మహా కుంభమేళా లో స్నానం చేయాలని అన్ని కోట్ల మంది ఎందుకు వస్తున్నారు?

#mahakumbh2025 #kumbhmela2025 #హిందుత్వం #జాగోహిందూ #జైశ్రీరామ్ #హైందవశంఖారావం #haindavasankharavam #బాకీసబ్_బక్వాస్

మహా కుంభమేళా లో స్నానం చేయాలని అన్ని కోట్ల మంది ఎందుకు వస్తున్నారు?

మొదట నలభై-నలభై అయిదు కోట్లమంది వస్తారని అంచనా వేశారు . ఇంకా ఇరవై రోజులు పూర్తి కాలేదు. ఇప్పటికే ముప్పై మూడు కోట్లమంది స్నానాలు చేశారు. ఇంకా ఇరవై రోజుల పైనే ఉంది . ఇంకో నలభై కోట్లమంది స్నానాలు చేసినా ఆశ్చర్యపోయే అవసరం లేదు.

డెబ్బై ఎనభై కోట్ల మంది స్నానాలు చేయగా, భక్తి శ్రద్ధలు, ఆసక్తి ఉండీ. అవకాశాలు లేక రాలేనివారు అంతకన్నా ఎక్కువమందే ఉంటారు, ప్రపంచమంతా కలిపి. సుమారు నూటయాభై కోట్లమంది శ్రద్ధాళువులు మహా కుంభమేళా గురించి రోజురోజూ వివరాలు తెలుసుకుంటున్నారు.

కుంభమేళాలో స్నానం చేస్తే తిండి దొరుకుతుందా? అంటూ మల్లికార్జున ఖర్గే... ది పూర్ ఫెలో--- లేకిగా అడుగుతున్నాడు.

అంటే ఈ నూటయాభై కోట్లమందికి తెలిసినది, ఆ పూర్ ఫెలో కు తెలియలేదు.

తిండి అనేది అత్యంత ప్రాథమిక అవసరము. కుంభమేళాలో స్నానం చేస్తే, తిండి మాత్రమే కాదు, అత్యంత ఉన్నతమైన ప్రయోజనము--- బ్రహ్మానందము, లేదా మోక్షము కలుగుతుంది. అది తెలీక ఇతగాడు మొదటి మెట్టులోనే తప్పటడుగు వేస్తున్నాడు.

అతడి ప్రకారమే, తిండి సంగతి చూద్దాము. వచ్చిన వారికి స్నానం అయ్యాక బొట్టు, విబూది పెట్టడం నుండీ, వారి బట్టలు , మొబైళ్ళూ, చెప్పులూ వంటివి జాగ్రత్తగా ఉంచడము నుండీ రవాణా, హోటళ్ళు, కానుకలు వంటి అనేక వ్యాపారాలు చేసేవాళ్ళకు మొత్తం కలిపి లక్షల కోట్లలో వ్యాపారం అవుతున్నది. ఇంత బిజినెస్ అయితే తిండికి కొదవా?

ఆదిమ మానవుడి లా కేవలం తిండి గురించి మాత్రమే ఆలోచిస్తూ అంతకన్నా గొప్పవీ, ఉన్నతమైనవి అయిన వాటి గురించి తెలియని అజ్ఞానపు శుంఠ ఆ పూర్ ఫెలో.

తిండి గురించి తనకు తప్ప ఇంకెవరికీ తెలీదు అనుకుంటున్నాడో ఏమో గానీ, అనుష్ఠానపరులకు ఏమేమి లభిస్తాయో, ఈ సృష్టి మొదలైనపుడే ఉపనిషత్ చెప్పింది.

తైత్తీరియ ఉపనిషత్ లోని భృగువల్లీ లో అన్నిటికన్నా ఉన్నతమూ, గొప్పదీ అయిన " బ్రహ్మము " అంటే ఏమిటి? అని వరుణుడి కొడుకైన భృగువు తండ్రిని ప్రశ్నించగా, దానికి నేరుగా సమాధానం ఇవ్వకుండా, బ్రహ్మపు లక్షణాలను సూచనాప్రాయంగా చెప్పి, " బ్రహ్మమంటే ఏమిటో నువ్వే తపస్సు చేసి తెలుసుకో"" అంటాడు వరుణుడు.

తండ్రిమాట ప్రకారము తపస్సు చేసి, మొదట ’ అన్నమే బ్రహ్మము ’ అని భావించి తండ్రికి చెపుతాడు. " ఇంకా తపస్సు చేసి, తెలుసుకో " అని వరుణుడు మరలా అంటాడు.

మరలా తపస్సు చేసి ఈసారి " ప్రాణమే బ్రహ్మము " అని తెలుసుకొని తండ్రికి చెపుతాడు... తండ్రి మరలా" ఇంకా తపస్సు చేసి తెలుసుకో " అంటాడు.

అలాగ,వేర్వేరుగా తపస్సు చేసి, అన్నము, ప్రాణము తర్వాత, మనస్సు, విజ్ఞానములు బ్రహ్మము అని తెలుసుకొని, చివరకు అవేవీ బ్రహ్మము కాదని తెలుసుకొని " ఆనందమే నిజమైన బ్రహ్మము " అని అంతిమంగా తెలుసుకొని, ఆ బ్రహ్మానందాన్ని పొందటానికి ఏయే ఉపాసనలు చేయాలో తపస్సు వలన తెలుసుకుంటాడు.

కుంభ మేళాలో స్నానము చేయడము కూడా ఆ ఉపాసనలలో ఒకటి. భక్తులు కుంభమేళాకు వచ్చేది అత్యున్నతమైన ఆ బ్రహ్మానందము లేదా మోక్షము కోసమే గానీ, పశుపక్ష్యాదుల్లాగా, అవి వెంపరలాడే తిండి కోసము కాదు. అన్ని కోట్లమందికి, " ఆనందమే బ్రహ్మము " అని తెలుసుగానీ, ఈ వెకిలి మనిషి కి మాత్రం అన్నం మాత్రమే పరమావధి. కుంభమేళా జరిపేది తిండికోసం అనుకుంటున్న ఇతడి బుద్ధి యే స్థాయిలో ఉందో తనకు తానే ఋజువు చేసుకున్నాడు,--పూర్ ఫెలో.

Comments

Post a Comment

Popular posts from this blog

అర్ధరాత్రి రోడ్లపై తిరిగితే అరెస్ట్‌! టోలీచౌకీ పోలీసుల కఠిన చర్యలు

🔐 కొత్త ఆధార్ కార్డు డిజైన్: ఫోటో & QR కోడ్ మాత్రమే – మీ గోప్యతకు కొత్త రక్షణ!

🗳️🔥 లోక్‌సభలో ఘాటు డిబేట్: రాహుల్ విసిరిన 3 ఆరోపణలకు అమిత్ షా ఇచ్చిన ఝలక్!