"దళితుడ్ని సీఎం చేస్తానని కేసీఆర్ మోసంచేశారు’' ౼ భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్
"దళితుడ్ని సీఎం చేస్తానని కేసీఆర్ మోసంచేశారు’'
౼ భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్
దళితుడిని తెలంగాణ ముఖ్యమంత్రి చేస్తానని చెప్పి కేసీఆర్ మోసం చేశారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ ధ్వజమెత్తారు.
దళితులకు మూడెకరాల భూపంపిణీ చేస్తానని.. పనికి రాని భూముల్ని అంటగట్టి వారిని అవమానపర్చారని విమర్శించారు.
సబ్‌ప్లాన్ నిధులన్నీ దారిమళ్లిస్తున్నారని ఆరోపించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం కోసం శంకుస్థాపన చేసి అటకెక్కించారని దుయ్యబట్టారు.
లోయర్ ట్యాంక్‌బండ్‌లోని అంబేద్కర్ భవన్ వద్ద భాజపా ఏర్పాటు చేసిన నిరసన కార్యక్రమంలో లక్ష్మణ్ మాట్లాడారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు.
పార్టీ నేతలు, కార్యకర్తలతో కలిసి అంబేద్కర్ భవన్ ప్రాంగణంలో మొక్కలు నాటారు.
అంబేద్కర్ భవనాన్ని అద్భుతంగా నిర్మిస్తామని చెప్పి మూడున్నరేళ్లయినా ఎందుకు నిర్మించలేదని ప్రభుత్వాన్ని నిలదీశారు.
ప్రభుత్వ దళిత వ్యతిరేక విధానాలను భాజపా తిప్పికొడుతుందన్నారు.
Comments
Post a Comment