పొడవాటి ఆకులుండే పంటలు పండించొద్దు: BSF రైతులకు సూచన #సరిహద్దుభద్రత #BSFఅప్రమత్తత #రైతులఅవగాహన

పొడవాటి ఆకులుండే పంటలు పండించొద్దు : రైతులను కోరిన BSF

సరిహద్దుల వెంబడి అక్రమ చొరబాట్లను నిరోధించడానికి సరిహద్దు భద్రతా దళం (BSF) కీలక నిర్ణయం తీసుకుంది. బంగ్లాదేశ్ సరిహద్దు ప్రాంతాల్లో వుండే రైతులు పొడవుగా ఆకులు వచ్చే పంటలను పండించొద్దని పేర్కొంది. ఈ మేరకు సరిహద్దు ప్రాంతాలను ఆనుకొని వుండే అన్ని జిల్లాల కలెక్టర్లకు బీఎస్ఎఫ్ లేఖలు రాసింది. పొడవాటి ఆకులు వచ్చే పంటలను పండించొద్దని రైతులకు సూచించాలని, ఈ మేరకు వారిని జాగృతం చేయాలని జిల్లాల కలెక్టర్లను కోరింది.దీనిపై రైతులకు అవగాహనా సదస్సులు కూడా నిర్వహించాలని సూచించింది.

పొడవాటి ఆకులు వచ్చే పంటలను పండించడం వల్ల వాటి అక్రమ చొరబాటుదార్లు వాటి వెనుక దాక్కోవడం, అలాగే స్మగ్లర్లు వీటిని ఓ అవకాశంగా తీసుకోవడం జరుగుతోందని, అందుకే రైతులు ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలని బీఎస్ఎఫ్ పేర్కొంది. ఈ మేరకు రైతులను ఒప్పించాలని కూడా కలెక్టర్లను కోరింది. అయితే.. ఇలాంటి లేఖలు పంపడం ఇది మొదటిసారి కాదని అధికారులు అంటున్నారు. బంగ్లాదేశ్ లో రాజకీయ అస్థిరత నెలకొన్న నేపథ్యంలో సరిహద్దు ప్రాంతాల్లో బీఎస్ఎఫ్ నిఘా పెంచింది.

బంగ్లాదేశ్ ను పంచుకొనే సరిహద్దు ప్రాంతాల్లో వైవిధ్య భరితమైన వాతావరణం, భౌగోళిక సరిహద్దు ప్రాంతాలు, సామాజిక సమీకరణాలు, బంగ్లాదేశ్ తో తరుచూ ఇబ్బందులు వస్తున్న నేపథ్యంలో అక్కడ భద్రతాపరంగా జవాన్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయినా సరే.. బీఎస్ఎఫ్ అత్యంత ధైర్య సాహసాలను ప్రదర్శిస్తూ విధులు నిర్వహిస్తోంది. అక్రమ చొరబాట్లు, స్మగ్గింగ్ లాంటి సమస్యలను నిరోధించడానికి ఆధునిక సాంకేతికతను కూడా ఉపయోగిస్తున్నారు.

Comments

Post a Comment

Popular posts from this blog

అర్ధరాత్రి రోడ్లపై తిరిగితే అరెస్ట్‌! టోలీచౌకీ పోలీసుల కఠిన చర్యలు

🔐 కొత్త ఆధార్ కార్డు డిజైన్: ఫోటో & QR కోడ్ మాత్రమే – మీ గోప్యతకు కొత్త రక్షణ!

🗳️🔥 లోక్‌సభలో ఘాటు డిబేట్: రాహుల్ విసిరిన 3 ఆరోపణలకు అమిత్ షా ఇచ్చిన ఝలక్!