హిందుత్వం అంటే

ఆసింధు సింధు పర్యంతా యస్యభారత భూమికా
పితృభూః పుణ్యభూశ్చైవ సవై హిందురితి స్మృతాః
'సింధూ నది మొదలు హిందూ మహా సముద్రం వరకూ ఉన్న ఈ భారత భూమిని మాతృభూమిగా, పితృభూమిగా, పుణ్యభూమిగా భావించిన వారంతా హిందువులే..’ హిందువులు అంటే ఎవరనే ప్రశ్నకు వినాయక దామోదర్‌ సావర్కర్‌ ఇచ్చిన స్పష్టమైన సమాధానం ఇది... చాలా స్పష్టత ఉంది..

హిందుత్వం మీద చర్చ కొత్తేమీ కాదు.. అందరూ తెలుసుకోవాల్సిన విషయమే..
ఈ మధ్య కాలంలో ఒక విఫల నాయకుడు తమ మిడిమిడి జ్ఞానంతో హిందూయిజం, హిందుత్వ వేర్వేరు అని నోరు జారగానే అదేదో ఆణిముత్యంలాంటి సంచలన ప్రకటన అన్నట్లు సోషల్‌ మీడియాలో చర్చకు పెట్టారు..
ఆయన ఎప్పుడు హిందుత్వం మీద ఏడుస్తుంటారు.. జాతీయవాదుల మీద విషం చిమ్ముతుంటాడు.. చరిత్రను తెలుసుకునే ప్రయత్నం చేయడని నేను భావించను.. కానీ కుట్ర పూరితంగా వక్రీకరించి గందరగోళం సృష్టించే ప్రయత్నం చేస్తుంటాడు..
సంతృష్టీకరణ రాజకీయాలతో దేశంలో మెజారిటీ ప్రజలను తీవ్ర నిర్లక్ష్యం చేసిన వ్యక్తులు ఇప్పుడు వారిలో వస్తున్న చైతన్యాన్ని చూసి తట్టుకోలేకపోతున్నారు..

Comments

Popular posts from this blog

అర్ధరాత్రి రోడ్లపై తిరిగితే అరెస్ట్‌! టోలీచౌకీ పోలీసుల కఠిన చర్యలు

🔐 కొత్త ఆధార్ కార్డు డిజైన్: ఫోటో & QR కోడ్ మాత్రమే – మీ గోప్యతకు కొత్త రక్షణ!

🗳️🔥 లోక్‌సభలో ఘాటు డిబేట్: రాహుల్ విసిరిన 3 ఆరోపణలకు అమిత్ షా ఇచ్చిన ఝలక్!