"మాతో టచ్చులో 18మంది తెలుగుదేశం ఎమ్మెల్యేలు!.." ౼ బీజేపీ 😳 👏

"మాతో టచ్చులో 18మంది తెలుగుదేశం ఎమ్మెల్యేలు!.."
౼ బీజేపీ
😳 👏
చంద్రబాబుపై బీజేపీ ఆంధ్రప్రదేశ్ కో-ఇంఛార్జ్‌గా వ్యవహరిస్తున్న బీజేపీ జాతీయ కార్యదర్శి సునీల్ దియోధర్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. 

టీడీపీ నుంచి గెలిచిన 23మంది ఎమ్మెల్యేల్లో 18మంది తమతో టచ్‌లో ఉన్నారని దియోధర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 

అంతేకాదు, చంద్రబాబు త్వరలో జైలుకు వెళ్లడం ఖాయమని ఆయన వ్యాఖ్యానించారు. చంద్రబాబుతో పాటు ఆయనకు అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యులు కూడా అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. 

ఆ కారణంగానే టీడీపీ ప్రతిష్ట దిగజారిందని తెలుసుకున్న ఎమ్మెల్యేలు తమతో సంప్రదింపులు జరుపుతున్నారని ఆయన చెప్పారు.
 
చంద్రబాబు చేసిన తప్పుల వల్ల, అవినీతి వల్ల ఏపీలో టీడీపీకి భవిష్యత్ లేకుండా పోయిందని దియోధర్ చెప్పుకొచ్చారు. 

ఇక ఏపీలో బలం పుంజుకునేందుకు బీజేపీ ప్రత్యేక శ్రద్ధ పెట్టిందని.. ఒక్కో లోక్‌సభ నియోజకవర్గంలో లక్ష మందిని పార్టీలో చేర్చుకోవడమే లక్ష్యంగా ముందుకెళ్లనున్నట్లు ఏపీ బీజేపీ కో ఇంఛార్జ్ సునీల్ దియోధర్ తెలిపారు.
By sources 


Comments

Popular posts from this blog

అర్ధరాత్రి రోడ్లపై తిరిగితే అరెస్ట్‌! టోలీచౌకీ పోలీసుల కఠిన చర్యలు

🔐 కొత్త ఆధార్ కార్డు డిజైన్: ఫోటో & QR కోడ్ మాత్రమే – మీ గోప్యతకు కొత్త రక్షణ!

🗳️🔥 లోక్‌సభలో ఘాటు డిబేట్: రాహుల్ విసిరిన 3 ఆరోపణలకు అమిత్ షా ఇచ్చిన ఝలక్!