తెలంగాణ భవన్‌లో ఘనంగా బోనాల వేడుకలు

తెలంగాణ భవన్‌లో ఘనంగా బోనాల వేడుకలు

దిల్లీలోని తెలంగాణ భవన్ లో బోనాల పండగ ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పోతురాజుల విన్యాసాలు, శివసత్తుల ఆటలు, డప్పు కళాకారుల నృత్యాలు అందర్నీ ఆకట్టుకున్నాయి. ఈ వేడుకల్లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బోనాల పండగ తెలంగాణకే విశిష్ఠమైన వేడుక అన్నారు. ‘‘ వచ్చే ఏడాది కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో బోనాల పండగ నిర్వహించేలా చూస్తాం. అమ్మవారి దయతో అందరూ సుఖసంతోషాలతో ఉండాలి. దేశ రక్షణ కోసం పని చేస్తున్న సైనికులు మరింత శక్తిమంతం కావాలి’’ అని ఆకాంక్షించారు. ఈ వేడుకల్లో దిల్లీలోని తెలంగాణ ప్రత్యేక ప్రతినిధి రామచంద్రుడు, రెసిడెంట్ కమిషనర్ వేదాంతం గిరి, లాల్ దర్వాజ ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.


Comments

Popular posts from this blog

అర్ధరాత్రి రోడ్లపై తిరిగితే అరెస్ట్‌! టోలీచౌకీ పోలీసుల కఠిన చర్యలు

🔐 కొత్త ఆధార్ కార్డు డిజైన్: ఫోటో & QR కోడ్ మాత్రమే – మీ గోప్యతకు కొత్త రక్షణ!

🗳️🔥 లోక్‌సభలో ఘాటు డిబేట్: రాహుల్ విసిరిన 3 ఆరోపణలకు అమిత్ షా ఇచ్చిన ఝలక్!