీ పర్యటన' అని అమెరికా అప్పటి ప్రెసిడెంట్ కెనడీ అమెరికా అంబాసిడర్ కి చెప్పినట్లు గా రాయబడ్డది.
* అంతే కాదు, "నెహ్రూ నాతో కంటే జాక్విలినా తో మాట్లాడటానికే ఎక్కువ ఉత్సాహం చూపించేవాడు" అని కెనడీ పేర్కొన్నారని కూడా చెప్పబడింది
* "పట్టణ మఠాధికారి వేశ్యా గృహంలో పట్టుబడినట్లు" ఉంది అని నెహ్రూ గురించి అమెరికా ప్రెసిడెంట్ కెన్నడీ వ్యాఖ్యానించినట్లు రాయబడింది.
*ప్రెసిడెంట్ కెన్నడీకి మరియు అతని భార్య జాక్వలిన్ కి నెహ్రూ మరియు ఇందిరా అంటే గౌరవం లేదు అంటూ 1961లో నెహ్రూ అమెరికా పర్యటన సందర్భంగా జరిగిన ఒక సంఘటన గురించి రాయబడింది. ఆ రోజు లంచ్ మగవారి అందరికి ఒక డైనింగ్ హాల్ లోనూ స్త్రీలకు జాక్వలిన్ అధ్యర్యంలో వేరే హాల్ లోనూ ఏర్పాటు చేయబడింది. కానీ నెహ్రూ తో టూర్ కి వచ్చిన ఇందిర స్త్రీలతో కూర్చోడానికి ఇష్టపడక పురుషులు తోనే కూర్చోడానికి ఇష్టపడింది అని జాక్వలిన్ ఒకసారి ఇచ్చిన ఇంటర్వ్యూ స్క్రిప్ట్ ద్వారా కోట్ చేయబడింది.
*జాక్విలినా భారత్ వచ్చినప్పుడు నెహ్రూ ఆమె మొహం పట్టుకుని దగ్గరకు తీసుకున్నట్లు ఫొటో ఒక ఫొటో ఇంటర్నెట్ లో తెగ తిరుగుతోంది. ఆ ఫోటో నిజమేనని దానిలో ఉన్నది జాక్విలినా మరియు నెహ్రూ యే అని ఫాక్ట్ చెకర్ 'ఆల్ట్ న్యూస్' నిర్ధారించింది. బహుశా ఆ క్షణమే జాక్విలినా నెహ్రూ వ్యక్తిత్వం పై ఘాటైన విమర్శలు చేసి ఉండవచ్చు.
ఏది ఏమైనా నెహ్రూ కి ఆడవాళ్ళ పిచ్చి ఉన్నట్లు అప్పట్లో జరిగిన పలు సంఘటనలు ఫోటోలు రుజువు చేస్తున్నాయి.
దేశం అత్యంత క్లిష్టమైన పరిస్థితులు ఎదుర్కుంటున్నపుడు దేశ ప్రధానికి సాధారణంగా ఖాళీ సమయం దొరకడం చాలా కష్టం. అయినా కొన్ని దౌత్య ప్రోటోకాల్స్ వంటివి పాటించడానికి దేశం వచ్చిన విదేశీ ప్రముఖలతో దేశంలో పర్యటించడం ప్రధాని కి తప్పనిసరి కావచ్చు.
కానీ, ఆ విదేశీ ప్రముఖుల కుటుంబ సభ్యులను సాక్షాత్తు దేశ ప్రధాని ఎంగేజ్ చేయవలసిన అవసరం ఎప్పుడూ ఉండదు. ఆ ప్రముఖుల స్త్రీ కుటుంబ సభ్యులకు తగినంత గౌరవం ఇచ్చి వారిని ఎవరికైనా ముఖ్యులకు అప్పచెప్పి వారికి కావలసినవి చూడమని చెప్తారు.
అంతే కాని స్వయంగా దేశ ప్రధాని ఆ స్త్రీలను పార్కులకు, తోటలకు తిప్పే అంత విరామం సమయం ఉండదు మరియు అవసరం కూడా ఉండదు. కానీ, నెహ్రూ ఇలా విదేశీ స్త్రీలతో చెట్టాపట్టాలేసుకుని పార్కుల్లో, అడవుల్లో తిరిగినట్లు, షికారీ లకు వెళ్లినట్లు బోలెడు ఫోటోలు నెట్ లో ఉన్నాయి.
జాక్విలినా అంటే నెహ్రూ కి ఎంత పిచ్చి అంటే తన ఇంట్లో ముఖ్య ద్వారానికి ఎదురుగా జాక్విలినా మరియు తను కలసి ఉన్న ఫోటో ప్రదర్శన కు గోడ మీద ఉంచాడు. అంతే కాదు నెహ్రూ తన బెడ్ పక్కన ఉన్న టీ పాయ్ మీద జాక్విలినా ఫోటో ఉంచుకునే వాడు అని బ్రూస్ రీడిల్ చెప్పాడు.
నెహ్రూ ని ఈ దేశానికి 'రెండో దేవుడులా' ప్రకటించి ప్రచారం కల్పించిన నెహ్రూ కుటుంబ బానిసలు నెహ్రూ గురించి బయట పడుతున్న ఈ నిజాలు జీర్ణించుకోలేక తిరిగి ఈ విషయాలు బయటపెడుతున్న వారి మీద దుమ్మెత్తి పోస్తున్నారు.
Comments
Post a Comment