మోదీ ప్రభుత్వం తీస్కొచ్చిన కొత్త రైతు చట్టాల గురించి సులభంగా అర్ధమయ్యేలా చెప్పే ప్రయత్నం 👇👇
మోదీ ప్రభుత్వం తీస్కొచ్చిన కొత్త రైతు చట్టాల గురించి సులభంగా అర్ధమయ్యేలా చెప్పే ప్రయత్నం 👇👇
👉కొత్త రైతు చట్టాల్లో రైతులకు మరియూ వ్యాపారస్థులకు మధ్య జరిగే ఒప్పందాలలో రైతు అనుకూల న్యాయ సంభంధిత క్లాజ్ లను పొందుపర్చింది మోదీ ప్రభుత్వం.
👉రైతు కి, వ్యాపారస్థుడికి మధ్య జరిగే ఒప్పందం పంట వేయకముందు చేస్కోవచ్చు.. రైతుకి ఒప్పంద పత్రాల్లో ఎంతైతే చెల్లించాలని ఒప్పందం జరుగుతుందో దాని ఆధారంగా కొనుగోలు జరిగి తీరాల్సిందే.. ఇందులో నష్టం వస్తే కూడా వ్యాపారస్థుడు భరించే విధంగా రైతు ఒప్పందం చేస్కోవచ్చు.. ఇది వరకు ఆ చట్టం లేదు మన దేశంలో.
👉రైతు తనకు పంట పైన తీయాలనుకున్న ఆదాయం ఒక వ్యాపారస్థుడి వద్ద కుదరదు అనుకుంటే ఇతర వ్యాపారస్థుడి ద్వారా అయినా సంపాదించుకోవచ్చు కాబట్టి వ్యాపారస్థుల మధ్య పోటీతత్వం పెరుగుతుంది.. సిండికేట్ అవ్వడానికి ఆస్కారం ఉండదు.
👉సపోస్ గా రైతు ప్రవేటు వ్యాపారస్థులతో ఎటువంటి ఒప్పందం చేస్కోకుండా పంట వేశాక కావాలనుకుంటే మంచి ధరకు కొనుగోలు చేస్కునే ఏదైనా వ్యాపారస్థుడికి అమ్ముకోవచ్చు లేదా సరాసరి ప్రభుత్వ వ్యావసాయ మార్కెట్ కి వెళ్లి 'కనీస మద్ధతు ధరకు' అమ్ముకోవచ్చు.
👉ప్రైవేటు వాడైతే ఒప్పంద పత్రాల్లో పంట దగ్గరికి వచ్చి ధాన్యాన్ని రావాణా చేస్కునేలా రైతు ఒప్పందం చేస్కోవచ్చు.. కానీ ప్రభుత్వ మార్కెట్ తో అది సాధ్యపడదు.. ఈ కొత్త రైతు చట్టాల వల్ల రైతు సమయం వ్రుధా అవ్వకూడదు అనే ఉద్దేశ్యంతో అలాంటి రైతు అనుకూల పద్ధతులకు అవకాశం కల్పించింది కేంద్రం.
👉మరో విషయం ఏంటంటే రైతులు యూనిట్ల లాగా ఏర్పడి తమ పంట దిగుబడిని మంచి ధర పలికే ప్రాంతంలో బల్క్ గా అమ్ముకునే అవకాశం కూడా కల్పిస్తోంది ఈ కొత్త రైతు చట్టాలు.
👉వ్యాపారస్థులు సిండికేట్ అవ్వడం, అలాగే దళారీల పెత్తనం ఇది వరకు జరిగేది కాబట్టి రైతులకు మేలు జరగలేదు.. ఈ కొత్త చట్టాలు పంట వేయకముందే రైతు అమ్మే ధరను స్వంతంగా నిర్ణయించే హక్కు కల్పిస్తోంది.. స్వతంత్ర భారతదేశంలో రైతు కోరుకున్న అసలు స్వాతంత్ర్యం ఇదే కదా...!!!
ఇన్ని లాభాలు పెట్టుకుని కొందరు వారి రాజకీయ అవసరం కోసం కొత్త రైతు చట్టాలను వ్యతిరేకించడం మూర్ఖత్వం. వారు మోదీని వ్యతిరేకించడం పక్కకు పెడితే నిజానికి ఇన్నేళ్లుగా నష్టపోతున్న రైతుకి కనీసం ఇప్పుడైనా స్వతంత్రంగా తమకు అనుకూల పద్ధతులలో పంట పై మంచి దిగుబడి తీసేందుకు కూడా అవకాశం కల్పించకుండా చేయడం వల్ల ఆదాయం లేని వ్యవసాయం దండగ అంటూ ఇప్పటికే పట్నం బాట పడుతుంటే ఒక విషయం మాత్రం స్పష్టం గా అర్ధమౌతుంది అదేంటంటే మన దేశ భవిష్యత్తు ఆకలితో అలమటించబోతోంది అని. కాబట్టి రైతుకి స్వాతంత్ర్యం కల్పించే కొత్త రైతు చట్టాలకు ప్రతీ ఒక్క భారతీయుడు సమర్ధించాల్సిందే!!
Comments
Post a Comment