కశ్మీర్‌లో భారత్‌జోడో యాత్ర చివరి భాగం విజయవంతమైందని కాంగ్రెస్‌ పార్టీ చంకలు గుద్దుకుంటోంది. కానీ ఈ ఘనత ఎవరికి దక్కాలో ఒక్కసారి అలోచించండి..

కశ్మీర్‌లో భారత్‌జోడో యాత్ర చివరి భాగం విజయవంతమైందని కాంగ్రెస్‌ పార్టీ చంకలు గుద్దుకుంటోంది. కానీ ఈ ఘనత ఎవరికి దక్కాలో ఒక్కసారి అలోచించండి.. 
ఆర్టికల్‌ 370 రద్దు తర్వాత జమ్మూ కశ్మీర్‌ ప్రజలు ఇతర రాష్ట్రాల ప్రజల మాదిరే సంపూర్ఱంగా భారతదేశ పౌరులుగా మారారు. సాటి భారతీయుల్లా వారు కూడా స్వేచ్ఛా స్వాతంత్య్రాలను అనుభవిస్తున్నారు. విద్యా, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరిగాయి. అభివృద్ది కార్యక్రమాలు ఊపందుకున్నాయి. అన్నింటికీ మించి వేర్పాటువాదానికి దాదాపు నూకలు చెల్లాయి. ఉగ్రవాద కార్యకలాపాలు కూడా చాలా వరకూ తగ్గాయి. అక్కడక్కడా ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తున్నా ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ అన్నట్లుగానే చెప్పవచ్చు.. 
32 రెండు ఏళ్ల క్రితం కశ్మీర్‌లో ఉగ్రవాదం వెర్రితలు వేస్తున్న సమయంలో బీజేపీ అధ్యక్షుడు మురళీమనోహర్‌ జోషి ఏక్తాయాత్ర తలపెట్టారు. ఆ యాత్రకు కన్వీనర్‌ ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ.. అప్పుడు దేశాన్ని పాలిస్తున్న పార్టీ కాంగ్రెస్‌.. శ్రీనగర్‌లోని లాల్‌చౌక్‌లో జాతీయ పతాకావిష్కరణతో యాత్ర ముగింది. ఎట్టిపరిస్థితిల్లోనూ అక్కడ తిరంగాను ఎరుగనివ్వబోమని ఉగ్రవాదులు చాలెంజ్‌ చేశారు. అయినప్పటికీ జోషి, మోదీ త్రివర్ణ పతాకం ఎగురవేశారు. ఈ రోజున శ్రీనగర్‌లో అంతగా భయపడాల్సిన అవసరం లేదు. రాహుల్‌ గాంధీ అక్కడ జాతీయ పతాకాన్ని ఎగురవేశారంటే అది అర్టికల్‌ 370 రద్దు తర్వాత ఏర్పడిన పరిస్థితుల పుణ్యామే.. 
కానీ రాహుల్‌ గాంధీ ఇప్పుడు తాను అధికారంలోకి వస్తే ఆర్టికల్‌ 370ని మళ్లీ తెస్తామంటున్నారు. ఆయన ప్రసంగం కూగా వేర్పాటువాదాన్ని రెచ్చగొట్టేలాగే కొనసాగింది.. తినే కంచెంలోనే ఉంచుతామనేవారిని మనం ఏమనగలం? వారి విజ్ఞతకే వదిలేద్దాం.. ఈ రెండు వీడియోలు ఒక్కసారి చూడండి..


Comments

Popular posts from this blog

అర్ధరాత్రి రోడ్లపై తిరిగితే అరెస్ట్‌! టోలీచౌకీ పోలీసుల కఠిన చర్యలు

🔐 కొత్త ఆధార్ కార్డు డిజైన్: ఫోటో & QR కోడ్ మాత్రమే – మీ గోప్యతకు కొత్త రక్షణ!

🗳️🔥 లోక్‌సభలో ఘాటు డిబేట్: రాహుల్ విసిరిన 3 ఆరోపణలకు అమిత్ షా ఇచ్చిన ఝలక్!