మందు బాటిళ్లపై గాంధీ బొమ్మలు
మందు బాటిళ్లపై గాంధీ బొమ్మలు!
ఇజ్రాయెల్‌కు చెందిన రెండు బీరు తయారీ సంస్థలు తమ ఉత్పత్తులపై మహాత్మ గాంధీ చిత్రాన్ని ముద్రించించిన ఘటన దేశ వ్యాప్తంగా కలకలం సృష్టించింది.
ఇజ్రాయెల్ 71వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆ దేశానికి చెందిన మాల్కా బ్రేవరీ, నెగేవ్ బీర్స్ అనే సంస్థలు ప్రపంచంలోని ప్రముఖుల ముఖచిత్రాలను తమ మందుబాటిళ్లపై ముద్రించాయి.
ఇందులో భాగంగా.. టీషర్టు, కళ్లజోడు ఉన్న మహాత్మగాంధీ కార్టూన్ లేబుల్‌ను బీరు బాటిళ్లపై అంటించాయి.
By sources
Comments
Post a Comment